
ఇంటర్నెట్ డెస్క్: కథానాయకుడు నాగచైతన్య ‘దూత’ సిరీస్‌తో ఓటీటీ రంగప్రవేశం చేసి హిట్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ విడుదలై ఘన విజయం సాధించింది. మూడేళ్ల తర్వాత
దీనికి కొనసాగింపుగా ఇప్పుడు ‘దూత 2’ పట్టాలెక్కింది. నాగ చైతన్య (Naga Chaitanya) ఈసారి నిర్మాణ బాధ్యతల్ని కూడా నిర్వర్తించనున్నారు. తాజాగా ఈ సిరీస్ గురించి ఆయన మాట్లాడారు.
ఈ ప్రాజెక్ట్ (Dhootha 2) అంటే తనకు ఎంతో ఇష్టమని.. నటనకు మించి ఏదైనా చేయాలని అనిపించిందని చైతన్య చెప్పారు. అందుకే నిర్మాతగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఏదైనా పనిలో పూర్తిగా లీనమైనప్పుడు, దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తామని ఆ అభిరుచే తనను ‘దూత 2’ సిరీస్‌కు నిర్మాతగా కూడా తనవంతు సహకారం అందించేలా ప్రోత్సహించిందన్నారు. దర్శకుడు విక్రమ్ కుమార్, నిర్మాత శరత్ మారర్లతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు.
ఇటీవల ఈ వెబ్‌సిరీస్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సిరీస్‌లో నటి భూమిక కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’లో భూమిక కనిపించారు. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే ఇది వీరి రెండో ప్రాజెక్ట్ అవుతుంది. దీనిపై అధికారిక సమాచారం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.