
Maa Inti Bangaaram || ఇటు వినోదం పాటు, యాక్షన్‌తో అదరగొట్టేందుకు సిద్ధమయ్యారు సమంత (Samantha). ఆమె కథానాయికగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సరికొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’. రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వూరు నిర్మించారు.
దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈనెల 19న (Maa Inti Bangaaram Release Date) థియేటర్స్‌లో విడుదల కానుంది. ‘కుటుంబ భావోద్వేగాలతో నిండిన యాక్షన్ చిత్రమిది. ప్రేక్షకులు పెట్టే డబ్బులకు.. వెచ్చించే సమయానికి..
అన్నింటికీ న్యాయం చేసేలా ఉంటుంది’ అని చిత్రబృందం చెబుతోంది. Transfer Trimurthulu || ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలతో అలరించారు వడ్డే నవీన్. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. రాశీ సింగ్ కథానాయిక.
శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 19న (transfer trimurthulu release date) థియేటర్లలోకి రానుంది. బలమైన కథాంశంతో సహజత్వానికి దగ్గరగా ఉండేలా కథ, కథనాలను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది.
Balan: The Boy (2026) || ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్రంతో స్నేహబంధం విలువను తెరపై ఆవిష్కరించి.. సినీప్రియుల మనసుల్ని గెల్చుకున్నారు మలయాళ దర్శకుడు చిదంబరం. ఇప్పుడాయన అలాంటి మరో కథతో అలరించడానికి సన్నద్ధమయ్యారు. చిదంబరం దర్శకత్వం వహించిన చిత్రం ‘బాలన్: ది బాయ్’.
తల్లీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తీర్చిదిద్దిన ఈ సినిమా తెలుగులోనూ ఈనెల 19న థియేటర్లలోకి రాబోతోంది. Deewana || వెండితెరపై ప్రేమకథలు ఎవర్ గ్రీన్. ‘చచ్చేంత ప్రేమ లేకపోతే అది లవ్వే కాదు..’ అంటున్నారు యువ కథానాయకుడు హర్షిత్.
స్మేహ మణిమేఖలై కలిసి ఆయన నటించిన ప్రేమ కథా చిత్రం ‘దీవాన’. శ్రీకాంత్ దర్శకుడు. గీతా ఆర్ట్స్ ఈ మూవీని విడుదల చేస్తోంది. జూన్ 19న థియేటర్స్‌లో విడుదల కానుంది. ‘ఎంత గొప్ప లవ్‌స్టోరీ అయినా
.. వన్‌సైడ్ లవ్‌తోనే మొదలవుతుంది’ అంటూ ప్రచార చిత్రాల్లో వినిపించిన సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయి.
Vanda Devullu Movie || వైవిధ్యమైన కథలు, పాత్రలతో అలరించే నటుడు విజయ్ ఆంటోనీ. శశి దర్శకత్వంలో ఆయన నటించిన ‘బిచ్చగాడు’ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడు అదే కలయికలో రూపొందిన మరో చిత్రమే ‘వంద దేవుళ్ళు’. శ్వాసిక, అజయ్, కావ్య, శక్తి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ కూడా తమిళ, తెలుగు భాషల్లో జూన్ 19న థియేటర్స్‌లో సందడి చేయనుంది. పీరియాడికల్ డ్రామాగా, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాల మేళవింపుతో ‘వంద దేవుళ్ళు’ తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం చెబుతోంది.
Cocktail 2 movie || షాహిద్ కపూర్, రష్మిక (Rashmika Mandanna), కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కాక్టెయిల్ 2’ . ముక్కోణపు ప్రేమకథా నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీకి హోమీ అదజానియా దర్శకత్వం వహిస్తున్నారు. దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు. జూన్ 19న (cocktail 2 release date) ఈ చిత్రం థియేటర్లలో అలరించేందుకు సిద్ధమైంది. న్యూఏజ్ లవ్ డ్రామాగా దీన్ని తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది.
ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.