
ఇంటర్నెట్ డెస్క్: కొత్త సినిమా రిలీజైతే చాలు తొలిరోజే చూడాలని ఆరాటపడే వారు కొందరుంటారు. ఓటీటీకి వచ్చాక చూద్దాంలే అనుకునే వారు మరికొందరు. అలా కాకుండా ఆన్లైన్లో ఎక్కడ సినిమా దొరకుతుందా? ఉచితంగా చూసేద్దామా? అనుకునే వారు ఇంకొందరు ఉంటారు.
అలాంటి వారి ఆరాటాన్నే ఆసరాగా చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. థియేటర్లో నడుస్తున్న సినిమాలు లేదంటే ఓటీటీలోకి కొత్తగా మూవీలను ఉచితంగా చూడండంటూ లింకులను అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని క్లిక్ చేస్తే అంతే సంగతులు.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కినట్లే.
స్ట్రీమింగ్ యాప్స్ పేరుతో ఏపీకే ఫైళ్లను మీ ఫోన్లో డౌన్లోడ్ చేయించి.. ఆపై అన్ని రకాల యాక్సెస్లూ పొంది.. వ్యక్తిగత డేటా, బ్యాంకు వివరాలు, ఓటీపీ వంటి కీలక సమాచారాన్ని తస్కరిస్తారు. తద్వారా మీకు తెలియకుండానే మీ ఫోన్ నియంత్రణ సైబర్ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది.
దీంతో అందినకాడికి దోచుకుంటారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ (CyberCrime) పోలీసులు సూచిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.