
Bigg Boss Today Promo: కొట్టుకోడానికి రెడీ అయిన సుధీర్ – త్రిగున్.. నామినేషన్స్ ఫైర్.. బిగ్ బాస్ ప్రోమో వైరల్..
మీరు కూడా బిగ్ బాస్ తాజా ప్రోమో చూసేయండి.. (Bigg Boss Today Promo)

మీరు కూడా బిగ్ బాస్ తాజా ప్రోమో చూసేయండి.. (Bigg Boss Today Promo)

నిన్నటి ఎపిసోడ్ లోనే అమన్ శాలినితో మనం ఒక గ్రూప్ కదా అనుకోని... తాజాగా నేటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు. (Bigg Boss Today Promo)

Nagarjuna Seed Ganesha | సీడ్ గణేశుడిని స్వీకరించిన నాగార్జున.. సంతోష్‌కుమార్ కృషికి అభినందనలు
Nagarjuna Fires Trigun: డొల్ల,డబ్బా, నిబ్బా త్రిగుణ్!! రోహిత్ స్టెరాయిడ్స్ ఎక్కించుకున్నాడా? నువ్ చూశావా? నాగార్జున ఉతుకుడు రె‘ఢీ’

Nagarjuna - DSP: హ్యాట్రిక్ ఇచ్చిన డిసెంబర్ మాసం...

Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?

మీరు కూడా బిగ్ బాస్ డే 1 ప్రోమో చూసేయండి.. (Bigg Boss Telugu 10 Day 1 Promo)

ఇటీవల థియేటర్లకు వచ్చిన అన్నపూర్ణ సంస్థ నిర్మించిన సినిమా ‘పళ్ల బురుసు’ సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి షాక్ ఇచ్చింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఇటీవల థియేటర్లకు వచ్చిన ప్రముఖ బ్యానర్ అన్నపూర్ణ సంస్థ నిర్మించిన సినిమా ‘పళ్ల బురుసు’ (Palla Burusu) సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి షాక్ ఇచ్చింది. బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మ, గోమతి, సుజాత కీలక పాత్రల్లో నటించగా ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ కలసి నిర్మించాయి. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని పల్లెలో శంభ అనే వృద్థుడు ఒంటరిగా జీవిస్తుంటాడు. కొడుకు, కూతురు వేరే వేరే ఊర్లలో స్థిరపడి తండ్రి బాగోగులు అంతగా పట్టించుకోరు. తను పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వేప పుల్ల స్థానంలో టూత్ బ్రష్ ఉపయోగించమని సూచిస్తారు. కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్)ని టూత్ బ్రష్ (పళ్ల బురుసు), మందులు తెచ్చివ్వమని అడుగుతాడు. సొంత సమస్యల్లో బిజీగా ఉన్న తిరుపతి, తండ్రి మాటను అంతగా పట్టించుకోడు. కొద్ది రోజులకే కూతురు పెళ్లి ఖాయం చేసుకుని కనీసం తండ్రిని పిలవడు. ఇది గమనించిన శంభ లోలోపల కుమిలి పోలీసులను ఆశ్రయిస్తాయి. అక్కడ కూడా పరిష్కారం దొరక్కపోవడంతో కోర్టు మెట్లు ఎక్కుతాడు. అసలు తండ్రీకొడుకుల మధ్య గ్యాప్ రావడానికి కారణమేంటి? తనకున్న ఎకరం పొలంలో తన సమాధిని తానే ఎందుకు సిద్థం చేసుకున్నాడు? చివరకు ఏం జరిగింది అన్నదే కథ. వయసు మీద పడ్డ తల్లిదండ్రుల విషయంలో ఈతరం ఎలా వ్యవహరిస్తుందో చూపిస్తూ సాగే ఈ కథలో భావోద్వేగాలు అశించినంతగా బలంగా ఉండవు. కానీ శంభా తన సమాధి తానే సిద్ధం చేసుకునే సన్నివేశాలు, క్లైమాక్స్ మాత్రం గుండెను బరువెక్కిస్తాయి. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే అమెజాన్

తెలుగు సినిమా చరిత్రలో 90s టైమ్ అద్భుతమనే చెప్పాలి. అప్పుడే అదిరిపోయే సినిమాలెన్నో వచ్చాయి. ఎంటర్టైన్మెంగ్ తో పాటు సెంటిమెంట్, ఎమోషనల్, యాక్షన్ మూవీస్ సందడి చేశాయి. అలాంటి సినిమాల లిస్ట్ లో ‘హలో బ్రదర్’ కచ్చితంగా ముందువరుసలో ఉంటుంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో, అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయంలో రూపొందిన ఈ చిత్రం 1994 ఏప్రిల్ 20న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. నాగార్జున మాస్, క్లాస్ లుక్స్‌తో పాటు రమ్యకృష్ణ, సౌందర్యల గ్లామర్, రాజ్-కోటి సంగీతం ఈ చిత్రాన్ని ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి. మిసెస్ అండ్ మిస్టర్ చక్రవర్తి (శరత్ బాబు, సంగీత) దంపతులకు కవల పిల్లలు జన్మిస్తారు. జన్మతః వీరిద్దరికీ ఒక విచిత్రమైన కనెక్షన్ (రిఫ్లెక్స్ యాక్షన్) ఉంటుంది. ఒకరికి నొప్పి కలిగితే మరొకరికి స్పందన రావడం, ఒకరు కదిలితే మరొకరు కూడా అదే పనిచేయడం వీరి ప్రత్యేకత. అయితే, విశ్వనాథ్ ఉద్యోగరీత్యా ఒక ప్రమాదకరమైన క్రిమినల్ మిట్రా (నెపోలియన్)ని అరెస్ట్ చేసే క్రమంలో, మిట్రా ఈ కవలలలో ఒకరిని ఎత్తుకెళ్లి ఆసుపత్రి నుంచి తప్పించుకుంటాడు. ఈ క్రమంలో ఒక బాబు (దేవా) కూలిపనులు చేసుకునేవారికి దొరుకుతాడు. వారికి అప్పటికే ఓ ఆడపిల్ల కూడా ఉంటుంది. రోడ్డుపై రఫ్ అండ్ టఫ్ వాతావరణంలో దేవా (నాగార్జున) పెరిగి పెద్దవాడవుతాడు. మరో బాబు (రవి వర్మ) తన తల్లిదండ్రుల వద్దే పెరిగి విదేశాలలో చదువుకుని పెద్ద మ్యూజిషియన్‌గా ఇండియాకు తిరిగివస్తాడు. దేవా స్థానిక రౌడీలతో గొడవపడుతూ మాస్ క్యారెక్టర్‌గా మారితే, రవి వర్మ అత్యంత సాఫ్ట్ అండ్ క్లాస్ కుర్రాడిగా ఉంటాడు. దేవాను చక్రవర్తి ఫ్రెండ్ (గిరిబాబు) కూతురు మంగ (రమ్యకృష్ణ) ప్రేమిస్తుంది. రవి వర్మను తన ఈవెంట్ మేనేజర్ అక్కమాంబ( అన్నపూర్ణమ్మ) కూతురు ఊహ (సౌందర్య) ప్రేమిస్తుంది. విధి వశాత్తూ ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకే నగరంలో కలుసుకున్నప్పుడు వారి రిఫ్లెక్స్ చర్యల వల్ల ఎలాంటి అలజడి సృష్టింపబడింది?

Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మరో నాలుగు రోజుల్లో మొదలు కాబోతుంది. దీంతో ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే స్టార్స్ ఎవరు అని చర్చ జరుగుతుంది. ఇప్పటికే అగ్నిపరీక్షతో నాలుగు సామాన్యులను ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇక సెలబ్రిటీలలో సీరియల్ నటీమణులు పల్లవి గౌడ, తేజస్విని, కావ్యశ్రీ, కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేశ్, డ్యాన్సర్ ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబర్ నందూ, రచయిత కడలి సత్యనారాయణ వెళ్తారని టాక్ నడుస్తుంది. తాజాగా మరో పేరు కూడా వినిపిస్తుంది. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి ఫేమ్ తెచ్చుకున్న టెంపర్ వంశీ కూడా ఈసారి బిగ్ బాస్ లోకి వెళ్తాడని ఇండస్ట్రీలో వినిపిస్తుంది. వంశీ అసలు పేరు అజయ్ అని సమాచారం. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాడు వంశీ. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి, నెగిటివ్ రోల్స్ చేస్తూ వచ్చాడు. ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో నెగిటివ్ రోల్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా విలన్ గా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు వంశీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. మరి బిగ్ బాస్ సీజన్ 10 లోకి ఎవరెవరు వెళ్తారో తెలియాలంటే ఇంకో నాలుగు రోజులు ఎదురు చూడాల్సిందే. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6 నుంచి స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అవ్వనుంది. మొదటి రోజు సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ మొదలు అవ్వనుంది

కింగ్ నాగార్జున ప్రస్తుతం కింగ్ 100 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కింగ్ నాగార్జున (Nagarjuna) ప్రస్తుతం కింగ్ 100 తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇదంతా పక్కన పెడితే.. నాగ్ మరోసారి ఒక స్పెషల్ రోల్ లో మెరవనున్నాడానే వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కుబేర, కూలీ సినిమాలలో నాగ్ ప్రత్యేక పాత్రల్లో మెరిశాడు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలకు నాగార్జుననే ప్రధాన ఆకర్షణ. కానీ, నాగ్ కి మాత్రం ఈ సినిమాలు కలిసి రాలేదు. ముఖ్యంగా కూలీలో విలన్ గా ఆయన నటన బాగున్నా కూడా ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో నాగ్.. స్పెషల్ రోల్స్ కి దూరంగా ఉండడమే బెటర్ అని అక్కినేని ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు. రెండుసార్లు స్పెషల్ రోల్ చేసి దెబ్బ తిన్నా కూడా నాగ్.. మరోసారి అదే పని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం హెచ్. వినోత్ దర్శకత్వంలో ఒక సినిమా ఓకే చేసిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం నాగార్జునను సంప్రదించారట. ఆ పాత్రకు నాగ్ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని భావించి వినోత్.. కథ కూడా చెప్పాడట. తన పాత్రలోని ప్రాధాన్యత నచ్చడంతో నాగార్జున కూడా ఈ ప్రత్యేక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఇక నాగార్జున ఎంట్రీతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. గతంలో కార్తీతో కలిసి ఊపిరి సినిమాలో నటించిన నాగార్జున, ఇప్పుడు సూర్య నటించబోయే రాబోయే ప్రతిష్టాత్మక చిత్రంలో ఒక పవర్ఫుల్ స్పెషల్ రోల్ చేయడం విశేషం. ఈ చిత్రంలో సూర్య, నాగార్జున మధ్య వచ్చే సన్నివేశాలు అత్యంత ఉత్కంఠభరితంగా, మాస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ కోసం బుల్లితెర ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఆదివారమే (సెప్టెంబర్ 06) బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ ఉండనుది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి ఈ రియాలిటీ షోపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే నిర్వహించిన ' అగ్ని పరీక్ష సీజన్ 2' కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ కాంటెస్ట్ లో సత్తా చాటిన పలువురు సామాన్యులు ఇప్పుడు నేరుగా బిగ్ బాస్ హౌస్ లోనే అదృష్టం పరీక్షించుకున్నారు. ఇక వీరిని ఎదుర్కొనేందుకు సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కూడా రెడీ అవుతున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఎవరన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సోషల్ మీడియాలో అయితే చాలా పేర్లే వినిపిస్తున్నాయి. పల్లవి గౌడ, కావ్యశ్రీ, వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్ జబర్దస్త్ ఫేమ్ ఎక్స్‌ప్రెస్ హరి, ఆటో రామ్ ప్రసాద్, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి, నందూస్ వరల్డ్ నందూ, రాయల్ మెక్ రమణ, శివ్, కడలి సత్యనారాయణ ఇలా చాలా మంది పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే ఒక లేడీ సెలబ్రిటీని హౌస్ లోకి రప్పించేందుకు బిగ్ బాస్ తెలుగు 10 టీమ్ విశ్వ ప్రయత్నాలు చేస్తోందట. మరోవైపు ఆమె మాత్రం బిగ్ బాస్ లోకి వచ్చేందుకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఆమె ఎంత అడిగినా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. ఆమె మరెవరో కాదు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్ భార్య సతీమణి, ప్రముఖ సీరియల్ నటి తేజస్విని గౌడ. ప్రస్తుతం తేజస్విని గౌడ సీరియల్స్ , టీవీ షోలతో బిజీ బిజీగా ఉంటోంది. ముఖ్యంగా ప్రస్తుతం ఆమె తమిళంలో నటిస్తోన్న ‘ఆయాలి’ అనే సీరియల్ టీఆర్పీ

బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అత్యంత పాపులర్ రియాలిటీ షోల్లో ‘బిగ్‌బాస్ తెలుగు’ ఒకటి. ఇప్పటికే తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. పదో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తొలి సీజన్ నుంచి తొమ్మిదో సీజన్ వరకు టైటిల్ గెలిచిన విజేతలు ఎవరు? బిగ్‌బాస్ హౌస్‌లో 100 రోజులు గడిపిన తర్వాత వారి జీవితాలు, కెరీర్లు ఎలా మారాయి? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఓసారి చూద్దాం. శివ బాలాజీ ‘బిగ్‌బాస్ తెలుగు’ తొలి సీజన్ విజేత శివ బాలాజీ. షోకు ముందు నుంచే సినీ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. టైటిల్ గెలిచిన తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతున్నారు. ‘సింధూరం’, ‘కాలింగ్ సహస్ర’ వంటి చిత్రాల్లో నటించిన శివ బాలాజీ.. ఇటీవల ‘కన్నప్ప’లోనూ కీలక పాత్రలో కనిపించారు. తెలుగు సినిమాలతో పాటు తమిళంలోనూ నటించిన ఆయన.. ఇప్పటికీ సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్నారు. కౌశల్ మండా రెండో సీజన్ విజేత కౌశల్ మండా. బిగ్‌బాస్ హౌస్‌లో తన ఆటతీరుతో భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. ‘కౌశల్ ఆర్మీ’ పేరుతో అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతమైన సందడి కనిపించింది. అయితే టైటిల్ గెలిచిన తర్వాత ఆశించిన స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు దక్కలేదని కౌశల్ స్వయంగా వెల్లడించారు. సినిమాలు, టెలివిజన్‌లో కొనసాగుతూనే వ్యక్తిగత జీవితం, కుటుంబంపై కూడా దృష్టి సారించారు. ఇదీ చదవండి: ఒకేసారి ఐదు భాషల్లో ‘బిగ్‌బాస్’.. ఎవరు ఎక్కడ హోస్ట్! రాహుల్ సిప్లిగంజ్: మూడో సీజన్ విజేత రాహుల్ సిప్లిగంజ్. బిగ్‌బాస్ టైటిల్ తర్వాత ఆయన కెరీర్లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటను పాడిన గాయకుల్లో రాహుల్ కూడా ఉన్నారు. ఈ పాటకు ఆస్కార్ రావడంతో ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కాగా ఇటీవల ఓ యువతి ఫిర్యాదుతో తనపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు వార్తలు వచ్చిన సమయంలో రాహుల్ ఆరోపణలను ఖండిస్తూ తన వాదనను వెల్లడించారు

ప్రముఖ సినీ నటి భానుప్రియ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంపై, తోటి నటులతో తన అనుబంధంపై, అలాగే తన సోదరి శాంతిప్రియ జీవితంలోని వ్యక్తిగత సంఘటనలపై గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన కెరీర్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో సుమన్, బాలకృష్ణ, దర్శకుడు వంశీలను ప్రస్తావించారు. హీరో సుమన్‌తో 14-15 సినిమాలు, బాలకృష్ణతో దాదాపు 8-10 సినిమాలలో కలిసి నటించినట్లు తెలిపారు. సుమన్‌ను నిశ్శబ్దంగా, అత్యంత మర్యాదగా ఉండే వ్యక్తిగా అభివర్ణించగా, బాలకృష్ణను చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉండే వ్యక్తిగా పేర్కొన్నారు. బాలకృష్ణతో ఎయిర్‌పోర్ట్‌లో అనుకోకుండా జరిగిన భేటీని గుర్తుచేసుకుంటూ, ఆయన ప్రేమగా పలకరించారని, ఇంటికి రావాలని ఫోన్ నంబర్ ఇచ్చారని చెప్పారు. సుమన్‌తో చివరిగా దమ్ము సినిమాలో నటించినట్లు పేర్కొన్నారు. నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు.. దర్శకుడు వంశీ, తనకు సీతార, అన్వేషణ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చినట్లు భానుప్రియ తెలిపారు. వంశీతో తన పెళ్లి గురించి ఒకప్పుడు వదంతులు వచ్చాయని, అయితే అప్పటికే ఆయనకు వివాహం కావడంతో తన తల్లి ఆ సంబంధానికి అంగీకరించలేదని భానుప్రియ స్పష్టం చేశారు. అలాగే, నటుడు అక్కినేని నాగార్జునతో జతకట్టే అవకాశం తనకు రాలేదని భానుప్రియ తెలిపారు. అన్నమయ్య వంటి చిత్రాలలో ఇతర నటీనటులు నటించినప్పటికీ, తనకు ఆ అవకాశం దొరకలేదని, తన పెళ్లి చేసుకునే వయస్సుకి వచ్చే సమయానికి ఆ అవకాశం రాలేదని చెప్పారు. అయితే, తన సోదరి శాంతిప్రియ రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అగ్ని సినిమాలో నటించినట్లు గుర్తు చేసుకున్నారు. Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ భానుప్రియ తన సోదరి శాంతిప్రియ గురించి కూడా వివరించారు. శాంతిప్రియ ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారని, అక్కడే స్థిరపడ్డారని తెలిపారు. సహారా వన్ ఛానెల్లో ప్రసారమైన మాతా కీ చౌకీ అనే

Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లలో కొందరు ఆటతో గుర్తింపు తెచ్చుకుంటే.. మరికొందరు తమ వ్యక్తిత్వం, గ్లామర్, సోషల్ మీడియా క్రేజ్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు. ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్‌కు సంబంధించి వినిపిస్తున్న పేర్లలో వర్షిణి సౌందరరాజన్ పేరు మాత్రం ప్రత్యేకంగా వినిపిస్తోంది. సీజన్ ప్రారంభానికి ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో, ఎవరు హౌస్‌లోకి వెళ్లబోతున్నారనే ఆతృత ప్రేక్షకుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. బిగ్‌బాస్ 10 తెలుగు సీజన్లో సినీ రంగానికి చెందినవారితో పాటు టెలివిజన్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కలగలిపిన కంటెస్టెంట్ల జాబితా ఉండే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలువురు పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పురుష కంటెస్టెంట్లలో కొంతమంది పేర్లు ప్రేక్షకులకు ముందే పరిచయం ఉన్నప్పటికీ, మహిళా కంటెస్టెంట్లలో వర్షిణి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రతి బిగ్‌బాస్ తెలుగు సీజన్లోనూ ప్రేక్షకుల కంట్లో ఎవరో ఒకరు పాపులర్ అవుతుంటారు. వారి ఆటతీరు మాత్రమే కాకుండా వ్యక్తిత్వం, మాట్లాడే విధానం, స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్ కూడా హౌస్‌లో వారి గుర్తింపును పెంచుతాయి. ఈసారి ఆ స్థానం వర్షిణికి దక్కవచ్చనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫేమ్ కూడా దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వర్షిణి సౌందరరాజన్ ఇప్పటికే సినీ, టెలివిజన్ రంగాల్లో ప్రేక్షకులకు పరిచయమైన ముఖమే. పలువురు ప్రముఖ హీరోలతో కలిసి సినిమాల్లో నటించిన ఆమెకు వెండితెర అనుభవం ఉంది. అయితే ఆమెకు మంచి గుర్తింపు తీసుకురావడంలో టెలివిజన్, సోషల్ మీడియా మరింత కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా యూత్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వర్షిణిని దాదాపు 20 లక్షల మంది ఫాలో అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తన గ్లామరస్ సోషల్ మీడియా పోస్టులతో ఆమె డిజిటల్ ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఆమె ప్రవేశిస్తే

తెలుగు బుల్లితెరపై అత్యంత జనాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ ఎడిషన్ సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు స్టార్ మా మరియు జియోహాట్‌స్టార్‌లో ప్రారంభం కానుంది. ఈసారి దశావతారం థీమ్‌తో షోను రూపొందించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ క్రమంలోనే తొలి వారంలో 10 మంది కంటెస్టెంట్లు మాత్రమే హౌస్‌లోకి అడుగుపెడతారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ సీజన్ 10 ప్రత్యేకతల గురించి నాగార్జున విడుదల చేసిన ప్రోమోలో ఆటలో సవాలు కాదు ఆటే సవాలు అంటూ 10X సర్ప్రైజెస్ ఉంటాయని స్పష్టం చేశారు. సీజన్ 3 నుంచి విజయవంతంగా హోస్టింగ్ చేస్తున్న నాగార్జున, ఈసారి మరింత కొత్తదనంతో అలరించబోతున్నారు. రోజువారీ ఎపిసోడ్లు ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి ప్రసారం కానున్నాయని మీడియా వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రచార చిత్రాలు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్నాయి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో 10 మంది రూమర్డ్ కంటెస్టెంట్ల పేర్లు బాగా ప్రచారంలో ఉన్నాయి. టీవీ నటి చైత్ర రాయ్, యాంకర్ వర్షిణి, ముఖేష్ గౌడ, సినీ నటుడు కృష్ణుడు, టెంపర్ వంశీతో పాటు జబర్దస్త్ నటులు నరేష్, ఆటో రామ్‌ప్రసాద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు అదిత్ అరుణ్, దేబ్జానీ మోదక్, యూట్యూబర్ సుధీర్ రెడ్డి హౌస్‌లోకి వెళ్తున్నారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. అయితే ఈ జాబితాపై మేకర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలలో రామ్‌ప్రసాద్, నరేష్ కనిపించకపోవడంతో వీరు షోలోకి వెళ్లడం ఖాయమనే ఊహాగానాలు పెరిగాయి. ఫలితంగా నటి దేబ్జానీ మోదక్‌కు వారానికి 4 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మరోవైపు జియోహాట్‌స్టార్‌లో సామాన్యుల ఎంపిక కోసం అగ్నిపరీక్ష సీజన్

దర్శకుడు వీ.ఎన్.ఆదిత్య తన కెరీర్లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ‘నేనున్నాను’ సినిమా నిర్మాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన, అంతగా తెలియని విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా నాగార్జున గారు సినిమా ఫస్ట్ హాఫ్ చూసి ‘డిసప్పాయింట్’ అయ్యారనే అపోహలను ఆయన ఈ సందర్భంగా తొలగించారు. వీ.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ.. నాగార్జున గారు ఎడిటింగ్ రూమ్‌లో ‘నేనున్నాను’ తొలి సగభాగాన్ని చూసి అసంతృప్తి చెందారనేది కేవలం ఒక రూమర్ మాత్రమే. నిజానికి, అప్పట్లో ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు, ‘ఏ శ్వాసలో’ పాటలో వాడటానికి కొన్ని క్లాసికల్ కీర్తనల పల్లవులను తాత్కాలికంగా పెట్టారట. అన్నపూర్ణ స్టూడియోస్ లో డబ్బింగ్ థియేటర్ బయట నుంచున్న నాగార్జున గారు, ప్రతిసారీ ఈ క్లాసికల్ పాటలే వినబడుతుండటంతో, "ఏంటోయ్ అండి, మనం ఏదో అల్లరి అల్లుడు లాంటి సినిమా అనుకుంటే శంకరాభరణం చేస్తున్నాడేంటి మీ డైరెక్టర్?" అని సరదాగా అడిగారట. ఇది కేవలం ఒక జోక్ మాత్రమే తప్ప, ఆయన నిరాశ చెందలేదని ఆదిత్య స్పష్టం చేశారు. నాకంటే అతనే బాగా సూట్ అవుతాడు..! బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ ‘నేనున్నాను’ చిత్రానికి ప్రాణమైన ‘ఏ శ్వాసలో పాట రూపకల్పనలో వీ.ఎన్.ఆదిత్య వ్యక్తిగతంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. తాను ఈ ఒక్క పాటకైనా డాన్స్ మాస్టర్‌ను లేకుండా తీస్తానని పట్టుబడ్డానని, నాగార్జున గారు డాన్స్ మాస్టర్‌ను పెట్టుకోవాలని ఒత్తిడి చేసినా, తాను తన నిర్ణయం మార్చుకోలేదని తెలిపారు. ఈ పాటను చూసిన నాగార్జున గారి బంధువు ఓ అబ్బాయి కన్నీళ్లు పెట్టుకుని, రాఘవేంద్రరావు గారు తీసినట్టుగా ఉందని ప్రశంసించారట. అది తనకెంతో ధైర్యాన్ని ఇచ్చిందని ఆదిత్య గుర్తుచేసుకున్నారు. అంతగొప్ప వ్యక్తి మరణం నా సినిమాల మీద ప్రభావం చూపించింది.. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది సినిమా విడుదలైనప్పుడు ఎదురైన ప్రతికూల పరిస్థితులను వీ.ఎన్.ఆదిత్య వివరించారు. ‘నేనున్నాను’ తొలి రోజుల్లో విజయవాడ, హైదరాబాద్ వంటి చోట్ల

స్టార్ హీరోలు నటించే సినిమాలలో అభిమానులు అన్ని విషయాలు గమనిస్తుంటారు. హీరో లుక్ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అభిమానులకు ఉంటుంది. వాళ్ళ అంచనాలకు తగ్గకుండా హీరో లుక్ ఉంటే అక్కడి నుంచే సినిమాపై క్రేజ్ మొదలవుతుంది. ఆ విధంగా హీరోల లుక్స్ తోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ హీరోల లుక్స్ బావున్నప్పటికీ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిన సందర్భాలూ ఉన్నాయి. పవన్, మహేష్, ఎన్టీఆర్, నాగార్జున లాంటి హీరోల లుక్స్ కి మంచి క్రేజ్ వచ్చింది కానీ ఆ సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్ లుక్స్ లో పంజా మూవీ ముందు వరుసలో ఉంటుంది. అప్పటికి సరైన హిట్ లేక పవన్ అభిమానులు ఆకలి మీద ఉన్నారు. పంజాలో బియర్డ్ లుక్ బయటకి రాగానే ఈ చిత్రం రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అని అంతా భావించారు. కనీవినీ ఎరుగని అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా రిలీజ్ అభిమానుల ఆశలు ఆవిరి చేసింది. మహేష్ బాబు అందంగా కనిపించని సినిమా అంటూ ఉండదు. అయినప్పటికీ కొన్ని బెస్ట్ లుక్స్ ఉండే సినిమాలు ఉంటాయి. సర్కారు వారి పాట మూవీలో ఉబెర్ కూల్ లుక్ లో మహేష్ కనిపించారు. సినిమా నిరాశ పరిచింది. ఖలేజా కూడా అంతే. ఆ మూవీలో మహేష్ చాలా స్టైలిష్ గా ఉంటారు. కానీ సంబంధం లేని కామెడీ కారణంగా ఆ చిత్రం ఫ్లాప్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ ని చాలా యంగ్ గా, స్టైలిష్ గా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ హరీష్ శంకర్ సక్సెస్ అయ్యారు. కానీ సినిమా డిజాస్టర్ అయింది. రామయ్య వస్తావయ్యాలో తారక్ లుక్స్ చాలా స్టైలిష్ గా ఉంటాయి. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలో బన్నీ స్టైలిష్ లుక్స్ మైంటైన్

బుల్లితెర ఆడియెన్స్ ఎదురు చూస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే బిగ్ బాస్ 10 గ్రాండ్ లాంఛింగ్ ఉండనుంది. ఈసారి కూడా సెలబ్రిటీలకు కామన్ పీపుల్‌కు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష’ను నిర్వహిస్తున్నారు. ఈ కాంటెస్ట్ కు సంబంధించిన వీడియోలు ఇప్పటికే నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మరోవైపు సెలబ్రిటీ కంటెస్టెంట్లను ఒక్కొక్కరినీ ఫైనలైజ్ చేస్తున్నారని సమాచారం. వీరిలో ఇప్పటికే కొందరు పేర్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ సీజన్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్ల జాబితాలో టాలీవుడ్ కు చెందిన ఫేమస్ విలన్ కూడా ఉన్నారని సమచారం. అతను మరెవరో కాదు టెంపర్ వంశీ. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'టెంపర్'లో ప్రకాష్ రాజ్ తమ్ముడి పాత్రలో కరుడుగట్టిన విలన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వంశీ. 'టెంపర్' తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడీ యాక్టర్. 'అత్తారింటికి దారేది', 'భరత్ అనే నేను', 'సాహో', 'భీష్మ', 'వకీల్ సాబ్', 'హిట్ 2', 'దేవర'.. ఇలా పలు హిట్ సినిమాల్లో విలన్ గా ఆకట్టుకున్నాడు వంశీ. ఇక ఈ ఏడాది పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్', రీసెంట్ గా వరుణ్ తేజ్ సినిమా 'కొరియన్ కనకరాజు'లోనూ వంశీ నటించాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో వంశీ కన్ఫర్మ్ అని నెట్టింట ప్రచారం జరుగుతోంది. మరి సిల్వర్ స్క్రీన్ పై విలన్ గా చేసిన వ్యక్తి రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడు? బిగ్ బాస్ లో ఎలా ఎంటర్ టైన్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇటీవల వరుసగా సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తోన్న లేటెస్ట్ సెన్సేషన్ ఛర్మిల కూడా బిగ్ బాస్ 10లోకి వస్తుందని తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను యాంకరమ్మ ఖండించింది. కాగా

మెగాస్టార్ చిరంజీవి దాదాపు 48ఏళ్లుగా హీరోగా రాణిస్తున్నారు. ఆయన `పునాది రాళ్లు` చిత్రంతో వెండితెరకు పరిచయమై `ఖైదీ`తో బ్లాక్ బస్టర్ అందుకొని వెనక్కి తిరిగి చూడకుండా స్టార్‌గా రాణించారు. మెగాస్టార్‌గా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్దాలుగా టాలీవుడ్‌ని శాసిస్తున్నారు. యంగ్ హీరోలు పాన్ ఇండియా వేటలో, గ్లోబల్ సినిమా వేటలో రికార్డులు క్రియేట్ చేస్తున్నా, మెగాస్టార్ స్థానం మాత్రం చిరంజీవిదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ఆయన సినిమాలు చేస్తున్నారు. విజయాలు అందుకుంటున్నారు. ఈ సంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో హిట్ కోసం రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి నేడు శనివారం(ఆగస్ట్ 22) 71వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు, ఎవరికీ తెలియని విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చాలా మంది సెలబ్రిటీలు ఆయన గురించి కామెంట్ చేస్తున్నారు. అయితే తాజాగా ఒకప్పటి స్టార్ డైరెక్టర్ గీతా కృష్ణ షాకింగ్ విషయాలు వెల్లడించారు. చిరంజీవి హవా గురించి చెబుతూ, నాగార్జున, వెంకటేష్ హీరోలు అయిన పరిస్థితిని వివరించారు. చిరంజీవి డేట్స్ ఇవ్వలేకపోవడంతో వెంకటేష్, నాగార్జున హీరోలు అయ్యారని తెలిపారు. 1983లో చిరంజీవికి `ఖైదీ` పడింది. దీంతో నిర్మాతలు, దర్శకులు ఆయనతో సినిమాలు చేసేందుకు క్యూ కట్టారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్ పార్టీ పెట్టి రాజకీయాల్లో బిజీ అయ్యారు. సినిమాలు తగ్గించారు. ఫామ్ లో ఉన్న చిరంజీవి అందరికి డేట్స్ ఇవ్వలేకపోతున్నారట. ఆ టైమ్‌లో కృష్ణ, కృష్ణంరాజు, ఏఎన్నార్ కొంత వరకు నటిస్తున్నారు. కానీ వారి సినిమాలు కమర్షియల్‌గా వాహ్ అనేలా లేదు. ఈ క్రమంలో అందరి చూపు చిరంజీవిపైనే పడింది. అయితే ఆయన డేట్స్ కోసం ఏఎన్నార్ చాలా రోజులు తిరిగారట. ఏకంగా మూడేళ్లు చిరంజీవి వెంటపడ్డారట. కానీ తమ అన్నపూర్ణ