
ఇంటర్నెట్డెస్క్: బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ మంచి వసూళ్లు రాబడుతోంది. మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం పోస్టర్ను పంచుకుంది. ‘బాక్సాఫీస్
ఛాంపియన్ పెద్ది అన్స్టాపబుల్. ప్రపంచవ్యాప్తంగా రూ.236.7 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది’ అని టీమ్ పేర్కొంది. ఆదివారం సెలవు కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రామ్చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో జాన్వీకపూర్ కథానాయిక.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.