
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ 10 రోజులైనా ఇంకా లభించలేదు. అయితే చిన్నారి అదృశ్యంపై కొంత మంది పెడుతున్న కామెంట్లు తమను ఎంతో బాధిస్తున్నాయని జ్ఞానేశ్వరి తల్లి భవానీ ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నారి క్షేమంగా తిరిగి వస్తుందని ఆశతో ఉన్నామని, ఆ ధైరాన్ని కూడా కోల్పోనివ్వద్దని ఆమె కోరారు. మరో వైపు చిన్నారి ఆచూకీ కోసం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్లీజ్.. నెగిటివ్ కామెంట్లు పెట్టొద్దు: జ్ఞానేశ్వరి తల్లి
|