
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఉద్రిక్తతలను ముగించేందుకు ఇరుదేశాలు (US-Iran Deal) ఓ అంగీకారానికి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో మోదీ (PM Modi) పోస్ట్ చేశారు.
‘‘పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. ఎన్నో దేశాల్లో ప్రాణనష్టం వాటిల్లింది. ఈ యుద్ధాన్ని ముగించేలా అమెరికా, ఇరాన్ అంగీకారం కుదుర్చుకోవడం స్వాగతించే విషయం. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వాలను పునరుద్ధరించడం, స్వేచ్ఛా నౌకాయానం, వాణిజ్యానికి భరోసా కల్పించడంలో ఈ పరిణామం సాయపడుతుందని భారత్ విశ్వసిస్తోంది.
సుస్థిరమైన తుది ఒప్పందానికి దారితీసేలా.. మిగిలిన అంశాల పైనా సానుకూల చర్చలు జరుగుతాయని విశ్వసిస్తున్నాం’’ అని మోదీ రాసుకొచ్చారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేలా ఇరాన్‌తో ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీన్ని టెహ్రాన్ కూడా ధ్రువీకరించింది. దీనిపై స్విట్జర్లాండ్ వేదికగా జూన్ 19న ఇరుదేశాలు సంతకాలు చేయనున్నాయి. హర్మూజ్‌లో అమెరికా నౌకాదళ దిగ్భందాన్ని తొలగించడం, ఈ జలసంధిని పూర్తిగా తెరవడం, ఇరాన్ చమురుపై ఆంక్షలు తదితర అంశాలపై ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.