
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
FIFA World Cup 2026: ప్రపంచవ్యాప్త క్రీడా సంబరం ఫుట్‌బాల్ యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తుండగా.. భారతదేశంలో కూడా జీ మీడియా ద్వారా ప్రజలు ఫిఫా ప్రపంచకప్‌ను వీక్షిస్తూ వినోదం పొందుతున్నారు. ఫిఫా మెగా టోర్నీ ప్రసార హక్కులు జీ మీడియా దక్కించుకోవడంతో జీ నెట్‌వర్క్‌లోని వివిధ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఫిఫా వరల్డ్ కప్‌ను వీక్షిస్తున్నారు.
వీక్షణల్లో జీ మీడియా కొత్త రికార్డులు నమోదు చేసింది. తొలి వారాంతంలోనే వంద మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఫిఫా ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లను జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ద్వారా భారతీయ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు.
ఫుట్‌బాల్ అభిమానులను అలరిస్తూ ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రసారాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచకప్ ప్రారంభమైన తొలి వీకెండ్లోనే డిజిటల్, టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఏకంగా 10 కోట్ల (100 మిలియన్) మందికి పైగా వీక్షకులను ఆకట్టుకుంది.
వంద మిలియన్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డు నమోదు చేసింది. జీ గ్రూప్‌నకు చెందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'జీ5' తొలి వీకెండ్లోనే సుమారు 60 లక్షల (6 మిలియన్) మంది వీక్షించారు. ఆరంభ వేడుకలతో పాటు జూన్ 11 నుంచి జూన్ 14 వరకు (4 రోజుల పాటు) జరిగిన లైవ్ మ్యాచ్‌లు చూసేందుకు వీక్షకులు ఎగబడ్డారు.
ఒక్కో వీక్షకుడు సగటున 190 నిమిషాల పాటు మ్యాచ్‌లను వీక్షించడంతో జీ5 యాప్ సత్తా ఏమిటో తెలుపుతోంది. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఫిఫా కంటెంట్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. జీ మీడియా సోషల్ మీడియా వ్యాప్తంగా ఏకంగా
36 కోట్ల (360 మిలియన్) వ్యూస్ వచ్చాయి. జీ సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన '#Watchega' క్యాంపెయిన్ సుమారు 33 కోట్ల మందికి చేరువైంది.
స్పోర్ట్స్ ఛానల్స్‌లో వీక్షణలు జీ మీడియా సంస్థ ఇటీవల యునైట్8 స్పోర్ట్స్ పేరిట నాలుగు క్రీడా టీవీ ఛానల్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ ఛానల్స్ల్లోనూ ఫిఫా ప్రపంచకప్ 2026కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. జీ కంపెనీకి చెందిన స్పోర్ట్స్ టీవీ ఛానళ్లు-'యునైట్8 స్పోర్ట్స్' దేశంలోని కోట్లాది ఇళ్లకు ఫుట్‌బాల్ పండుగను మోసుకొచ్చాయి. అత్యున్నత నాణ్యతతో కూడిన ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా ఈ ఛానళ్లు దేశవ్యాప్తంగా సుమారు 2.5 కోట్ల (25 మిలియన్) నివాసాలకు చేరువైంది.
'జీ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ఫిఫా వరల్డ్ కప్ 2026కు లభిస్తున్న అద్భుత స్పందన ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. తొలి వీకెండ్లోనే డిజిటల్, టీవీ ప్లాట్‌ఫామ్‌లలో నమోదైన వీక్షకుల సంఖ్య భారతదేశంలో ఫుట్‌బాల్‌పై ఉన్న మక్కువను తెలియజేస్తోంది. ఎలాంటి ఆటంకాలు లేని, అత్యుత్తమ వీక్షణ అనుభవాన్ని ప్రేక్షకులకు అందించడమే మా లక్ష్యం. రాబోయే రోజుల్లో టోర్నమెంట్ మరింత ఉత్కంఠగా మారనుండడంతో వీక్షకుల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నాం' అని జీ మీడియా ప్రతినిధి ఒకరు తెలిపారు.
ప్రపంచకప్ టోర్నీకి సంబంధించిన మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్‌తోపాటు ఇమ్మర్సివ్ స్టూడియో ప్రోగ్రామింగ్, నిపుణుల విశ్లేషణలు, బహుభాషా కామెంటరీని జీ5 అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా సామూహిక వీక్షణను ప్రోత్సహించడానికి పబ్లిక్ వీక్షణ ఆపరేటర్లతో జీ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది. పలు నగరాల్లో ఫ్యాన్ పార్క్‌లు, ఎక్స్‌పీరియెన్షియల్ జోన్లను ఏర్పాటు చేసి ఆన్ గ్రౌండ్ యాక్టివేషన్స్ ద్వారా టోర్నమెంట్ ఉత్సాహాన్ని ఊరూరా చాటుతోంది. రాబోయే వారాల్లో మరిన్ని కీలక మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో, జీ నెట్వర్క్ తన లీనియర్ మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రేక్షకులను మరింతగా అలరించడానికి సర్వసన్నద్ధమైంది.