
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌పై ఉన్న అభిమానం దేశ సరిహద్దులు దాటింది. చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ ఫస్ట్ షోను వీక్షించేందుకు జపాన్ రాజధాని టోక్యో నుంచి ఇద్దరు మహిళా అభిమానులు హైదరాబాద్‌కు తరలివచ్చారు. ఉద్యోగానికి ఐదు రోజులు సెలవు పెట్టి మరీ ‘పెద్ది’ విడుదలకు రెండు రోజుల ముందే నగరానికి చేరుకున్నారు జపాన్ అభిమానులు మసామీ, క్రిస్. తమ స్నేహితురాలు కణ్మనితో కలిసి నగరంలోని మల్టీఫ్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాను ఆస్వాదిస్తూ ప్రేక్షకులతో కలిసి సందడి చేస్తున్నారు. ఒక షో కాదు.. ఏకంగా 10 షోలు చూశాకే తిరిగి విమానం ఎక్కుతామని చెబుతున్నారు. ఇదీ చదవండి: రివ్యూ: ‘పెద్ది’.. రామ్‌చరణ్ స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉంది?