
ఇంటర్నెట్‌డెస్క్: తన అపార్ట్మెంట్లో ఉండే ఓ కుక్కను విచక్షణారహితంగా కొట్టి చంపేశారంటూ నటి మంజరి ఫడ్నిస్ (Manjari Fadnis) ఆవేదన వ్యక్తంచేశారు. 2019లో తమ సొసైటీలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ కుక్కని
వదిలివెళ్లారని అప్పటినుంచి దాన్ని ‘మైకీ’ అని పేరుతో తామే పెంచుకుంటున్నట్లు తెలిపారు. కొన్ని రోజుల నుంచి అది కనిపించకపోవడంతో పోస్టర్లు కూడా వేసి వెతికామని.. ఈ క్రమంలో సొసైటీకి చెందిన ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా దాన్ని కొట్టి చంపేశారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలా ఎవరూ జంతుహింసకు పాల్పడకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని మంజరి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఆమె విలపిస్తూ మాట్లాడుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. భూమి పెడ్నేకర్‌తో పాటు మరికొందరు దీనిపై స్పందించారు. 2004లో ఓ హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంజరి అల్లరి నరేశ్‌తో కలిసి ‘సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం’, ‘శుభప్రదం’ చిత్రాల్లో నటించారు. అలాగే ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘శక్తి’లో గౌరిగా కనిపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
రాగ్ మయూర్ హీరోగా విమల్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ‘అనుమాన పక్షి’ (Anumana Pakshi).