
ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. మాల్యవి కరణోదయ సొసైటీ ఆధ్వర్యంలో దమ్మాయిగూడ, చిల్కానగర్ ప్రాంతాలకు చెందిన పేద కార్మికులకు జీవనోపాధి కోసం ఆటోలను అందించారు. ఈ సేవా కార్యక్రమం
చేయడానికి ముందుకు వచ్చిన మాల్యవి కరుణోదయ సొసైటీ ఫౌండర్ కొండ కృష్ణమ్మకు సోనూసూద్ అభినందనలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలంటూ ప్రోత్సహించారు. వనపర్తి జిల్లాలోని సంకిరెడ్డిపల్లి, అమ్మడవాకుల గ్రామాలకు ఉచితంగా అంబులెన్స్‌ను సోనూసూద్ అందించారు. ఇదీ చదవండి: 45 ఏళ్ల క్రితం చెప్పిన కథ.. ఇప్పుడు ఇలా: కమల్‌హాసన్