
ఇంటర్నెట్ డెస్క్: కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తెరకెక్కించిన చిత్రం ‘స్లమ్‌డాగ్’ (SlumDog). సంయుక్త, టబు తదితరులు
కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను చెన్నైలో సోమవారం నిర్వహించారు.
పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ‘‘స్లమ్‌డాగ్.. నా తొలి తమిళ సినిమా. విజయ్ సేతుపతి సింప్లిసిటీ నాకు ఇష్టం. రోజూ సెట్‌కు కొత్త నటుడిగానే వస్తారు. ఎంత వెతికినా ఆయన నటనలో కొంచెం కూడా అహంకారం కనిపించదు. ఈ సినిమాలో ఆయన కొత్తగా కనిపిస్తారు. పవర్‌ఫుల్‌గా ఉంటారు. సంయుక్త చాలా చలాకీ. బ్యాడ్గాయ్ రోల్ చేయమని దునియా విజయ్ను కోరా. పెర్ఫామెన్స్‌తో అదరగొట్టారు. జరీనా వహాబ్ తల్లి పాత్ర పోషించారు. కొన్ని సన్నివేశాల్లోని ఆమె నటనకు నాకు కన్నీళ్లొచ్చాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా ఇది. రియల్ ఎమోషన్ కూడా ఉంది. యాచకులను మనం చూస్తుంటాంగానీ వారి గురించి పట్టించుకోం. వాళ్ల జీవితాల్లో ఎంతో ఎమోషన్ ఉంటుంది. యాక్షన్ మూవీ అయినప్పటికీ ‘స్లమ్‌డాగ్’లో ఎమోషన్‌కూ ప్రాధాన్యం ఉంది. జెన్ జీ కోసమే ఈ సినిమా. వాళ్లు చాలా ఎమోషనల్. ఫ్యామిలీతో కలిసి ఈ చిత్రాన్ని చూడాలని జెన్ జీని కోరుతున్నా’’ అని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.