
ఇంటర్నెట్ డెస్క్: బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరించిన రియాలిటీ షోల్లో ‘బిగ్‌బాస్’ (BiggBoss) ఒకటి. ఇప్పటికే 9 సీజన్లతో వినోదం పంచిన ఈ కార్యక్రమం 10వ సీజన్ (Biig Boss Telugu 10) త్వరలోనే
రానుంది. ప్రముఖ నటుడు, హోస్ట్ నాగార్జున (Nagarjuna) ఈ గుడ్‌న్యూస్ చెబుతూ.. స్పెషల్ వీడియో పంచుకున్నారు.
‘‘బిగ్‌బాస్.. ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఎంతోమంది హృదయాలు గెలుచుకున్న మహా సామ్రాజ్యం’’ అంటూ నాగార్జున చెప్పే పవర్ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమైన వీడియో ఆద్యంతం అలరించేలా ఉంది. బిగ్‌బాస్‌పై రూపొందించిన పాట వీడియోలో ప్రత్యేకంగా నిలిచింది. ‘ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు’ అన్న క్యాప్షన్‌తో కొత్త సీజన్ ఎంత రసవత్తరంగా ఉండబోతుందో హింట్ ఇచ్చారు.
గత సీజన్లో సెలబ్రిటీలతోపాటు సామాన్యులకూ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అగ్ని పరీక్షను దాటుకుని మరీ ఆరుగురు.. బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి, తమ టాలెంట్ చూపించారు. సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇచ్చారు. కామన్‌మ్యానే (కల్యాణ్ పడాల) ‘బిగ్‌బాస్ 9’ విజేతగా నిలవడం విశేషం. ఈసారి కూడా సామాన్యులకు ఛాన్స్ ఇస్తారా? కేవలం ప్రముఖులకే ఎంట్రీనా? కంటెస్టెంట్లు ఎవరు? షో ఎప్పుడు ప్రారంభమవుతుంది? వీటన్నింటికీ సమాధానం తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.