
ఇంటర్నెట్ డెస్క్: సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కరుప్పు’(Karuppu). తెలుగులో ‘వీరభద్రుడు’గా విడుదలైంది. ఆర్జే బాలాజీ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది
. జూన్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ఓటీటీపై కొన్ని రోజులుగా వార్తలు వచ్చినప్పటికీ తాజాగా అమెజాన్ అధికారికంగా ప్రకటిస్తూ యాప్లో అప్డేట్ చేసింది. ఈ సినిమా కోలీవుడ్లో విజయాన్ని సాధించిన సూర్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చోటు సొంతం చేసుకుంది.
అనారోగ్యం పాలైన కూతురికి శస్త్రచికిత్స చేయించేందుకు హైదరాబాద్ తీసుకొస్తాడు ఓ తండ్రి (ఇంద్రాస్). నాంపల్లి రైల్వేస్టేషన్లో దిగగానే దొంగలు వారిపై దాడి చేసి 60 సవర్ల బంగారం దోచుకుని వెళ్లిపోతారు. కూతురి ఆపరేషన్ కోసం అమ్ముదామని తెచ్చిన నగలను ఎలాగైనా ఇప్పించాలని పోలీసులను ఆశ్రయిస్తే, కేవలం 45 సవర్ల బంగారం మాత్రమే రికవరీ చేసి ఇస్తారు. అది కూడా కోర్టు ఆర్డర్ ద్వారా తీసుకోవాలని సూచిస్తారు. దీంతో లాయర్ బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) దగ్గరకు వెళ్తారు. పక్కా కమర్షియల్ లాయర్ అయిన బేబీ కృష్ణ.. తండ్రీకూతుళ్ల పరిస్థితి తెలిసినా డబ్బు కోసం జడ్జితో కలిసి కేసు వాయిదాలు వేయిస్తూ ఉంటాడు. పోలీసులు రికవరీ చేసిన బంగారం కూడా దక్కకుండా చేస్తానని అంటాడు. దీంతో కోర్టు ఆవరణలో ఉన్న వీరభద్రుడి ఆలయానికి వెళ్లి, తన కష్టాన్ని తీర్చమని ఆ తండ్రి వేడుకుంటాడు. అక్కడి క్షేత్రపాలకుడైన వీరభద్రుడు (సూర్య) భూమ్మీదకు వచ్చాక ఏం జరిగింది? తండ్రీకూతుళ్లకు న్యాయం జరిగిందా? అన్నది చిత్ర కథ.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.