
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న 'ఎన్బీకే 111' సినిమా గ్లింప్స్ బాలయ్య పుట్టినరోజున విడుదలైంది. ఈ గ్లింప్స్ లో బాలకృష్ణ కొత్త లుక్, పవర్ఫుల్ నటన ఆకట్టుకుంటున్నాయి


బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న 'ఎన్బీకే 111' సినిమా గ్లింప్స్ బాలయ్య పుట్టినరోజున విడుదలైంది. ఈ గ్లింప్స్ లో బాలకృష్ణ కొత్త లుక్, పవర్ఫుల్ నటన ఆకట్టుకుంటున్నాయి

అద్భుత చిత్రాలను ఎంతో సహజంగా వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు భారతీరాజా బుధవారం కన్నుమూశారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ప్రయత్నంలో ఆయన చాలా కష్టాలు ఎదుర్కొన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: అగ్ర నటుడు బాలకృష్ణ (Balakrishna) తదుపరి చిత్రాలపై కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన కోసం దర్శకులు వివేక్ ఆత్రేయ (Vivek Athreya), విజయ్ కనకమేడల (Vijay...

‘‘నా వయసు చెప్పడం నాకు ఇష్టం లేదు. మానసికంగా నేను యువకుడినే. మేమందరం దర్శకులమని టైటిల్ కార్డ్ వేసుకునే సాహసం చేయలేమని కె.విశ్వనాథ్‌తో చెప్పా. నేను, ఇళయరాజా ఆయన కాళ్ల మీద పడ్డాం. బాపు గొప్ప మనిషి.

దాదాపు పదేళ్ల తర్వాత ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో కమ్‌బ్యాక్ ఇస్తున్నారు నటుడు వడ్డే నవీన్. ఈ సినిమాలో రాశీ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ నెల 19న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రముఖ దర్శకుడు భారతీరాజా (Bharathiraja) మరణం తీరనిలోటని నటి ముచ్చర్ల అరుణ, నటుడు అలీ సంతాపం తెలిపారు. ప్రస్తుతం వాళ్లు ఓ కామెడీ షో షూటింగ్‌లో ఉన్న కారణంగా చెన్నైకి వెళ్లలేకపోయినందుకు బాధపడ్డారు.

ఇంటర్నెట్ డెస్క్: దిగ్గజ దర్శకుడు భారతీరాజా (Bharathiraja) పార్థివదేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అనారోగ్యం కారణంగా భారతీరాజా నేడు తుది శ్వాస విడిచారు. అభిమానుల సందర్శనార్థం ఆయన...

భారతీరాజా.. భారతీయ సినీ ప్రపంచంలో గ్రామీణ జీవితానికి కొత్త భాషను నేర్పిన దర్శకుడు. పల్లె అందం, అక్కడి మనుషుల స్వచ్ఛమైన ప్రేమ, వారి అనుబంధాలు - ఆనందాలు, బాధలు - భావోద్వేగాలను ఎంతో సహజంగా వెండితెరపై...

ఇంటర్నెట్ డెస్క్: నేడు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో సందడి నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు (Balakrishna) విషెస్ తెలుపుతున్నారు. ఆయన సినిమా పోస్టర్లు షేర్...

ఇంటర్నెట్ డెస్క్: తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా (Bharathiraja) నేడు తుదిశ్వాస విడిచారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు రూపొందించిన ఆయన మృతి పరిశ్రమకు తీరని లోటు అంటూ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన నేడు చెన్నైలో కన్నుమూశారు. ఆయన...

ఇంటర్నెట్ డెస్క్: ‘పెద్ది’లో (Peddi) వివాదాస్పదమైన సన్నివేశాలను తొలగించినట్లు దర్శకుడు బుచ్చిబాబు వెల్లడించారు. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతున్నప్పటికీ ఇందులోని కొన్ని సన్నివేశాలపై...

ఇంటర్నెట్‌డెస్క్: తన అపార్ట్‌మెంట్‌లో ఉండే ఓ కుక్కను విచక్షణారహితంగా కొట్టి చంపేశారంటూ నటి మంజరి ఫడ్నిస్ (Manjari Fadnis) ఆవేదన వ్యక్తంచేశారు. 2019లో తమ సొసైటీలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ కుక్కని...

ఇంటర్నెట్ డెస్క్: కథానాయకుడు నాగచైతన్య ‘దూత’ సిరీస్‌తో ఓటీటీ రంగప్రవేశం చేసి హిట్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ విడుదలై ఘన విజయం సాధించింది. మూడేళ్ల తర్వాత...

ఇంటర్నెట్ డెస్క్: ‘పెద్ది’ (Peddi) సినిమా విడుదలైన తర్వాత అందులో హీరోయిన్ పాత్ర ఇండస్ట్రీలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ వివాదంపై సీనియర్ నటి జయా బచ్చన్ (Jaya Bachchan) స్పందించారు.

‘‘నిజమైన సంఘటనల స్ఫూర్తితో రూపొందిన సినిమా ‘స్లమ్ డాగ్’. యాక్షన్ చిత్రమే అయినా, నిజమైన భావోద్వేగాలే ఇందులో కీలకం’’ అన్నారు పూరి జగన్నాథ్. ఆయన దర్శకత్వం వహిస్తూ... ఛార్మి, జె.బి.నారాయణరావుతో...

‘బిచ్చగాడు’ విజయం తర్వాత కథానాయకుడు విజయ్ ఆంటోని.. దర్శకుడు శశి కలిసి చేసిన సినిమా ‘వంద దేవుళ్లు’. ఫాతిమా విజయ్ ఆంటోని సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి నిర్మించారు. శ్వాసిక, అజయ్, కావ్య తదితరులు కీలక...

ఇంటర్నెట్ డెస్క్: కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తెరకెక్కించిన చిత్రం ‘స్లమ్‌డాగ్’ (SlumDog). సంయుక్త, టబు తదితరులు...

విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ (SlumDog - 33 Temple Road). ఈ మూవీ టీజర్ సోమవారం విడుదలైంది. ‘‘ఒక్క వాన...

విజయ్ ఆంటోనీ (Vijay Antony) హీరోగా దర్శకుడు శశి తెరకెక్కించిన ‘బిచ్చగాడు’ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే కాంబినేషన్‌లో తెరకెక్కిన కొత్త సినిమా ‘వంద దేవుళ్లు’ (Vanda Devullu). ఈనెల 19న...

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నుంచి వస్తున్న కొత్త ప్రయోగాత్మక చిత్రం ‘సింగ్ గీతం’. వైజయంతి మూవీస్ పతాకంపై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన సినిమా ఇది. అయాన్, అహల్య, శాలిని ప్రధాన...

ఇంటర్నెట్ డెస్క్: తానెప్పుడూ భార్యను మోసం చేయలేదని నటుడు మాధవన్ సరదాగా చెప్పారు. జూన్ 6న వివాహ వార్షికోత్సవం చేసుకున్న ఆయన (R. Madhavan) కొన్ని సరదా సన్నివేశాలను ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు. తాను...

ఇంటర్నెట్ డెస్క్: సినీప్రియులందరి దృష్టి ప్రస్తుతం ‘రామాయణ’ (Ramayana) మీదే ఉంది. బాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్.. రాముడి పాత్రలో, సీతగా సాయి పల్లవి...

ఇంటర్నెట్ డెస్క్: ‘పెద్ది’ మీద తాను ప్రాణం పెట్టుకున్నట్లు జగపతిబాబు చెప్పారు. మధ్యలో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ తాను మాత్రం ‘పెద్ది’ (Peddi) విడుదల కోసమే ఎదురుచూసినట్లు తెలిపారు. రూ.300 కోట్లు...

ఇంటర్నెట్ డెస్క్: సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కరుప్పు’(Karuppu). తెలుగులో ‘వీరభద్రుడు’గా విడుదలైంది. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

‘‘గత పదేళ్లుగా నాకు నటనను మానేయాలని అనిపిస్తూనే ఉంది. కానీ సరిగ్గా ఆ సమయంలోనే ఏదో ఒక పాత్ర నా ఖాతాలో వచ్చి చేరుతుంద’’ని అంటున్నారు హిందీ నటుడు మనోజ్ బాజ్‌పేయీ. ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’,...

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం ‘సింగ్ గీతం’ (Sing Geetham). సంగీతం ప్రధానంగా రూపొందిన ఈ సినిమా జూన్ 11న (Sing Geetham Release Date) ప్రేక్షకుల ముందుకు...

మాటలే పాటలైతే ఎలా ఉంటుందో అదే ‘సింగ్ గీతం’ అని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెలిపారు. 94 ఏళ్ల వయసులో ఆయన తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 11న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం చెన్నైలో...

ఇంటర్నెట్ డెస్క్: సూర్య వశిష్ఠ, దీప్షికా చంద్రన్ జంటగా నటించిన సినిమా ‘రమణి కల్యాణం’ (Ramani Kalyanam). ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ‘సన్‌నెక్స్ట్’ (SUN NXT)లో జూన్ 12 (Ramani Kalyanam...

ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. మాల్యవి కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో దమ్మాయిగూడ, చిల్కానగర్ ప్రాంతాలకు చెందిన పేద కార్మికులకు జీవనోపాధి కోసం ఆటోలను అందించారు. ఈ సేవా కార్యక్రమం...

ఇంటర్నెట్ డెస్క్: ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రముఖ దర్శకుడు సింగీత శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) తెరకెక్కించిన కొత్త చిత్రం ‘సింగ్ గీతం’ (Sing Geetham). 94 ఏళ్ల వయసులో ఆయన...

ఇంటర్నెట్‌డెస్క్: బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ మంచి వసూళ్లు రాబడుతోంది. మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం పోస్టర్‌ను పంచుకుంది. ‘బాక్సాఫీస్...

ఇంటర్నెట్ డెస్క్: తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ప్రముఖ హీరో రవితేజ (Ravi Teja) నటిస్తున్న సినిమా ‘ఇరుముడి’ (Irumudi Movie). శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ విడుదల తేదీ ఆదివారం ఖరారైంది.

ఇంటర్నెట్ డెస్క్: బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరించిన రియాలిటీ షోల్లో ‘బిగ్‌బాస్’ (BiggBoss) ఒకటి. ఇప్పటికే 9 సీజన్లతో వినోదం పంచిన ఈ కార్యక్రమం 10వ సీజన్ (Biig Boss Telugu 10) త్వరలోనే...

ఇంటర్నెట్ డెస్క్: మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ సలీమ్‌కుమార్ (56) మరణించారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. కొచ్చిలోని ఓ...

ప్రతి బుధవారం, గురువారం ప్రేక్షకులను అలరిస్తున్న డ్యాన్స్ షో ‘ఢీ 20’ (Dhee 20). ఎలిమినేటర్ వీక్‌లో భాగంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ వారం ఎపిసోడ్లు ఉత్కంఠగా సాగనున్నాయి.

ఇంటర్నెట్‌డెస్క్: వరుస చిత్రాలు, వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్. ఇప్పుడు మరో సరికొత్త యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. భరణ్...

ఇంటర్నెట్‌డెస్క్: నటనలోనే కాదు, వంట చేయడంలోనూ చేయి తిరిగిన దిట్ట మన స్టార్ కథానాయకుడు ఎన్టీఆర్ (NTR). షూటింగ్‌ల నుంచి ఖాళీ సమయం దొరికితే కిచెన్‌లో చేరి వెరైటీ వంటలన్నీ చేస్తారు. ఆయన చేతి...

ఇంటర్నెట్‌డెస్క్: రామ్‌చరణ్ లేకపోతే ‘పెద్ది’ లేదని దర్శకుడు బుచ్చిబాబు అన్నారు. తాజాగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తొలి రోజు రూ.135కోట్లు చేసినట్లు చిత్ర బృందం...

ఇంటర్నెట్ డెస్క్: ‘దూత’ వెబ్‌సిరీస్‌తో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు నటుడు నాగచైతన్య. ఇప్పుడు ఈ హిట్ సిరీస్‌కు (Dhootha) సీక్వెల్ సిద్ధమవుతోంది. నేడు పూజా కార్యక్రమాలు జరగ్గా..

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటుడు, దర్శకుడు రితేశ్ దేశ్‌ముఖ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘రాజా శివాజీ’ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ పార్టీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వివాదం చెలరేగింది. ఆ వీడియోలో రితేశ్.. (Riteish Deshmukh) ఛత్రపతి శివాజీ ఫొటో ఉన్న టీషర్ట్ ధరించి డ్యాన్స్ చేయడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనితో పాటు, గొప్ప సినిమా తీసి దాని సక్సెస్ పార్టీలో మద్యం తీసుకొని డాన్స్ వేశారంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. దీనిపై రితేశ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘‘ఇటీవల విడుదలైన ‘రాజా శివాజీ’ సినిమాకు ప్రేక్షకులు అందించిన అపూర్వమైన ఆదరణను సెలబ్రేట్ చేసుకోవడానికి మేమంతా చిన్న వేడుకను ఏర్పాటుచేసుకున్నాం. దానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. ఒక శివ భక్తుడిగా (శివాజీ మహరాజ్ అనుచరుడిగా) దీనిపై స్పష్టత ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ఛత్రపతి శివాజీ మహరాజ్ ఫొటో ఉన్న టీషర్ట్ ధరించి వేడుక చేసుకోవడం వెనుక, ఆయనను అవమానించాలనే ఉద్దేశం నాకు లేదు. సినిమా ప్రమోషన్స్ కోసం నేను ఆ టీషర్ట్‌ను ధరిస్తున్నాను. ఆ రోజు కూడా ప్రమోషన్స్ ముగించుకుని నేరుగా ఈ ఈవెంట్‌కు వెళ్లాను. దీంతో నాకు డ్రెస్ మార్చుకునే సమయం లేదు. ఇక మద్యం తీసుకున్నానంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదు. నేను నా జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడూ మద్యం తీసుకోలేదు. భవిష్యత్తులోనూ ఎప్పటికీ ముట్టను’’ అని స్పష్టంచేశారు. తనవల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించమని కోరారు. ఛత్రపతి శివాజీ అంటే తనకు ఎంతో గౌరవమని అన్నారు. రితేశ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా శివాజీ’ చిత్రం మరాఠీ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. రూ.117.41 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇందులో జెనీలియా, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, విద్యాబాలన్ తదితరులు కీలక పాత్రలు పోషించగా, సల్మాన్ ఖాన్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇంటర్నెట్ డెస్క్: నటి జాన్వీకపూర్ ఒక ఇన్‌స్టా పోస్ట్‌కు చేసిన లైక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ (Peddi) తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. దీనికి సంబంధించి ఇన్‌స్టాలో ఓ పేజ్ పెట్టిన రివ్యూను జాన్వీకపూర్ లైక్ చేశారు. అయితే ఆ రివ్యూలో జాన్వీకపూర్ పాత్రకు సరైన ప్రాధాన్యం దక్కలేదని రాశారు. ‘పెద్ది: భారతీయ సినిమా చరిత్రలో ఒక కథానాయికకి జరిగిన అత్యంత అవమానం’ అని హెడ్డింగ్ పెట్టారు. దీన్ని జాన్వీ (Janhvi Kapoor) లైక్ చేయడం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. తన పాత్రకు ప్రాధాన్యం దక్కలేదని జాన్వీ స్వయంగా సమర్థించారని కొందరు అంటుంటే.. పొరపాటున కొట్టి ఉంటారని మరికొందరు భావిస్తున్నారు. ఈ వార్తలు రావడంతో జాన్వీ ఆ పోస్ట్‌ను అన్‌లైక్ చేశారు. అయితే ఈలోపే దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీకపూర్ ‘అచ్చియమ్మ’ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లలో జోరు చూపినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి రోజు ప్రీమియర్స్‌తో కలిపి రూ.120 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం (Peddi Collections). ఈ వసూళ్లకు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

యద్దనపూడి: ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్ర విజయంతో మంచి జోష్ మీదున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. మరోసారి సంక్రాంతే లక్ష్యంగా సినిమాను తీసుకొచ్చేందుకు సిద్ధవుతున్నారు. వెంకటేశ్, నందమూరి కల్యాణ్‌రామ్ కీలక పాత్రల్లో మూవీ రూపొందించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. తన స్వగ్రామం బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం చిలుకూరివారిపాలెంలో గురువారం శ్రీఆంజనేయుస్వామి సన్నిధిలో పండితుల నేతృత్వంలో నూతన మూవీ స్క్రిప్ట్‌నకు పూజలు చేయించారు. మల్టీస్టారర్ చిత్రానికి అనిల్ ఆధ్వర్యంలో సిద్ధం చేసిన స్క్రిప్ట్‌నకు పసుపు, కుంకుమ అద్ది తన తల్లిదండ్రులు రావిపూడి బ్రహ్మయ్య, అనంతలక్ష్మి చేతులమీదుగా ఆయన అందుకున్నారు. వెంట ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయికృష్ణ, రచయిత నారాయణ, కో-డైరెక్టర్ సూర్య, ఎడిటర్ తమ్మిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిలుకూరివారిపాలెంలో సందడి నెలకొంది. అనంతరం పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ సన్నిధిలోనూ నూతన చిత్రం విజయవంతం కావాలని స్క్రిప్ట్‌నకు పూజలు చేశారు. జులై లేదా ఆగస్టు నుంచి ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సంగీత దర్శకుడిగా జి.వి.ప్రకాశ్‌కుమార్‌ని ఎంపిక చేశారు. తాను రూపొందిస్తున్న కథల్ని దృష్టిలో ఉంచుకుని, ఎప్పటికప్పుడు సంగీత దర్శకుల్ని మారుస్తుంటారు అనిల్ రావిపూడి. ఈసారి జి.వి.ప్రకాశ్‌కుమార్‌కు స్వరాల బాధ్యతల్ని అప్పజెప్పారు. కథ, కథనం పరంగానూ ఈ సినిమా మరింత ప్రత్యేకంగా ఉండేలా అనిల్ రావిపూడి రచన చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన కీర్తిసురేశ్, కల్యాణ్‌రామ్ సరసన కృతిశెట్టి నటిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Click to read full story.

Click to read full story.


ఇంటర్నెట్ డెస్క్: తాను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా తన మనసంతా ‘పెద్ది’ దగ్గరే ఉందని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ (Peddi) నేడు ప్రేక్షకుల ముందుకువచ్చి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఒక తండ్రిగా, నటుడిగా తనకెంతో గర్వంగా ఉందంటూ చిరంజీవి పోస్ట్ పెట్టారు. ఈసందర్భంగా చిత్రబృందాన్ని అభినందించారు. ‘‘నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం, పెట్టిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను. ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది. ‘పెద్ది’ పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయతీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం’’ అని రామ్ చరణ్‌ను (Ram Charan) చిరంజీవి ప్రశంసించారు. ‘‘ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబుకు ప్రత్యేక అభినందనలు. అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత సతీశ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, ‘కరునాడ చక్రవర్తి’ శివరాజ్ కుమార్‌కు, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు జగపతిబాబుకు అభినందనలు. అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించేలా నేపథ్య సంగీతాన్ని అందించిన ఏఆర్ రెహమాన్‌కు ప్రత్యేక అభినందనలు. ఈ సినిమా విజయంలో భాగమైన జాన్వీ కపూర్ (Janhvi Kapoor), దివ్యేందుతో పాటు సాంకేతిక నిపుణులందరికీ కంగ్రాట్స్..’’ అంటూ చిత్రబృందాన్ని అభినందించారు. ‘పెద్ది’ సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమాకి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

ఇంటర్నెట్ డెస్క్: తన ఆటలతో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు రామ్ చరణ్ (Peddi). ఆయన హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ థియేటర్‌లలో సందడి చేస్తోంది. ఈ చిత్రం ప్రీమియర్స్‌లో రామ్ చరణ్ భార్య ఉపాసన ఎంజాయ్ చేశారు. హైదరాబాద్ బాలానగర్‌లో స్పెషల్ స్క్రీనింగ్‌కు వచ్చిన ఉపాసన (Upasana), అభిమానుల మధ్య సినిమా చూసి వారిలో ఉత్సాహం నింపారు. రామ్ చరణ్ ఎంట్రీ సమయంలో పేపర్‌లు ఎగరేసి జోష్ పెంచారు. ఫ్యాన్స్‌తో పాటు ఆమె కూడా ఉత్సాహంగా అరుస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక పెద్ది హిట్ టాక్ రావడంతో థియేటర్‌ల వద్ద పండగ వాతావారణం నెలకొంది. రామ్ చరణ్ (Ram Charan) నటనను ప్రశంసిస్తూ సెలబ్రిటీలు పోస్ట్‌లు పెడుతున్నారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందంటూ అభినందిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Peddi Movie Review || చిత్రం: పెద్ది; నటీనటులు: రామ్‌చరణ్, శివరాజ్‌కుమార్, జాన్వీకపూర్, జగపతిబాబు, దివ్యేందు, బొమన్ ఇరానీ, రవి కిషన్ తదితరులు; సంగీతం: ఏఆర్ రెహమాన్; సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు; ఎడిటింగ్: నవీన్ నూలి; నిర్మాత: వెంకట సతీశ్ కిలారు, ఇషాన్ సక్సేనా; రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సానా; విడుదల: 04-06-2026 తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూసిన సినిమాల్లో ‘పెద్ది’ (Peddi Movie) ఒకటి. రెండో సినిమానే రామ్‌చరణ్‌ను డైరెక్ట్ చేసే అవకాశం బుచ్చిబాబుకు రావడం, జాన్వీకపూర్ కథానాయికగా నటించడం, ఏఆర్ రెహమాన్ సంగీతం ఇలా అన్నీ ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. మరి ‘పెద్ది’ ఆ అంచనాలను అందుకుందా? రామ్‌చరణ్‌కు విజయాన్ని అందించిందా? బుచ్చిబాబు మేకింగ్ ఎలా ఉంది? Peddi movie story || విజయనగరం జిల్లాలోని కొండ కింద ఊరు అది. వందల మంది జీవనం సాగిస్తున్నా, ప్రభుత్వ రికార్డుల్లో ఆ ఊరికి గుర్తింపు అన్నదే ఉండదు. అందుకే ఆ ఊరు అన్నా, అక్కడి నుంచి వచ్చిన మనుషులన్నా అందరికీ చిన్న చూపు. ఆ ఊళ్లో పుట్టి పెరిగిన వాడే పెద్ది (రామ్‌చరణ్). రోజూ విజయనగరం వెళ్లి కూలి పనులు చేసుకుంటుంటాడు. పేరుకి కూలీ అయినా క్రికెట్‌లో మాత్రం రాటు దేలిన ఆటగాడు. అందుకే విజయనగరం, బొబ్బిలి క్రికెట్ జట్లు వేలంలో పెద్దిని కొనేందుకు పోటీపడుతుంటాయి. ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టగలిగిన మొనగాడైన పెద్దిని అంతా ఆట కూలీ అని పిలుస్తుంటారు. అలాంటి ఆటగాడు క్రికెట్‌ని వదిలి కుస్తీ క్రీడాకారుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది? కొండకింద ఊరు, అక్కడి మనుషుల కోసం పెద్ది చేసిన పోరాటంలో అతను ఏం కోల్పోయాడు? ఏం సాధించాడు? పెద్ది ప్రయాణంపై అప్పలసూరి (జగపతిబాబు), గౌర్‌నాయుడు (శివరాజ్‌కుమార్) ఎలాంటి ప్రభావం చూపించారు? ఈ కథలో అచ్చియమ్మ (జాన్వీ కపూర్) ఎవరు?(peddi review) తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. Peddi Movie Review Telugu || గుర్తింపే తమ ఆత్మగౌరవం అని నమ్మి పోరాటం చేసిన ఓ క్రీడాకారుడి స్ఫూర్తిదాయక ప్రయాణమే ఈ చిత్రం. కన్నతల్లిలాంటి తన ఊరికి, అక్కడ పుట్టి పెరిగిన మనుషులకూ గుర్తింపే లక్ష్యంగా పెద్ది ఎంత దూరం వెళ్లాడు?రెండు ఆటల్ని కలిపి ఆడే క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా ఎలా అవతరించాడన్నది ఇందులో కీలకం. ఈ మధ్య అగ్ర తారల సినిమాలు అనగానే మితిమీరిన హీరోయిజం, ఎలివేషన్స్‌కే పెద్దపీట వేస్తుంటారు దర్శకులు. అందుకు భిన్నంగా గుర్తింపు లేని ఓ ఊరి కథని, అలాంటి ఊళ్లో పుట్టి పెరిగి తరాలకు స్ఫూర్తిని నింపిన ఓ క్రీడాకారుడి ప్రయాణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది. క్రీడా నేపథ్యం లో ఇందులోనూ కొన్ని ఎలివేషన్స్ ఉన్నప్పటికీ అవన్నీ కథలో భాగంగానే అనిపిస్తాయి తప్ప ఎక్కడా తెచ్చిపెట్టినట్టు అనిపించవు 2016 ఒలింపిక్స్ క్రీడలు ముగింపు తర్వాత నుంచి ఈ కథ మొదలవుతుంది. కోల్‌కతా నుంచి విజయనగరం మీదుగా కొండ కింద ఊరికి ప్రయాణం చేస్తుంది. లోయలు, జలపాతాలు దాటి మరీ వెళ్లాల్సిన ఆ ఊరిని పరిచయం చేసిన తీరే కాస్త సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఆట కూలీగా పెద్ది పరిచయంతో అసలు సిసలు సందడి మొదలవుతుంది. అతను ఆడే క్రికెట్ సినిమాకి ప్రధాన ఆకర్షణ. క్రికెట్ చరిత్రలోనే లేని సరికొత్త షాట్స్ ఆడుతూ రక్తికట్టిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ప్రవేశం, ఆమె రాజకీయ ఎత్తుగడలు, ఆమె వెనక హీరో పడే సన్నివేశాలతో కథ నుంచి సినిమాని కాస్త పక్కకు తీసుకెళ్లాయి. అయితే, అప్పలసూరి చుట్టూ అల్లిన సన్నివేశాలతో కథలోని అసలైన సంఘర్షణ ఆవిష్కృతమవుతుంది. భావోద్వేగాలకు కావాల్సిన బలమైన పునాదిని ఆ సన్నివేశాలతోనే వేశాడు దర్శకుడు. విరామానికి ముందు వచ్చే రెండు బలమైన ఘట్టాలు సినిమాని మరోస్థాయికి తీసుకెళతాయి. ఆట మారిన తీరు చాలా సహజంగా కుదిరింది. విరామం తర్వాత కుస్తీ నేపథ్యంలో సన్నివేశాలు సినిమాకి మరింత కీలకం. ఆ పోరాట ఘట్టాల్ని కొరియోగ్రఫీ చేసిన విధానమూ ప్రత్యేకంగా ఉంది. క్రాస్ ఓవర్ అథ్లెట్ నేపథ్యం గురించి అక్కడ పరిచయం చేయడం, క్రికెట్‌నీ, కుస్తీని కలిపి మైదానంలో హీరో చెలరేగిపోయే తీరు పైసా వసూల్. ఇక కుస్తీ నేపథ్యంలో డ్రామా, ఆస్పత్రి సన్నివేశాలు మనసుల్ని హత్తుకుంటాయి. ప్రథమార్ధం తరహాలో ఇక్కడ కూడా ఆట మారే సందర్భం ఉంటుంది. అయితే, ఒక ఆట నుంచి మరో ఆటకు మారే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, సంఘర్షణని ఇక్కడ చూపించేంత సమయం దర్శకుడికి దొరకలేదు. పెద్ది ఏ ఆటనైనా ఇట్టే అంది పుచ్చుకుంటాడని ఓ చిన్న డైలాగ్‌తో సరిపెట్టేశారు. పతాక సన్నివేశాలు హృద్యంగా సాగుతాయి. ప్రథమార్ధంలో ఎక్కువగా కమర్షియల్ హంగులకే ప్రాధాన్యమిచ్చిన దర్శకుడు... ద్వితీయార్ధంలో పూర్తిగా కథపైనే దృష్టిపెట్టాడు. అయితే ఫస్టాఫ్‌లోని కొన్ని పాత్రలు సెకండాఫ్‌కు వచ్చేసరికి అనూహ్యంగా మారిపోయి కనిపిస్తాయి. దానివెనక లాజిక్ ఉండదు. అక్కడక్కడా కొన్ని కొన్ని లోపాలున్నా ఇదొక అర్థవంతమైన, స్ఫూర్తిదాయకమైన సినిమా. కమర్షియల్

తిరుమల శ్రీవారిని ‘పెద్ది’ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు దర్శించుకున్నారు. బుధవారం సాయంత్రం కుటుంబసభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో బుచ్చిబాబు మాట్లాడారు. ‘పెద్ది’ కోసం హీరో రామ్‌చరణ్‌తో పాటు చిత్ర యూనిట్ అంతా చాలా కష్టపడ్డామని చెప్పారు. శ్రీవారి ఆశీస్సులతో ‘పెద్ది’ ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇదీ చదవండి: ‘పెద్ది’కి పవన్ విషెస్.. థాంక్స్ చెప్పిన చరణ్

ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్‌లో చర్చనీయాంశమైన ‘డాన్ 3’ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా ఈ వివాదం కోర్టు మెట్లెక్కింది. తనపై నిషేధం విధించిన ఎఫ్‌డబ్ల్యూఐసీఈ సంస్థకు మంగళవారం రణ్‌వీర్ (Ranveer Singh) లీగల్ నోటీసులు పంపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు తమకు నోటీసులు అందినట్లు ఎఫ్‌డబ్ల్యూఐసీఈ (FWICE) చీఫ్ అడ్వైజర్, ఫిల్మ్‌మేకర్ అశోక్ పండిట్ ధ్రువీకరించారు. దీనిపై ఈరోజు సాయంత్రం ముంబయిలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈనేపథ్యంలో సాయంత్రం ఏం చెబుతారా అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించాలనుకున్న ‘డాన్ 3’ సినిమా నుంచి రణ్‌వీర్ మధ్యలో వైదొలిగారు. ఈ క్రమంలో.. రణ్‌వీర్ చర్చలకు సహకరించలేదని, నిర్మాతలు నష్టపోయిన రూ.45 కోట్ల ప్రీ ప్రొడక్షన్ నష్టపరిహారం విషయంలో నిర్మాణ సంస్థతో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకునే వరకూ ఆయనతో కలిసి పని చేయవద్దని ఆదేశిస్తూ ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై నటుడి టీమ్ స్పందిస్తూ.. ఆయనకు వృత్తిపై అపారమైన గౌరవం ఉందని తెలిపింది. సినిమా హిట్ కావాలని కోరుకుంటారని అందుకే ఈ వివాదంపై మౌనంగా ఉంటున్నారని వెల్లడించింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

విశాఖపట్నం ఆనందపురం: డ్యాన్స్ మాస్టర్ పండుకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని లొడగలవానిపాలెం వద్ద మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. అనకాపల్లి ప్రాంతానికి చెందిన బాలు రైడర్స్ అనే డాన్స్ గ్రూప్ భీమిలి మండలంలో మంగళవారం రాత్రి ఓ ఈవెంట్ పూర్తిచేసుకుని వస్తుండగా విశాఖ జిల్లా ఆనందపురం మండలం లొడగలవాని పాలెం వద్దకు వచ్చేసరికి కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు వాంతులు కావడంతో వాహనంలో ఉన్న వ్యక్తులు రోడ్డుపైకి దిగారు. ఈ నేపథ్యంలో కోళ్ల లోడ్‌తో వస్తున్న వాహనం ఒక్కసారిగా వెనుక నుంచి కారును ఢీ కొట్టింది. దీంతో కారు వెనకాల భాగంలో నిలబడిన పండు మాస్టర్ తో పాటు లిఖిత ప్రియ, హారిక అనే మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మరో కారులో పండు మాస్టర్‌ని విశాఖ నగరంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. స్థానికుల సమాచారంతో అక్కడ చేరుకున్న హైవే సిబ్బంది ఆనందపురం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదంలో పండు మాస్టర్ రెండు కాళ్లకు బలంగా గాయాలు అయినట్లు తోటి ప్రయాణికులు చెప్తున్నారు. ఆనందపురం సిఐ వాసు నాయుడు ప్రమాద తీరుపై ఆరా తీస్తున్నారు. బొలెరో వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం, నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ఇంటర్నెట్ డెస్క్: భారీ అంచనాలతో రానున్న ‘పెద్ది’ (Peddi) విడుదలకు ముందే రికార్డులు నెలకొల్పుతోంది. రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఓవర్సీస్‌లో ఒకరోజు ముందుగానే (జూన్ 3) విడుదల కానుంది. అక్కడ ప్రీ బుకింగ్స్ ఓపెన్ కాగా టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. దీంతో ఈ చిత్రం రిలీజ్‌కు ముందే వన్ మిలియన్ క్లబ్‌లోకి చేరింది. నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్ల గ్రాస్ మార్క్‌ను చేరుకుని రికార్డు సృష్టించింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత ప్రీమియర్స్ లోనే చరణ్‌కు ఇదే వన్ మిలియన్ మార్క్ సినిమాగా తెలుస్తోంది. మరోవైపు చిత్రబృందం ప్రచార జోరు పెంచింది. తాజాగా బుచ్చిబాబు ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. చరణ్ ఎంతో కష్టపడ్డారని అన్నారు. పెద్ది అందరి గుండెల్లో ఎప్పటికీ ఉండిపోతాడని చెప్పారు. అందుకు కారణం రామ్‌చరణ్ ఆ పాత్రలో ఒదిగిపోయిన విధానమేనన్నారు. కుస్తీ సన్నివేశాల్లో దెబ్బలు తగిలినా లెక్క చేయకుండా నటించారని ప్రశంసించారు. కంటికి గాయం అయినప్పుడు చిరంజీవి ఏమంటారో అని తనకు భయమేసిందని చెప్పారు. చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్ (Janhvi kapoor) నటించిన ఈ సినిమాలో జగపతి బాబు, శివరాజ్‌కుమార్ కీలకపాత్రలు పోషించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ఇద్దరు అమ్మాయిల పరిచయం ఒకసారి ప్రేమలా మరోసారి స్నేహంలా అనిపిస్తుంటే.. నిజంగా వాళ్లతో తనకున్న బంధమేంటో తేల్చుకోలేక తనలో తానే మదన పడిపోతున్నాడో యువకుడు. అలా వారితో బంధంలో స్పష్టత లేకుండా దోబూచులాడుతూ సరదాగా సాగిపోతున్న తన జీవితంలో ప్రేయసిని నిర్ణయించుకోవాల్సిన సమయం వస్తుంది. అప్పుడు తనకు ఎదురైన సవాళ్లేంటి? ఇద్దరిలో ఎవరిని స్నేహం పేరుతో బాధపెట్టాడో తెలియాలంటే ముక్కోణపు ప్రేమకథా నేపథ్యంలో రూపొందిన ‘కాక్‌టెయిల్ 2’ సినిమా చూడాల్సిందే. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, కథానాయికలు రష్మిక, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. హోమీ అడజానియా తెరకెక్కించారు. దినేష్ విజన్, లవ్ రంజన్ తదితరులు నిర్మించారు. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘‘కొత్తగా పరిచయమయ్యే స్నేహితులు కొత్తగా అనిపిస్తారు.. వారి కథలు కొత్తవి కాబట్టి. పాత స్నేహితుల కథలు విసుగు పుట్టిస్తాయి. కానీ, ప్రేమ ఉన్నట్టుండి స్నేహంలా అనిపిస్తే..’ లాంటి సంభాషణలతో సాగే ఈ ట్రైలర్ నాయకానాయికల మధ్య ఉంది ప్రేమా.. స్నేహమా అనే ప్రశ్నలతో ప్రేక్షకుల్ని ఆలోచింపజేసేలా ఆకట్టుకుంటుంది. ‘వాళ్లు ఎప్పుడూ వార్తల్లో నిలవలేదు.. ఈ రోజు వారే ఓ కథగా మారబోతున్నారం’టూ తన రాబోయే కొత్త చిత్రం ‘భారత భాగ్య విధాత’ ప్రపంచాన్ని పరిచయం చేసింది బాలీవుడ్ కథానాయిక కంగన. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మనోజ్ తపాడియా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కంగన, శైలేష్ ఆర్.సింగ్ తదితరులతో కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా సామాజిక మాధ్యమాల్లో అధికారిక ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్‌లకు ధైర్యం చెబుతూ, ఎప్పుడూ తమ కబుర్లతో నవ్విస్తూ ఉండే ఆసుపత్రి సిబ్బందిని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది ఉగ్రదాడి. ఈ నేపథ్యంలో ‘ప్రేమ, కరుణతో మానవత్వం చాటుతూనే.. ఊపిరి ఉన్న ప్రతి ఒక్కరినీ కాపాడాలి. మనం ముఖ్యం కాదు.. మనం చేసే పనే ముఖ్యం’ అనే నినాదంతో ఉగ్రవాదుల నుంచి తప్పించుకుంటూ.. సిబ్బంది చేసే వీరోచిత ప్రయత్నాలతో ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించేలా ఉందీ ట్రైలర్. నిజజీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు చిత్రవర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో ఓ నర్సు పాత్రలో కనిపించనుంది కంగన. శ్రీహరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం... ‘పెళ్లైంది కాని నో కహాని’. స్మిత కథానాయిక. ఏడుకొండలు తాడిశెట్టి దర్శకుడు. మై3 సినిమాస్ నిర్మిస్తోంది. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని కథానాయకుడు రాజ్‌తరుణ్ ఇటీవల విడుదల చేశారు. ఆద్యంతం సరదాగా సాగుతూ వినోదం పంచే సినిమా ఇదని, వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని కథానాయకుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో పద్మనాభరెడ్డి, నటుడు జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

‘ఉప్పెన’ తర్వాత ఐదేళ్లకు ‘పెద్ది’ (Peddi) సినిమా చేశానని దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు. ఈ చిత్రం కోసమే ఇన్నేళ్లూ సమయం తీసుకున్నానని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘‘పెద్ది’ అంటే అలలా ఎగిసిపడిన మనిషి కథ కాదు, పడినా లేచిన మనిషి కథ. ఈ సినిమా సెంకడాఫ్ చూసి కన్నీళ్లు పెట్టుకుంటారు. రామ్‌చరణ్ (Ramcharan) ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండానే ఈ సినిమాను ఓకే చేశారు. ఇది కమర్షియల్ చిత్రం కాదు. ఎమోషనల్ డ్రామా’ అని బుచ్చిబాబు వెల్లడించారు. ఈ వీడియో చూశారా: ‘పెద్ది’.. ఇండస్ట్రీకి పెద్ద దిక్కవుతుంది: జగపతిబాబు

ఇంటర్నెట్ డెస్క్: తనకు సినిమా తప్ప ఏం తెలియదని స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) అన్నారు. అభిమానుల కోసం ఎంత కష్టమైనా పడతానని చెప్పారు. ఆయన ప్రధానపాత్రలో బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ‘పెద్ది’ (Peddi). జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అందులో రామ్ చరణ్ మాట్లాడుతూ.. పెద్ది లాంటి కథ చాలా అరుదుగా వస్తుందన్నారు. అభిమానుల ఆనందం కోసం వారిని అలరించడం కోసం ఎంత కష్టమైనా ఇష్టంగా పడతానన్నారు. తాను చనిపోయే వరకూ ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటానని తెలిపారు. ఈ వీడియో చూశారా: మైండ్ బ్లోయింగ్.. చరణ్ ఇంత కష్టపడ్డారా? ‘మస్స మస్స’ ఫుల్ సాంగ్

విద్యార్థి దశలో లతా మంగేష్కర్‌కు వీరాభిమాని అయిన ఆ యువతి తర్వాతి రోజుల్లో లతాతో సాటిగా పాటలు పాడతానని, ఒక దశలో సినీ పరిశ్రమ లతాకు ప్రత్యామ్నాయంగా తనను చూస్తుందని కలలో కూడా ఊహించి ఉండదు. ఆమె మరెవరో కాదు.. దిగ్గజ నేపథ్య గాయని, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత సుమన్ కల్యాణ్‌పుర్(89). ఆమె ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆదివారం ముంబయిలో కన్నుమూశారు. 1954 నుంచి 1988 వరకు మూడు దశాబ్దాల కెరీర్లో హిందీ, మరాఠీ, బెంగాలీ సహా వివిధ భాషల్లో ఆమె వందలాది పాటలు పాడారు. బ్రిటిష్ ఇండియాలోని ఢాకాలో 1937లో పుట్టారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి అయిన తండ్రి కర్ణాటకలోని ఉడిపి జిల్లావాసి. 1943లో వీరి కుటుంబం బొంబాయికి మారింది. అక్కడే సుమన్ సంగీత శిక్షణ పొందారు. వ్యాపారవేత్త రామానంద్ కల్యాణ్ పుర్‌తో వివాహమయ్యాక ఆమె సుమన్ కల్యాణ్ పుర్ అయ్యారు. షమ్మీకపూర్ నటించిన ‘బ్రహ్మచారి’ (1968) చిత్రంలోని ‘ఆజ్ కల్ తేరె మేరే ప్యార్ కే చర్చే హర్ జుబాన్ పర్...’ పాట ఆ రోజుల్లో మంచి హిట్ అయింది. రఫీతో కలిసి సుమన్ పాడిన ఈ పాట వింటే అచ్చం లతా పాడినట్టే ఉంటుంది. ఇదొక్కటేనా.. చాలా పాటలు అలాగే ఉంటాయి. అందుకే ఆర్థికంగా లతాను భరించలేని చిన్న నిర్మాతలకు ఆమె వరం అయ్యారు. ‘నా తుమ్ హమే జానో’ (బాత్ ఏక్ రాత్ కీ), ‘తుమ్నే పుకారా ఔర్ హమ్ చలే ఆయే’ (రాజ్ కుమార్), ‘దిల్ ఏక్ మందిర్’ చిత్రంలోని టైటిల్ పాట, ‘మేరా ప్యార్ భీ తూ హై’ (సాథీ), ‘పర్బతోకే పేడో పర్...’ (శగూన్), ‘బెహ్నా నే భాయీకీ కలాయీ సే’ (రేషమ్ కీ డోర్), ‘మేరే మెహబూబ్ నా జా..’ (నూర్ మహల్), ‘జిందగీ ఇంతిహాన్ లేతీ హై’ (నసీబ్) లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 1954లో విడుదలైన ‘మంగు’ చిత్ర గీతంతో సుమన్ నేపథ్య గాయనిగా పరిచయమయ్యారు. అదే ఏడాది నౌషాద్ సంగీతం సమకూర్చిన ‘దర్వాజా’లో అయిదు పాటలు పాడి పాపులర్ అయ్యారు. ఆ కాలపు సంగీత దర్శకులు ఎస్.డి.బర్మన్ నుంచి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ దాకా దాదాపు అందరి చిత్రాల్లో పాడారు. నౌషాద్, కల్యాణ్ జీ ఆమెను బాగా ప్రోత్సహించారు. గాయకులకు సైతం పాటల రాయల్టీ చెల్లించాలని పోరాడిన లతా తనతో విభేదించిన రఫీతో 1960లలో కొంత కాలం కలిసి పాడలేదు. ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న సుమన్ ఒక్క రఫీతోనే ఏకంగా 140పైగా డ్యూయెట్ పాటలు పాడారు. నాకు వచ్చిన అవకాశాలతో నేను సంతృప్తిగా ఉన్నా. నా స్వరం లతా దీదీ గొంతులా ఉందంటే దానికి నేనేం చేయను! అనేవారామె. చివరిదశలో ముంబయి శివారులోని లోఖండ్ వాలా ఇంటిలో తన పాటలు వింటూ ప్రశాంతంగా రోజులు గడిపారు. సుమన్ కల్యాణ్‌పుర్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు. ‘‘భారతీయ సంగీతాన్ని సుసంపన్నం చేసిన సుమన్ మరణం భారతీయ కళా ప్రపంచానికి తీరని లోటు. ఆమె హిందీ, మరాఠీ భాషలతో పాటు అనేక భారతీయ భాషల్లో తన మధురమైన గానంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఆమె కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను’’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు ముర్ము. ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ ‘‘ప్రముఖ గాయని సుమన్ కల్యాణ్‌పుర్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఆమె మధురమైన గానంతో మన సాంస్కృతిక ప్రపంచాన్ని సుసంపన్నం చేశారు. ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ అని పోస్ట్ చేశారు. సోమవారం ముంబయిలో మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాల మధ్య సుమన్ కుమార్తె చారుల్ అంత్యక్రియల్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నివాళులర్పించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

నిఖిల్ సిద్ధార్థ కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమాని భువన్, శ్రీకర్ నిర్మించారు. నభా నటేశ్, సంయుక్త కథానాయికలు. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. సోమవారం నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర కొత్త పోస్టర్‌తో పాటు ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ఈ సినిమా కోసం వియత్నాంలో కత్తియుద్ధం, సాఫ్ట్ కాంబాట్, మార్షల్ ఆర్ట్స్ లాంటి యుద్ధ విద్యల్లో నిఖిల్ తీసుకున్న కఠిన శిక్షణను.. యాక్షన్ ఘట్టాల్లో ఆయన చేసిన విరోచిత విన్యాసాల్ని ఆ వీడియోలో ఆసక్తికరంగా చూపించారు. చారిత్రక అంశాలతో ముడిపడిన ఈ యాక్షన్ డ్రామాలో నిఖిల్ ఓ యోధుడిలా అలరించనున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఈ సినిమాకి సంగీతం: రవి బస్రూర్, ఛాయాగ్రహణం: కె.కె సెంథిల్ కుమార్. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ఇంటర్నెట్‌డెస్క్: ప్రతి మనిషి జీవితానికి అర్థం ఏంటనేది కనుక్కోవడమే ‘పెద్ది’ మూవీ ఇచ్చే సందేశమని కథానాయిక జాన్వీకపూర్ (Janhvi Kapoor) అన్నారు. రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకలో జాన్వీ తెలుగులో మాట్లాడి అలరించారు. ‘‘మీరు చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉంది. ‘పెద్ది’పైనా ఇలాంటి ప్రేమే చూపిస్తారని ఆశిస్తున్నా. అదే మాకు రోజూ కష్టపడి పనిచేయడానికి బలాన్ని ఇస్తుంది. మేము చేసే ప్రతి పని మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికే. నా జీవితానికి అర్థం అంటే.. మిమ్మల్ని (ప్రేక్షకులు) అలరించడమే. మేము చేసిన ఈ మూవీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈ మూవీలో నటించే అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి ధన్యవాదాలు’ అని జాన్వీ అన్నారు. ఈ సందర్భంగా జగదేకవీరుడు అతిలోక సుందరిలోని శ్రీదేవి చెప్పిన ‘మానవ.. ఒక్కసారి నీ వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకొనవా’ అన్న డైలాగ్‌లోను వేదికపై చెప్పి నవ్వులు పూయించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జాన్వీకపూర్ కథానాయిక. జూన్ 4న పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిఖిల్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ (Swayambhu). రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జాన్వీకపూర్ కథానాయిక.

విజయవాడ: రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi). జాన్వీకపూర్ కథానాయిక. జూన్ 4న పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం చిత్ర బృందం విజయవాడలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఇందులో క్రేజీ పాట ‘మస్స మస్స’ పాటను విడుదల చేశారు. ఇందులో మూవీ మేకింగ్ విజువల్స్, రామ్‌చరణ్ పడిన కష్టం చూస్తుంటే మైండ్ బ్లోయింగ్‌గా ఉంది.

ఇంటర్నెట్‌డెస్క్: నిఖిల్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ’ (Swayambhu). సంయుక్త, నభా నటేశ్ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియోను టీమ్ పంచుకుంది. యోధుడిగా నిఖిల్ ఎలా సిద్ధమయ్యారో ఇందులో చూపించారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి.

విజయవాడ: రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జాన్వీకపూర్ కథానాయిక. జూన్ 4న పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విజయవాడలో ప్రీరిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.

ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పెద్ది’ (Peddi Movie). రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో చిత్ర బృందం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న నేపథ్యంలో అందుకు తగినట్లుగానే కీలక నగరాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలు చిత్రాలు విడుదల ముందు రోజు కాదు కదా కొన్ని గంటల ముందు వరకూ బుకింగ్స్ ఓపెన్ కాక, అభిమానులు, సినీ ప్రేక్షకులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇందుకు అనేక అంశాలు కారణమైనా, అంతిమంగా టికెట్లు బుక్ కావడమే ప్రేక్షకుడు చూస్తాడు. ఈ విషయంలో ‘పెద్ది’ మూడు అడుగులు ముందే ఉంది. జూన్ 4న మూవీ విడుదల కానుండగా, జూన్ 3న రాత్రి 8 గంటలకు ప్రీమియర్స్ వేసేందుకు సిద్ధమైంది. ప్రీమియర్ టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, సోమవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలోని పలు నగరాల్లో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అంతేకాదు, జూన్ 5న ఉదయ ఆటకు సంబంధించిన టికెట్స్‌ను కూడా కొన్ని థియేటర్స్ అందుబాటులోకి తెచ్చాయి. జూన్ 3 రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షో వేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ షోకు టికెట్ ధర రూ.600 (జీఎస్‌టీతో కలిపి), అలాగే జూన్ 4 నుంచి 10 రోజుల పాటు ప్రస్తుతమున్న టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్‌లలో రూ.100 చొప్పున, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు అవకాశమిచ్చింది. వీటితో పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు వీలు కల్పిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్

హైదరాబాద్: తెలుగు సినీ ప్రియులకు గుడ్‌న్యూస్. ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని పంచిన ఐమ్యాక్స్ ఫార్మాట్ మళ్లీ అందుబాటులోకి రాబోతోంది. దాదాపు పుష్కరకాలం తర్వాత భాగ్య నగరవాసుల కలను ఏఎంబీ సినిమాస్ సాకారం చేయబోతోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఏఎంబీ సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్, ఐమ్యాక్స్‌లు సంయుక్తంగా ఐమ్యాక్స్ స్క్రీన్‌ను (imax screen in hyderabad) ఏర్పాటు చేయబోతున్నాయి. ఏఎంబీ క్లాసిక్ విక్టరీ పేరుతో సుదర్శన్ 70లో ఇది అందుబాటులోకి రానుంది. ఎప్పుడు ప్రారంభమవుతుంది? స్క్రీన్ సైజ్ ఎంత? సీటింగ్ కెపాసిటీ తదితర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. అత్యున్నత సాంకేతికత కలిగిన స్క్రీన్‌లు హైదరాబాద్‌లో ఉన్నాయి. ముఖ్యంగా డాల్బీ సినిమాస్, ఎపిక్యూ, 4Dx, పిక్సెల్ ఫార్మాట్ కలిగిన స్క్రీన్‌లు ప్రేక్షకులకు వినోదం పంచుతున్నాయి. అయితే, అన్నీ ఉన్నా, ఐమ్యాక్స్ లేదన్న లోటు త్వరలో తీరనుంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

సంక్రాంతి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఆశించిన చిత్రాలేవీ రాలేదు. ఆ లోటును భర్తీ చేయడానికి సిద్ధమయ్యాడు ‘పెద్ది’ (Peddi Movie). రామ్‌చరణ్ కథానాయకుడి బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇది. జాన్వీకపూర్ కథానాయిక. ఏఆర్ రెహమాన్ సంగీతం (peddi songs) అందించారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ఆసక్తిని పెంచిన ఈ మూవీ జూన్ 4న (Peddi release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకరోజు ముందుగానే జూన్ 3న (peddi premiere show) రాత్రి 8గంటలకు ప్రీమియర్ షోలతోనూ సందడి చేయనుంది. ఏపీలో ఇప్పటికే ఇందుకు సంబంధించిన అనుమతులు రాగా, తెలంగాణలో ఏం జరుగుతుందో చూడాలి. పెద్ది రన్ టైమ్ (Peddi run time) సుమారు మూడు గంటలపైనే ఉంటుందని టాక్. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar: The Revenge) భారత్‌లో ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ‘జియో హాట్‌స్టార్’ వేదికగా జూన్ 5 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. జూన్ 4న రాత్రి 7 గంటలకు డిజిటల్ ప్రీమియర్ ప్రదర్శించనున్నట్లు తెలిపింది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. మిగిలిన దేశాల్లో సినీ అభిమానులు ఈ మూవీని ‘నెట్‌ఫ్లిక్స్’ (Dhurandhar 2 OTT) వేదికగా చూడొచ్చు. మలయాళ అగ్ర హీరోలు మమ్ముట్టి (Mammootty), మోహన్‌లాల్ (Mohanlal) కలిసి నటించిన సినిమా ‘పేట్రియాట్’ (Patriot Movie). ఈ మూవీ ‘జీ 5’ (Zee 5) వేదికగా జూన్ 5 (Patriot Movie Streaming date) నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉండనుంది. దేశభక్తితో కూడిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. నయనతార,

ఇంటర్నెట్ డెస్క్: కొంత మంది ఉద్దేశపూర్వకంగా సినిమాపై క్రియేట్ చేసే నెగెటివిటీ దర్శకుల కలలను ముక్కలు చేస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan). ఆయన దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఎల్‌ఐకే’ సినిమా ఫ్లాప్ కావడంపై పోస్ట్ పెట్టారు. నెగెటివ్ రివ్యూలు చూసి సినిమా చూడలేదని చాలా మంది తనకు మెసేజ్ చేస్తున్నారని తెలిపారు. ‘‘ఆన్‌లైన్‌లో కనిపించిన విపరీతమైన నెగెటివిటీ వల్లే థియేటర్లలో సినిమాను (LIK) మిస్ అయ్యామని చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలు నెగెటివ్ రివ్యూలను తట్టుకుని నిలబడతాయి.. కొన్ని నిలబడలేవు. ఈ పరిశ్రమలో ప్రభావవంతమైన వ్యక్తుల మద్దతు లేని సినిమాల విషయానికి వస్తే.. ప్రజాభిప్రాయం వాటి తలరాతను పూర్తిగా మార్చేస్తుంది. సినిమాను విమర్శించడమే కాకుండా ఉద్దేశపూర్వకంగా రాసే రివ్యూలు ప్రేక్షకులను గందరగోళానికి గురిచేస్తాయి. అలాగే దర్శకుల కలలను ముక్కలు చేస్తాయి. ఎల్‌ఐకే బాక్సాఫీస్ ఫలితాన్ని నేను ఇప్పటికీ పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నాను. దాని నుంచి బయటకు రాలేకపోతున్నా. మంచి టాక్‌తో సూపర్ ఓపెనింగ్ వీకెండ్ తర్వాత కథ ఇంత త్వరగా మారిపోవడం చాలా బాధేసింది. చాలా కష్టపడి దాన్ని రూపొందించా. దానికి ఇంకా ఆదరణ దక్కాల్సి ఉందని ఇప్పటికీ అనిపిస్తోంది’’. ‘‘ఇలాంటి ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం వెనుక ఉన్న పోరాటం చాలా మందికి తెలియదు. దీనిని నిర్మించడం కష్టం, విడుదల చేయడం ఇంకా కష్టం. అన్ని సవాళ్లను అధిగమించిన తర్వాత, దీని ముగింపు ఇలా చూడటం ఎంతో బాధగా ఉంది. మొదట్లో ఆదరణ దక్కకపోయినా ఆ తర్వాత అద్భుతమైన చిత్రాలుగా నిలిచిన సినిమాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఇది కూడా అలానే నిలిచిపోతుందన్న ఆశతో జీవిస్తున్నా’’ అని రాసుకొచ్చారు.