
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Price Crash: బంగారం ధరలు గత కొంతకాలంగా భారీగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఉన్నట్టుండిగా ఒక్కసారిగా బంగారం ధరల్లో తిరోగమనం ప్రారంభమైంది. బంగారం ధరలు ఒకసారిగా భారీగా పెరిగాయి. కానీ పెరుగుట విరుగటకే అన్నట్లుగా బంగారం ధరలు మరోసారి ఒక్కసారిగా కుప్పకూలే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. పచ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో బంగారం వెండి ధరలు భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా భారీగా తగ్గుతూనే ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధర తన రికార్డు గరిష్ట స్థాయి నుంచి 25శాతం మేర తగ్గిందని చెప్పాలి. ఇప్పుడు బంగారం ధరలు మరింత పడిపోవచ్చని వస్తున్న వార్తలు పసిడి ప్రియుల్లో ఆనందం రేకెత్తిస్తున్నాయి. ఈ సంవత్సరం జనవరిలో బంగారం ఔన్సుకు 5,595 డాలర్ల గరిష్ట స్థాయికి చేరుకొని రికార్డు క్రియేట్ చేసింది. అప్పటినుంచి దాని రికార్డ్ గరిష్ట స్థాయి నుండి దాదాపు 25% మేర పడిపోయి భారీ క్షీణతను చూసింది. ఈ క్షీణత రికార్డ్ గరిష్ట స్థాయిలో కొనుగోలు చేసి ఇప్పుడు ధర పుంజుకుంటుందని ఆశించిన వారికి భారీ నష్టాలను కలిగించింది. కానీ ప్రస్తుతం ధర మరింత పడిపోతుందని అంచనాలు వెలువడుతున్నాయి. వారంతపు గణాంకాలను పరిశీలించినట్లయితే బంగారం వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4222 డాలర్ల వద్ద స్వల్పంగా పెరగడం గమనించవచ్చు. దేశంలో కమోడిటీ ఎక్స్చేంజ్ ఎంసీఎక్స్ లో బంగారం ధర 1.17శాతం పెరిగి 10 గ్రాములకు 1,50,675 వద్ద ముగిసింది. మనీకంట్రోల్ తెలిపిన వివరాల ప్రకారం బంగారానికి రెండు సవాలు ఎదురవుతున్నాయి. మొదటిది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచుతుందని అంచనా. రెండవది
డాలర్ విలువ పెరగడం కూడా బంగారానికి మంచి వార్త కాదంటున్నారు మార్కెట్ నిపుణులు. ఈ రెండు అంశాలు బంగారంపై మరింత ఒత్తిడి పెంచే అవకాశం కూడా ఉందంటున్నారు. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తలు తగ్గుముఖం పట్టి ముడి చమురు ధరలు బ్యారెల్ కు 80 డాలర్లకు పడిపోయిన తర్వాతే బంగారం వెండి ధరలు పెరగవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రస్తుతం ముడిచమురు ధరలు సుమారు 90డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. బంగారం ధరల్లో బలహీనత కొనసాగితే స్వల్పకాలంలోనే ధరలు మరింత పడిపోయే అవకాశం ఉందని యు బి ఎస్ కూడా అంచనా వేస్తోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే ఛాన్స్ ఉన్నందున సమీప భవిష్యత్తులో బంగారం ధరలు ఔన్స్ కు 3850 నుంచి 4000 డాలర్లకు పడిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. పెరుగుతున్న వడ్డీ రేట్లు బంగారం మెరుపును మరింత తగ్గించే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. మిడిల్ ఈస్టులో ఉద్రిక్తత కారణంగా ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగాయని .. దాని ఫలితంగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి అన్న విషయాన్ని గమనించాలి. దీనివల్ల అమెరికా భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఏర్పడింది.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.