
హార్ముజ్ జలసంధి ఎట్టకేలకు పునఃప్రారంభమైంది. ముడిచమురు ధరలు తగ్గడం ప్రారంభమైంది. ఇంధన ధరల తగ్గింపు పరిమితంగానే ఉంటుంది. Petrol Diesel Prices: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయి.
ఈనేపథ్యంలోనే వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ఎట్టకేలకు పునఃప్రారంభమైంది. అంతర్జాతీయంగా చమురు సరఫరా ఆందోళనలు తగ్గడంతో, ప్రపంచ మార్కెట్లో ముడిచమురు (Crude oil) ధరలు దిగిరావడం ప్రారంభించాయి. గత కొన్ని వారాలుగా పశ్చిమాసియా సంక్షోభం కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం, తమ నెలవారీ బడ్జెట్లపై పడబోయే భారాన్ని చూసి ఆందోళన చెందిన భారతీయ కుటుంబాలకు ఇది కాస్త ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో ఐదో వంతు, అలాగే ఎల్ఎన్జీ సరఫరాలు ఈ ఇరుకైన సముద్ర మార్గం గుండానే సాగుతాయి. తన చమురు అవసరాల కోసం 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడే భారతదేశానికి ఈ మార్గం తెరుచుకోవడం ఒక సానుకూల పరిణామంగా చెప్పుకోవాలి.
TG Breakfast Scheme: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ బడుల్లో బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభం.. మెనూలో ఇడ్లీ, దోశ, పూరీ, ఉప్మా.. మన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు(Petrol Diesel Prices) ధరలు తగ్గినప్పటికీ, భారతీయ రిటైల్ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే భారీగా తగ్గుతాయని ఆశించే అవకాశం లేదు.
ఇన్ఫోమెరిక్స్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ డాక్టర్ మనోరంజన్ శర్మ విశ్లేషణ ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర స్థిరంగా 80 డాలర్ల కంటే తక్కువగా కొనసాగితేనే భారత్‌లో ఇంధన ధరల తగ్గింపు సాధ్యమవుతుంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు గతంలో తాము ఎదుర్కొన్న నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.
. ఎల్పీజీ (LPG) ధరల పరిస్థితి ఏమిటి? ఇక సెలండర్ల ధరల విషయానికొస్తే, అందరికీ కాకుండా ఎంపిక చేసిన వర్గాలకే ప్రభుత్వం నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రభుత్వం సిలిండర్‌పై రూ.200 సబ్సిడీని అందిస్తోంది. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు తగ్గితే ప్రభుత్వ సబ్సిడీ భారం తగ్గుతుంది. తద్వారా లభించే అదనపు నిధులను బట్టి ప్రభుత్వం భవిష్యత్తు విధానాలను నిర్ణయిస్తుంది. అయితే, పూర్తిస్థాయి ధరల తగ్గింపు అనేది ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది కాబట్టి, సాధారణ వినియోగదారులకు తక్షణమే పెద్ద ఉపశమనం లభించకపోవచ్చు. నెలవారీ బడ్జెట్, రూపాయి విలువపై ప్రభావం: ఇంధన ధరలు స్వల్పంగా తగ్గడం వల్ల రవాణా ఖర్చులు, వంటగ్యాస్ ఖర్చులు కాస్త తగ్గి మధ్యతరగతి కుటుంబాలకు కొంతమేర వెసులుబాటు కలుగుతుంది. కానీ నిత్యావసరాలు, విద్య, వైద్య ఖర్చులు నిరంతరం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, ఈ ఇంధన ధరల తగ్గింపు వల్ల వచ్చే పొదుపు చాలా పరిమితంగానే ఉంటుంది. మరోవైపు, చమురు ధరలు తగ్గడం భారతీయ రూపాయికి, స్టాక్ మార్కెట్లకు పెద్ద ఊరటనిస్తుంది. గతంలో చమురు సంక్షోభం వల్ల విదేశీ ఇన్వెస్టర్లు భారతదేశం నుండి సుమారు 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసేసుకోవడంతో రూపాయి విలువ ఒడిదుడుకులకు లోనైంది. ఇప్పుడు చమురు భయాలు తొలగడంతో రూపాయి మరింత బలపడే అవకాశం ఉంది. భారతదేశం వద్ద ఉన్న భారీ విదేశీ మారక నిల్వలు, బలిష్టమైన సేవా రంగాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఇలాంటి సంక్షోభాల నుండి రక్షించగలవు.
అందువల్ల తాత్కాలిక ధరల తగ్గుదలను బట్టి కాకుండా, దీర్ఘకాలికంగా క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉంటేనే లీటరుకు రూ.2 నుండి రూ.4 వరకు పరిమితంగా తగ్గించే అవకాశం ఉంది