
కెనడాలో చదువుకుని అక్కడే శాశ్వత నివాసం పొందాలని భావించే వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు మానిటోబా ప్రావిన్స్ ఊహించని షాకిచ్చింది. చదువు పూర్తయ్యాక నేరుగా పర్మినెంట్ రెసిడెన్సీ (పీఆర్) పొందేందుకు ఉపయోగపడుతున్న కీలక ఇమ్మిగ్రేషన్ మార్గాన్ని రద్దు చేసింది.
ఈ నిర్ణయం భారతీయ విద్యార్థులపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కెనడా ప్రభుత్వం విదేశీ విద్యార్థులు, తాత్కాలిక వలసదారుల విషయంలో నిబంధనలు కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.మానిటోబా ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ (ఎంపీఎన్‌పీ) కింద అమల్లో ఉన్న ‘కెరీర్ ఎంప్లాయ్మెంట్ పాత్వే’ (సీఈపీ)ను వెంటనే అమల్లోకి వచ్చేలా రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పటివరకు మానిటోబాలో కనీసం ఏడాది పాటు చదివి, అర్హత కలిగిన ఉద్యోగం సంపాదిస్తే పీఆర్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. ముఖ్యంగా డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు ఈ మార్గాన్ని ఎక్కువగా వినియోగించుకునేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో విద్యార్థులు ఇతర ఇమ్మిగ్రేషన్ మార్గాలను ఆశ్రయించాల్సి ఉంటుంది.ఇకపై చదువు మాత్రమే సరిపోదని, స్థానిక ఉద్యోగ అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని మానిటోబా స్పష్టం చేసింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న ‘స్కిల్డ్ వర్కర్ ఇన్ మానిటోబా’ ప్రోగ్రామ్ కింద కనీసం ఆరు నెలలు ఒకే యజమాని వద్ద పూర్తి స్థాయి ఉద్యోగం చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వనుంది. అంటే విద్యార్హతల కంటే ఉద్యోగ అనుభవం, స్థానిక కార్మిక మార్కెట్‌తో అనుసంధానం కీలకంగా మారనున్నాయి.భారతీయ విద్యార్థులకు ఈ నిర్ణయం ప్రత్యేకంగా ప్రభావం చూపే అవకాశం