
Peddi Movie Review || చిత్రం: పెద్ది; నటీనటులు: రామ్‌చరణ్, శివరాజ్‌కుమార్, జాన్వీకపూర్, జగపతిబాబు, దివ్యేందు, బొమన్ ఇరానీ, రవి కిషన్ తదితరులు; సంగీతం: ఏఆర్ రెహమాన్; సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలు; ఎడిటింగ్: నవీన్ నూలి; నిర్మాత: వెంకట సతీశ్ కిలారు, ఇషాన్ సక్సేనా; రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సానా; విడుదల: 04-06-2026 తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూసిన సినిమాల్లో ‘పెద్ది’ (Peddi Movie) ఒకటి. రెండో సినిమానే రామ్‌చరణ్‌ను డైరెక్ట్ చేసే అవకాశం బుచ్చిబాబుకు రావడం, జాన్వీకపూర్ కథానాయికగా నటించడం, ఏఆర్ రెహమాన్ సంగీతం ఇలా అన్నీ ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. మరి ‘పెద్ది’ ఆ అంచనాలను అందుకుందా? రామ్‌చరణ్‌కు విజయాన్ని అందించిందా? బుచ్చిబాబు మేకింగ్ ఎలా ఉంది? Peddi movie story || విజయనగరం జిల్లాలోని కొండ కింద ఊరు అది. వందల మంది జీవనం సాగిస్తున్నా, ప్రభుత్వ రికార్డుల్లో ఆ ఊరికి గుర్తింపు అన్నదే ఉండదు. అందుకే ఆ ఊరు అన్నా, అక్కడి నుంచి వచ్చిన మనుషులన్నా అందరికీ చిన్న చూపు. ఆ ఊళ్లో పుట్టి పెరిగిన వాడే పెద్ది (రామ్‌చరణ్). రోజూ విజయనగరం వెళ్లి కూలి పనులు చేసుకుంటుంటాడు. పేరుకి కూలీ అయినా క్రికెట్లో మాత్రం రాటు దేలిన ఆటగాడు. అందుకే విజయనగరం, బొబ్బిలి క్రికెట్ జట్లు వేలంలో పెద్దిని కొనేందుకు పోటీపడుతుంటాయి. ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టగలిగిన మొనగాడైన పెద్దిని అంతా ఆట కూలీ అని పిలుస్తుంటారు. అలాంటి ఆటగాడు క్రికెట్‌ని వదిలి కుస్తీ క్రీడాకారుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది? కొండకింద ఊరు, అక్కడి మనుషుల కోసం పెద్ది చేసిన పోరాటంలో అతను ఏం కోల్పోయాడు? ఏం సాధించాడు? పెద్ది ప్రయాణంపై అప్పలసూరి (జగపతిబాబు), గౌర్నాయుడు (శివరాజ్‌కుమార్) ఎలాంటి ప్రభావం చూపించారు? ఈ కథలో అచ్చియమ్మ (జాన్వీ కపూర్) ఎవరు?(peddi review) తదితర విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
హంగులకు ఏమాత్రం లోటు చేయకుండా ఓ మంచి కథని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. తెలుగులో ఈ తరహా ప్రయత్నాలు చాలా అరుదు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందడంలో ఎలాంటి సందేహం లేదు.
peddi cast and crew || సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ఏఆర్ రెహమాన్ పాటలు ఆకట్టుకుంటాయి. ఆయన నేపథ్య సంగీతం మరో స్థాయిలో ఉంటుంది. రత్నవేలు కెమెరా పనితనం సినిమాకి ప్రాణం పోసింది. ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్ తదితర విభాగాల పనితీరులోనూ ప్రమాణాలు కనిపిస్తాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా భావోద్వేగాలతో కూడిన ఓ మంచి కథని చెప్పారు. వాణిజ్యాంశాలకూ లోటు చేయలేదు. తెలుగు తెరపై అరుదుగా చూసే ఈ తరహా కథను ఆయన రాసుకోవడం ఎంత ప్రత్యేకమో, చరణ్ నమ్మి నటించడం కూడా అంతే ప్రత్యేకం. బుచ్చి రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. ‘ఆ ఊరికీ ఈ ఊరికీ దూరం తగ్గించడం కాదు రా... ఆ మనుషులకీ ఈ మనుషులకీ మధ్య దూరం తగ్గించడం’ తరహా సంభాషణలు ఆలోచింపజేస్తాయి. నిర్మాణం ఉన్నతంగా ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
© 1999 - 2026 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics.