
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Hyderabad Metro Phase 2:సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
జంట నగరాల ప్రజలకు, CURE పరిధిలోని ప్రాంతాల ప్రజలకు ఆయన ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ వంటి అంతర్జాతీయ నగరానికి ప్రపంచ స్థాయి రవాణా సౌకర్యాలు అవసరమని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఆలోచనతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మెట్రో ప్రాజెక్టు ప్రారంభమైందని గుర్తు చేశారు.
అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్ రెడ్డి కృషితో ఈ ప్రాజెక్టు హైదరాబాద్‌కు వచ్చిందన్నారు. వైఎస్ మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెట్రో తొలి దశ ఒప్పందాలు జరిగాయని చెప్పారు. 2017 నాటికి పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు తెలంగాణ ఏర్పడిన తర్వాత అనేక కారణాలతో ఆలస్యమైందని విమర్శించారు.
ముఖ్యంగా చారిత్రక కట్టడాల పేరుతో ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. ఈ ఆలస్యాల వల్ల రూ.15 వేల కోట్లతో పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు వ్యయం రూ.22 వేల కోట్లకు పెరిగిందన్నారు. కోవిడ్ ప్రభావం, ఆలస్యాల కారణంగా ఎల్ అండ్ టీ సంస్థ భారీ నష్టాలు ఎదుర్కొందని తెలిపారు.
గత ప్రభుత్వం పదేళ్లలో మెట్రో విస్తరణపై పెద్దగా దృష్టి పెట్టలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెట్రో విస్తరణకు చర్యలు ప్రారంభించామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఫేజ్-2 కోసం ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి సహకారం కోరామని
చెప్పారు. అయితే ఎల్ అండ్ టీ సంస్థ గత నష్టాల కారణంగా రెండో దశ నిర్మాణంలో పాల్గొనలేమని స్పష్టం చేసిందన్నారు.
దీంతో మెట్రో ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కేంద్రం సూచించిందని తెలిపారు. రూ.30 వేల కోట్ల విలువైన మెట్రో ఆస్తులను రూ.15 వేల కోట్లకు కొనుగోలు చేశామని చెప్పారు. తక్కువ వడ్డీతో రుణాలు పొందేందుకు ఐఆర్ఎఫ్సీ, జపాన్ సంస్థలతో చర్చలు జరిపామని వెల్లడించారు.
అయితే రుణ బదిలీ ప్రక్రియను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెట్రో ఫేజ్-2కు కేంద్రం భాగస్వామ్యం ఇస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవసరమైతే కేంద్రం వాటా లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం మెట్రో విస్తరణ పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. చివరగా కిషన్ రెడ్డిపై తమకు గౌరవం ఉన్నప్పటికీ, ఆయన వ్యవహారంపై అసహనం ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Read more: CM Revanth Reddy: వర్షాల వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడితే కఠిన చర్యలు.. అన్ని శాఖల అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.