
ధర్మశాల: అఫ్గాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బ్యాటర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. భారత్ తరఫున వన్డేల్లో ఆడిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డు సాధించాడు. రోహిత్ వయసు ప్రస్తుతం 39 సంవత్సరాల 44 రోజులు. గతంలో 1983 వరల్డ్ కప్ హీరో మోహిందర్ అమర్నాథ్ 39 ఏళ్ల 36 రోజుల వయసులో(అక్టోబర్ 30, 1989లో) ముంబయిలో వెస్టిండీస్‌తో వన్డేలో ఆడాడు. ఆయన పేరిట ఉన్న రికార్డును తాజాగా రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.