
Government Hospitals :మన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రుల అభి వృద్ధి పట్ల ఎంతో శ్రద్ధాశక్తులు కనబరుస్తూ అక్కడి పరిసరాల పరిశుభ్రతను, మౌలిక వసతులను మెరుగుపరి చేందుకు తగిన బడ్జెట్ ఏర్పాటు చేసి ఎన్నో చర్యలు తీసు కుంటున్నప్పటికి ప్రభుత్వ అసుపత్రిలోని కొంతమంది సిబ్బంది నిర్లక్ష్య వైఖరి మూలాన అక్కడి రోగుల వార్డులు ఎలుకలకు, దోమలకు, పాములకు, విషసర్పాలకు నిలయా లుగా మారుతూ అక్కడికి వైద్య నిమిత్తమై వస్తున్న రోగు లకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వార్డులు ఒక నరకకూపంగా మారుతుండటం కడు శోచనీయం. ప్రయివేటు వైద్యశాలల్లో చికిత్స శక్తికి మించిన పని కావడంతో బీద, బిక్కి, నిరుపేదలు తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యం చేయించుకునే నిమిత్తమై ప్రభుత్వ ఆసుపత్రులకు నిత్యం ఎంతో దూర ప్రాంతాల నుంచి వందలాది మంది వస్తూ వుంటారు.
మరీ వారికి లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటున్న డాక్టర్లు, వేలాది రూపాయల జీతాలు తీసుకుంటున్న దిగువ స్థాయి ఆరోగ్య సిబ్బంది వంటివారు తమ వృత్తికి తగిన న్యాయం చేస్తూ రోగుల వార్డులు పరిశుభ్రంగా ఉండేలా తగు జగ్ర త్తలు తీసుకునే గురుతర బాధ్యత ముమ్మాటికీ వారి భుజస్కందాలపై వుంది. ఇందులో భాగంగా అక్కడి బాత్రూంలలో గాని, వార్డులలో గాని ఎక్కడైనా పెద్ద పెద్ద రంధ్రాలు వుంటే తక్షణమే వాటిని పూడ్చివేయడంతోపాటు అక్కడి బండ సట్టం మరీ పాతపడిపోయి చీలికలు వచ్చి వుంటే తక్షణమే వాటి మరమ్మత్తులపై దృష్టి పెట్టాలి.
అప్పుడే అక్కడి వార్డులలో పాములు, ఎలుకలు, దోమలు వంటివి చొరబడకుండా రోగులు తగిన రక్షణలో ఉండగలు గుతారు. Read Also : Bengaluru Crime: ప్రియురాలి గొంతుకోసి చంపేసిన ప్రియుడు.. పెళ్లి వివాదమే కారణమా? ఎందుకంటే అక్కడికి వచ్చే రోగులు ఎంతో అపాయకరమైన పరిస్థితుల్లో, ఆందోళనతో ప్రభుత్వ ఆసుపత్రు లకు వస్తూ వుంటారు.
అలాంటి రోగులు వారి తరపున సహాయకారిగా ఉండేందుకు వచ్చే వారి కుటుంబసభ్యులకు తగిన సౌకర్యాలు కనీసం ఒక మోస్తారులోనైనా
కల్పించా ల్సిన బాధ్యత ప్రభుత్వ ఆసుపత్రులలోని సిబ్బంది పై ఎంతైనా వుంది. ఏదిఏమైనా ప్రభుత్వ సర్వజన వైద్యశా లలు అనేవి సామాన్యులకు, నిరుపేదలకు ఒక దేవాల యాల వంటివి కాబట్టి అక్కడికి విచ్చేసే రోగుల పట్ల భగ వంతుడు భక్తులకు అనుగ్రహమిచ్చినట్లు, అక్కడి డాక్టర్లు, మిగతా ఆరోగ్య సిబ్బంది వారి పట్ల ఎంతో ప్రేమానురాగాలతో, అప్యాయతతో నడుచుకొని, వారు చేరిన వార్డులలో ఎలాం టి అపరిశుభ్రత వాతావరణం లేకుండా యుద్ధ పాతిపదికన తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమైనా ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అంటారే అలా ఆనారోగ్యం పాలైన తమ ఆరోగ్యా న్ని మెరుగుపరచుకునేందుకు ప్రభుత్వ సర్వజన వైద్యశాల లకు వచ్చే నిరుపేద రోగుల పట్ల కాస్త కనికరం చూపి అక్కడి పరిసరాలలో దుమ్ము, ధూళి పేరుకుపోకుండా, విష పురుగులు, తేళ్లు వంటివి సంచరించకుండా అత్యంత అప్ర మత్తతతో వ్యవహారించా ల్సిన తక్షణ కర్తవ్యం, బాధ్యత ప్రభుత్వ ఆసుపత్రిసిబ్బంది పై ఎంతైనా వుంది ఇలా అపరి శుభ్రతకు నిలయాలుగా దురదృష్టవశాత్తు ప్రభుత్వ ఆసుప త్రులు మారితే పేద, నిరుపేద రోగులకు వచ్చినజబ్బుమాట దేవుడెరుగు లేని కొత్తజబ్బులు కొనితెచ్చుకున్నవారవుతారు. కాబట్టి రోగులకు మెరుగైన సౌకర్యాలు అందించాలి.
Bengaluru Crime: ప్రియురాలి గొంతుకోసి చంపేసిన ప్రియుడు.. పెళ్లి వివాదమే కారణమా?
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Madhya Pradesh Crime: భార్య మెడకు ఇనుప గొలుసు వేసి పైశాచిక దాడి.. ఓ భర్త వికృత చేష్టలు
Visakhapatnam Airport To Bhogapuram : వైజాగ్ ఎయిర్పోర్ట్ తరలింపు ..ఒకవైపు బాధ ..మరోవైపు ఆనందం
Abhishek Banerjee : రెబల్ ఎంపీలకు గుర్తింపు ఇవ్వవద్దు- లోక్‌సభ స్పీకర్‌కు టీఎంసీ లేఖ