
Bengaluru Crime: కర్ణాటక రాజధాని బెంగళూరులో బ్యాదరహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 22 ఏళ్ల యువతి తను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే అత్యంత దారుణంగా హత్యకు గురైంది. ఈ కేసులో ఆమె ప్రియుడిని ప్రధాన నిందితుడిగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అయితే, యువతి మృతదేహం పక్కనే నిందితుడు కూడా స్పృహ తప్పిన స్థితిలో పడి ఉండటంతో పోలీసులు అతడిని ఆసుపత్రిలో చేర్పించి, కేసును విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. Read also: Madhya Pradesh Crime: భార్య మెడకు ఇనుప గొలుసు వేసి పైశాచిక దాడి..
ఓ భర్త వికృత చేష్టలు యువతి ని22 ఏళ్ల ఎస్. భవానిగా పోలీసులు గుర్తించారు. ఆమె చదువుకుంటూనే ఒక మొబైల్ షోరూమ్‌లో బిల్లింగ్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తోంది. భవాని తండ్రి వంట మాస్టర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పలు సంచలన విషయాలు వెల్లడించారు.
తన కుమార్తె భవాని, చంద్రశేఖర్ అనే యువకుడి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం ఇటీవలే తమకు తెలిసిందని చెప్పారు. అయితే తాను కూతురి ప్రేమను నిరాకరించి.. ఆమెకు మరొక వ్యక్తితో పెళ్లి చేయాలని నిర్ణయించుకుని సంబంధాలు చూడడం ప్రారంభించినట్లు వివరించారు.
ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం తమ కుటుంబ సభ్యుల వాట్సాప్ గ్రూపులో భవాని, చంద్రశేఖర్లకు సంబంధించిన ఒక ఫోటో షేర్ అయింది. దీన్ని చూసి ఆందోళన చెందిన తండ్రి కుమార్తెకు ఫోన్ చేయగా, అప్పటికే ఆమె మొబైల్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. కూతురి ఫోన్ కలవకపోవడంతో శ్రీనివాస్ నేరుగా నిందితుడైన చంద్రశేఖర్‌కు ఫోన్ చేశారు.
మొదట కాల్స్ ఎత్తని నిందితుడు.. ఆ తర్వాత తిరిగి భవాని తండ్రికి ఫోన్ చేసి షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. “నేను నీ కూతురిని చంపేశాను.. నువ్వు ఏం చేసుకుంటావో చేస్కో.. నేనే స్వయంగా పోలీసులకు సమాచారం ఇస్తాను” అని ఫోన్లోనే బెదిరించాడు.
ఈ సమాచారంతో తండ్రి వెంటనే భవాని ఉంటున్న ఇంటి యజమానికి సమాచారం
ఇచ్చారు. లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా.. భవాని గదిలో రక్తపు మడుగులో శవమై పడి ఉంది. ఆమె పక్కనే చంద్రశేఖర్ స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. వెంటనే భవానిని ఆసుపత్రికి తరలించినప్పటికీ.. ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఏదో వ్యక్తిగత వివాదం, పెళ్లి నిరాకరణ కారణంగానే నిందితుడు పదునైన ఆయుధంతో భవానిని గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని హత్య సెక్షన్ల కింద బ్యాదరహళ్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడు చంద్రశేఖర్ ఏ పరిస్థితుల్లో స్పృహ కోల్పోయాడు? అతను భవానిని చంపి ఏదైనా విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Telangana schools: మొదటి రోజు పాఠశాలల్లో తగ్గిన హాజరు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Marius Borg Hoiby: నార్వే ప్రిన్స్ సవతి కుమారుడికి 4 ఏళ్ల జైలు శిక్ష
Madhya Pradesh Crime: భార్య మెడకు ఇనుప గొలుసు వేసి పైశాచిక దాడి.. ఓ భర్త వికృత చేష్టలు
Indian man arrested in Nepal : లోదుస్తుల్లో మాదకద్రవ్యాలు దాచిన భారతీయుడు నేపాల్‌లో అరెస్టు
Sangam crime: దువ్వూరులో రిటైర్డ్ టీచర్ ఫ్యామిలీ ఆత్మహత్య!
Bapatla Train Robbery: బాపట్ల వద్ద రైలు దోపిడీ దొంగల బీభత్సం!
Nellore Crime:నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య!