
Vedanta Demerger | దిల్లీ: వేదాంతా గ్రూప్‌నకు చెందిన విభజిత నాలుగు కంపెనీల షేర్లు సోమవారం ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలైన BSE, NSEల్లో నమోదయ్యాయి. ఇప్పటికే నమోదైన వేదాంతా లిమిటెడ్‌తో పాటు కొత్తగా ఏర్పాటైన వేదాంతా అల్యూమినియం మెటల్-VAML, వేదాంతా ఆయిల్ అండ్ గ్యాస్ VOGL, వేదాంతా పవర్, వేదాంతా ఐరన్ అండ్ స్టీల్ VISL షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
ఆయా సంస్థలు స్వతంత్రంగా పని చేస్తూ, తన వ్యాపార ప్రణాళికలకు మూలధనాన్ని సమీకరించుకుంటాయి. షేర్ల విభజన ఇలా..: గనుల దిగ్గజ సంస్థ వేదాంతా గ్రూపు తన వ్యాపారాలను పునర్వ్యవస్థీకరించి విభజించింది. అల్యూమినియం, చమురు-గ్యాస్, విద్యుత్, ఇనుము, ఉక్కు వ్యాపారాలను ప్రత్యేకంగా గుర్తించడం ద్వారా ప్రతి వ్యాపారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టొచ్చన్న ఉద్దేశంతో డీమెర్జర్ ప్రక్రియ చేపట్టింది.
గతేడాది డిసెంబర్లో జాతీయకంపెనీ లా ట్రైబ్యునల్ ఈ డీమెర్జర్‌కు ఆమోదం తెలిపింది. ఇందులోభాగంగా వేదాంతా లిమిటెడ్‌లో కలిగిఉన్న ప్రతిఒక్క షేరుకు, వాటాదార్లు విభజిత కంపెనీల్లో ఒక్కో షేరు చొప్పున అందుకున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.