
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Petrol Diesel Price News: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలకు త్వరలోనే బ్రేక్ పడనుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం ప్రపంచ దేశాలకు పెద్ద ఊరటనిచ్చింది.
వ్యూహాత్మక సముద్ర మార్గమైన 'హోర్ముజ్ జలసంధి'ని ఎలాంటి టోల్ ఫీజులు లేకుండా తిరిగి తెరుస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి.
ఆదివారం రాత్రి బ్రెంట్ క్రూడ్ ధర 3.9 శాతం తగ్గి బ్యారెల్‌కు 84 డాలర్లకు పడిపోగా, యూఎస్ క్రూడ్ 4.8 శాతం మేర తగ్గి దాదాపు 81 డాలర్లకు చేరింది. గడిచిన మార్చి నెల తర్వాత చమురు ధరలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
హోర్ముజ్ జలసంధి ఎందుకు అంత కీలకం? ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడి చమురులో అత్యధిక భాగం ఈ హోర్ముజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఈ మార్గాన్ని మూసివేశారు. ఈ దిగ్బంధనం కారణంగా వాణిజ్య నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం లేదా సురక్షిత ప్రయాణం కోసం సగటున 2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.16 కోట్లకు పైగా) అదనపు భారాన్ని భరించాల్సి వచ్చింది.
ఒకవేళ ఈ దిగ్బంధనం ఇలాగే కొనసాగి ఉంటే, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లను దాటేసేవని
, అమెరికాలో గ్యాసోలిన్ ధరలు రికార్డు స్థాయికి చేరేవని నిపుణులు హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతలకు శాంతి ఒప్పందంతో తెరపడటంతో ప్రపంచ ఇంధన మార్కెట్ ఊపిరి పీల్చుకుంది.
భారతదేశానికి ఎలాంటి ప్రయోజనం? భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 85 శాతం కంటే ఎక్కువ భాగాన్ని ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం వల్ల భారత్‌కు రెండు రకాలుగా లాభం చేకూరుతుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం వల్ల దేశ దిగుమతి బిల్లు భారీగా తగ్గుతుంది. సముద్ర రవాణా మార్గం సుగమం కావడంతో రవాణా ఖర్చులు మరియు ఇన్సూరెన్స్ ప్రీమియంలు భారం తగ్గుతాయి.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 8 శాతం నుండి 8.5 శాతం వరకు పెరిగాయి. అయితే ప్రస్తుత సానుకూల పరిణామాలపై భారత పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందిస్తూ.. రాబోయే నెలల్లో చమురు, గ్యాస్ ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర 80 డాలర్ల స్థాయికి చేరినందున, దేశీయ చమురు కంపెనీలు త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 నుండి రూ.5 రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉంది. దీనితో పాటు సామాన్యుడిపై భారం తగ్గించేలా వంటగ్యాస్ (LPG) సిలిండర్ ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది.
(గమనిక: చమురు ధరల తగ్గింపుపై ప్రభుత్వ రంగ సంస్థల నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ రానున్న రోజుల్లో సామాన్యుడికి ఇంధన ధరల నుండి ఉపశమనం లభించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరిచడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.