
Brahmamudi Septmeber 15th Episode: రాజ్పైప్రతీకారానికి రేఖస్కెచ్.. బలి పశువుగా మారిన ఐశ్వర్య
Brahmamudi Serial Todays Episode 1137 Septmeber 15th: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 14వ తేదీ ఎపిసోడ్ 1137లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial Todays Episode 1137 Septmeber 15th: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 14వ తేదీ ఎపిసోడ్ 1137లో ఏం జరిగిందంటే?
Brahmamudi Serial September 14th Episode: ఈరోజుటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్లో ఐశ్వర్య ఇందు వద్దకు వెళ్లి డబ్బులు అడుగుతుంది. కాలేజీ ఫీజు కట్టాలని, అది కడితేనే హాల్ టికెట్ ఇస్తారని చెబుతుంది. ఎంతని అడగ్గా ఐశ్వర్య రూ.50 వేలు అంటుంది. దీంతో అక్కడే ఉన్న రాజు.. నువ్వు నీ ఫ్రెండ్స్‌తో కలిసి ఎక్కడికో వెళ్లాలనుకుంటున్నావు, అందుకే ఇంతగానం అడుగుతున్నావని అంటాడు. దీంతో ఐశ్వర్య ఓ సీక్రెట్ రివీల్ చేసి.. ఇందు ముందే రాజును ఇరికిస్తుంది. అయినా చివరకు ఇందు డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్పగా వెళ్లిపోతుంది. ఇలా ఈరోజ
Podarillu Serial Today Episode పొదరిల్లు సీరియల్లో సోమవారం నాటి ఎపిసోడ్లో చక్రి వేసిన ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. నారాయణ వేసిన ప్లాన్‌కి గాయత్రి అడ్డుగా నిలుస్తుంది. తాయారును రెచ్చగొట్టి జయంతి అమ్మ మీదకు ఉసిగొల్పాలని నారాయణ ప్రయత్నిస్తాడు. కానీ మధ్యలో గాయత్రి వచ్చి అడ్డుకుంటుంది. ఇంకో వైపు కన్నా, కేశవ కూడా ఓ ప్లాన్ వేస్తాడు. నిశ్చితార్థం చేయడానికి వచ్చిన పంతుల్ని కొనేయాలని, అతని ద్వారా ఈ ఎంగేజ్మెంట్ ఆపాలని చూస్తారు కన్నా,కేశవ.

Brahmamudi Serial Todays Episode 1137 Septmeber 14th: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 14వ తేదీ ఎపిసోడ్ 1137లో ఏం జరిగిందంటే?
జ్యోత్స్నని సూరజ్ మోసం చేయడానికి, ఆమె పెళ్లి ఆగిపోవడానికి దీప, కార్తీక్‌లే కారణం అని శివన్నారాయణ అనడం కాదు.. దశరథ్ కూడా అదే మాట అనడంతో తల్లడిల్లిపోతారు దీప, కార్తీక్‌లు. ఈరోజు (సెప్టెంబర్ 02) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. ‘నా కుటుంబాన్ని ప్రమాదంలో పడేశారు. దీప... ఈ దశరథ్, సుమిత్రల కన్న కూతురని నేను ఈ జన్మలో నోరు తెరిచి చెప్పలేనమ్మా.. ఎందుకంటే జ్యోత్స్నకి అంత అన్యాయం చేశారు’ అని అంటాడు దశరథ. ఈ నిజం బయటపడిన రోజు సుమిత్ర ఆనంద పడదు.. బాధపడుతుంది. ఎందుకంటే.. అంత ప్రేమగా చూసుకున్న కూతురికి నువ్వే అన్యాయం చేశావ్ అని తెలిస్తే.. తట్టుకోలేదు. అప్పుడు నా భార్య నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది’ అని అంటాడు దశరథ. ఆ మాటతో దీప.. ‘మీరు నా జీవితంలో ఉన్నా లేకపోయినా మీరు బావుండాలనే నేను కోరుకునేది నాన్నా’ అని ప్రవచనం మొదలుపెట్టడంతో.. ‘నీతో నేను మాట్లాడలేనమ్మా’ అని దండం పెట్టేస్తాడు దశరథ. చూడు కార్తీక్.. నీ భార్యని తీసుకుని వెళ్లిపో.. అని అనేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు దశరథ. దాంతో దీప.. ఏంటి బావా ఇదీ?? నాన్న నన్ను ఇంత పరాయి దాన్ని చేసి మాట్లాడుతున్నాడు అంటూ కన్నీటిపర్యంతం అవుతుంది.నా కోసం.. నా ప్రేమ కోసం నువ్వు వస్తావని తెలుసు సూరజ్.. పరిస్థితులే అలా చేయిస్తున్నాయి.. మామయ్య పరిస్థితే ఇలా ఉంటే.. అక్కడ జ్యోత్స్న పరిస్థితి ఎలా ఉందో అని అంటాడు కార్తీక్. కట్ చేస్తే.. జ్యోత్స్న.. సూరజ్ విసిరి కొట్టిన తాళిని తీసుకుని కన్నీళ్లతో అతని ఊహల్లోనే ఉంటుంది. ఇంతలో సూరజ్ వస్తాడు. వచ్చావా సూరజ్.. నాకోసం వస్తావ్ అని తెలుసు.. నీ ప్రేమ నన్ను మార్చినప్పుడు.. నా ప్రేమ నిన్ను ఎందుకు మార్చదు అని అంటుంది జ్యోత్స్న. ‘లేదు.. నన్ను మర్చిపో అని చెప్పడానికి వచ్చాను’ అని అంటాడు సూరజ్. ‘నన్ను దూరం

Karthika Deepam 2 Big Twist: తెలుగు టీవీ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సీరియల్స్‌లో కార్తీక దీపం 2 కూడా ఒకటి. ప్రతిరోజూ కొత్త మలుపులతో సాగుతున్న ఈ సీరియల్ కథ ప్రస్తుతం మరింత ఆసక్తికరంగా మారింది. దీప అసలు ఎవరు? ఆమెకు శివ నారాయణ కుటుంబానికి ఉన్న సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం కోసం ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన పరిణామాలతో ఈ నిజం ఇప్పట్లో బయటకు వచ్చేలా కనిపించడం లేదు. కార్తీకదీపం రెండో భాగం ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను.. తెగ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. సీరియల్ కథలో దీపే శివ నారాయణ కుటుంబానికి అసలైన వారసురాలు అనే విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. కార్తీక్, జ్యోత్స్న, పారిజాతం, దశరథ, దాసుకు ఈ విషయం గురించి అవగాహన ఉంది. దీపను ఆమె తల్లిదండ్రులకు దగ్గర చేయాలని కార్తీక్ ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈ ప్రయత్నాలకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇదిలా ఉంటే జ్యోత్స్న జీవితంలో సూరజ్ రావడంతో కథ మరో మలుపు తిరిగింది. సూరజ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత దీపే అసలైన వారసురాలు అనే విషయాన్ని అందరికీ చెబుతానని జ్యోత్స్న నిర్ణయించుకుంది. దీంతో దీప తన కుటుంబానికి దగ్గరయ్యే సమయం వచ్చిందని ప్రేక్షకులు భావించారు. కానీ సూరజ్ విషయంలో వచ్చిన ట్విస్ట్‌తో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సూరజ్ మాలినికి సంబంధించిన వ్యక్తి అని తెలియడంతో జ్యోత్స్న పెళ్లి ఆగిపోయింది. ఈ పరిణామానికి దీప, కార్తీక్ కారణమని కొందరు భావించే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇంతకాలం జ్యోత్స్నను తన కూతురిగా చూసుకున్న దశరథ కూడా ఒక్కసారిగా మాట మార్చాడు. జ్యోత్స్ననే తన కూతురని చెప్పడంతో దీప విషయంలో మళ్లీ గందరగోళం మొదలైంది. దీప తన సొంత కూతురనే విషయాన్ని బయటపెట్టకూడదని దశరథ నిర్ణయించుకోవడం కథను మరింత ఆసక్తికరంగా మార్చింది. దీంతో దీప అసలు నిజం ఎప్పుడు బయటపడుతుందనే ప్రశ్న
బిగ్ బాస్ స్టేజ్ మీద ఎవరు ఎంత వర్త్.. ఎవరికి ఎంత స్పేస్ ఉంటుంది.. అని చెప్పాలి.. 15, 30, 45, 60 సెకన్లు అంటూ విభజించిన ఈ నాలుగు కేటగిరీల్లోంచి ఏదో ఒక బ్యాడ్జ్ మెడలో వేయాలని టాస్క్ ఇచ్చారు. ఈ క్రమంలో షాలిని, రామకృష్ణ, అపూర్వ, రాజ కుమారి, ఝాన్సీ ఇలా చాలా మంది మధ్య గొడవలు జరిగాయి. ఇక రామకృష్ణ, షాలినీ అయితే ఒకరి మీదకు ఒకరు వెళ్లారు. నీకు మాట్లాడటమే రాదు అని షాలినీపై అపూర్వ ఫైర్ అయింది. ఇక అప్పుడు కూడా షాలిని మీద మీదకు వెళ్లడంతో.. అసలు ఆమెకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వొచ్చు కదా అని షాలినీకి శ్రీముఖి కౌంటర్ వేస్తుంది.అలా ఈ టాస్క్‌లో చివరగా రోహిత్ వస్తాడు. అప్పుడు 60 సెకన్ల బ్యాడ్జ్ మాత్రమే ఉంటుంది. కావాలంటే దీన్ని స్వాప్ చేసుకోవచ్చు అనే పవర్ ఇస్తాడు. దీంతో దీపక్ వద్ద ఉన్న 45 నిమిషాల బ్యాడ్జ్ తీసుకుని వన్ మినిట్ బ్యాడ్జ్ వేస్తాడు. మరి ప్రియాంకకి 45 సెకన్ల బ్యాడ్జ్ ఇస్తావా? అని అడిగితే. కాదు.. ఆమె 30 సెకన్స్ వర్త్ అని అంటాడు రోహిత్. మరి అలాంటప్పుడు 30 సెకన్స్ వర్త్ ఉన్న బ్యాడ్జ్‌తో స్వాప్ చేసుకోవచ్చు కదా అని జ్యూరీ అడుగుతుంది. వాళ్లకి వన్ మినిట్ బ్యాడ్జ్ వర్త్ కాదు కదా అని తన సమయస్పూర్తితో సమాధానం ఇస్తాడు. ఆ ఆన్సర్‌కి జ్యూరీ ఫిదా అవుతుంది.15 సెకన్స్ బ్యాడ్జ్ వచ్చిన ఐదుగురికి లీడర్ అయ్యే అవకాశం ఉంటుందని ట్విస్ట్ ఇస్తారు. భాగి, రామకృష్ణ, హేమంత్, అపూర్వ, అమన్‌లకు ఓ టాస్క్ ఇస్తారు. 70ఎంఎం దోశను ఇచ్చి.. ఎవరైతే ముందుగా ఫినిష్ చేస్తారో.. వాళ్లే ముందుగా టీంలను ఫాం చేస్తారని చెబుతారు. దీంతో దోశను ముందుగా భాగీ ఆ తర్వాత హేమంత్, ఆపై అమన్ చివరగా రామకృష్ణ, అపూర్వలు ఫినిష్ చేస్తారు. టాస్క్
పల్లవి ఇచ్చిన స్ట్రోక్‌కి పార్వతికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. దెబ్బకి వెళ్లి హాస్పిటల్ బెడ్‌పై పడుతుంది. దారుణం ఏమంటే.. హాస్పిటల్లో ఆమె దగ్గర సహాయకురాలిగా పల్లవే ఉంటుంది. ఎప్పుడెప్పుడు కళ్లు తెరుస్తుందా? ఎప్పుడెప్పుడు పీక పిసికిచంపేద్దామ్మా అన్నంత కసిగా ఎదురుచూస్తుంటుంది పల్లవి. ఇక ఈరోజు (సెప్టెంబర్ 01) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. చావు నుంచి తప్పించుకుని పార్వతి కళ్లు తెరుస్తుంది. ఎదురుగా పల్లవి ఉండేసరికి.. ఆమె గుండె గుప్పెట్లోకి వచ్చేసినంత పని అవుతుంది. ‘ఏంటి అత్తయ్యా అలా చూస్తున్నావ్.. ఇప్పుడు ఎలా ఉంది’ అని చాలా కూల్‌గా అడుగుతుంది పల్లవి. ప.. ప.. ప అని బిత్తరచూపులు చూస్తుంటుంది పార్వతి. దాంతో పల్లవి.. ‘మీకు హార్ట్ ఎటాక్ వచ్చింది నా గురించేనని నాకు అర్థమైంది.. అందుకే ఇంత టెన్షన్ పడుతున్నావ్ అని నాకు తెలుసు. నా గురించి నిజం తెలిసిన వెంటనే.. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అవనికి చెప్పేద్దాం అని అనుకున్నావ్ కదా.. మీరు అవనికి చెప్పేసి ఉంటే.. నన్ను ఫుట్‌బాల్ ఆడుకునేది. నా జీవితం రోడ్డున పడేది. మీ కొడుకు కమల్ నన్ను చంపేసి ఉండేవాడు.కాళ్లు పట్టుకోను.. పీక పట్టుకుంటా.. నేను అదృష్టవంతురాల్ని కాబట్టి అలా జరగలేదు. మీరు దురదృష్టవంతురాలు కాబట్టి హార్ట్ ఎటాక్ వచ్చింది. మీది విశాల హృదయం కాబట్టి.. ఇన్నాళ్లూ క్షమిస్తూ వచ్చారు. నేను మామయ్యని చంపాలనుకున్నది మొదలు.. చంటి బిడ్డని కిడ్నాప్ చేయించడం వరకూ.. అన్నీ మీకు తెలిసిపోయాయి కాబట్టి.. మీరు నన్ను క్షమించరని నాకు తెలుసు. క్షమించరు కాబట్టి.. మీ కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడలేను. కాబట్టి పీక పట్టుకుంటున్నా అంటూ టకీ మని పార్వతి పీకపట్టేస్తుంది పల్లవి. నా గురించి మీకు తెలిసిన నిజాలను ఎవరికీ చెప్పకుండా ఉంటే.. మీరు హ్యాపీగా ఉంటారు.. మీ ఫ్యామిలీ కూడా సేఫ్‌గా ఉంటుంది.. లేదంటే ఎవ్వర్నీ వదిలను చంపేస్తా. తేడా వచ్చిందో ఫొటోకి దండపడిపోద్ది
నేను నిన్ను ఎంతో నమ్మాను మమ్మి.. తల్లిచాటు బిడ్డలా ఉన్నా... నువ్వేం చెప్తే అది చేశా.. చివరకు నాకు ఇష్టం లేని ఇందుని పెళ్లి చేసుకోమన్నావ్.. నేను కూడా చేసుకుంటా అని అన్నా.. నీ మీద నాకు అంత నమ్మకం, ప్రేమ అని మదన్ అంటాడు. ఆ మాటలకు రేఖ కన్నీరు పెట్టుకుంటుంది. కానీ నువ్వేం చేశావ్.. నన్ను మోసం చేశావ్.. ఈ లక్కీ గాడు అంటేనే నాకు నచ్చదు.. నా రూంలో ఉంటేనే కంపరంగా ఉంటుంది.. వాడు నన్ను మాట వరసకి తమ్ముడు అంటేనే తట్టుకోలేకపోయేవాడ్ని.. కానీ ఇప్పుడు వాడే నీ కన్న కొడుకు.. నా రక్తం పంచుకుని పుట్టాడని తెలిసేలా చేశావ్.. నేనే నీ లోకం అని అనుకున్నా.. కానీ నీకు ఇంకో లోకం ఉందని తెలిసింది.. రాజు.. నువ్వంటే నాకు కోపం.. కానీ ఈ విషయాన్ని బయట పెట్టి.. నా కళ్లు తెరిపించావ్ థాంక్స్ అని అంటాడు మదన్. నువ్వు ఆవేశంలో, కోపంలో ఉన్నావ్ మదన్ అని రాజు అంటాడు. లేదు అన్నీ ఆలోచించుకునే అంటున్నా అని మదన్ అంటాడు. అల్లుడు ఎక్కడికి వెళ్తావ్ అని భ్రమరం, శేషు అడిగితే.. ఎక్కడికో వెళ్తాను.. ఇక్కడ మాత్రం ఉండలేను.. మా మమ్మీని, ఈ లక్కీ గాడ్ని చూస్తూ ఇక్కడ ఉండలేను అని మదన్ అంటాడు.నేను వాడికి మొహం చూపించలేక.. తమ్ముడు.. తమ్ముడు అని పరిగెత్తుకుంటూ వస్తుంది భ్రమరం. అల్లుడు ఇల్లు వదిలి వెళ్లిపోతోన్నాడు.. నీ కొడుకుని నువ్వు ఆపవా? అని అడుగుతుంది భ్రమరం. ఈ సమాజానికి మొహం చూపించలేక వాడు వెళ్లిపోతోన్నాడు.. నేను వాడికి మొహం చూపించలేక ఈ రూం నుంచి బయటకు రావడం లేదు.. నేను ఏం చేయాలి.. వాడు ఏం చేయాలని అనుకుంటున్నాడో.. చేయనివ్వు అని భూషణ్ కోపంతో రగిలిపోతోంటాడు. దీనికి కారణమైన ఆ రేఖను మాత్రం వదిలి పెట్టొద్దు రా.. నిన్ను, నా అల్లుడ్ని మోసం చేసిందని
జ్యోత్స్న పెళ్లి మా బాధ్యత అంటూ ముక్కు మొహం తెలియని గొట్టంగాడ్ని తీసుకొచ్చి.. ఆమె గొంతుకోసిన దీప, కార్తీక్‌లకు సరైన రీతిలో బుద్ధి చెప్పాడు సూరజ్. అసలు జ్యోత్స్నని ఇంత మోసం చేయడానికి కారణం మీరేనంటూ.. అసలు దీపా, కార్తీక్‌లు లేకపోతే ఆ ఇంట్లోకి అడుగుపెట్టేవాడ్ని కాదంటూ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు సూరజ్. ఇక తన మనవరాలి పెళ్లి పీటలపై ఆగిపోవడానికి.. సుమిత్ర హాస్పిటల్ పాలు కావడానికి కారణం దీప కార్తీక్‌లే కారణం అని వాళ్లని ఇంటి నుంచి వెళ్లగొట్టాడు శివన్నారాయణ. ఇక ఈరోజు (సెప్టెంబర్ 01) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. దీప, కార్తీక్‌లు కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటారు. సూరజ్ వెళ్తూ వెళ్తూ.. తన చేసిన తప్పుల్లో మనల్ని ఎందుకు భాగం చేశాడో అర్థం కావడం లేదు’ అని అంటుంది దీప. ‘నీకు ఇంకా అర్థం కాలేదా? సూరజ్ పక్కా ప్లాన్‌తో మనల్ని ఇరికించేశాడు. తండ్రి చావుకి పగ తీర్చుకోవడానికి సూరజ్, మాలిని, దక్షణమూర్తి ముగ్గురూ కలిసే ప్లాన్ చేశారు. సూరజ్ ముందే గ్రౌండ్ వర్క్ చేశాడు. . ముందు నాకు నా ద్వారా నీకు పరిచయం అయ్యాడు.మనమే వాడు మంచోడని సర్టిఫికేట్ ఇచ్చేశాం.. మనమే వాడి గురించి సరిగా తెలుసుకోకుండా.. సర్టిఫికేట్ ఇచ్చేశాం. డబ్బులు తీసుకోకుండా ఎవరైనా జాబ్ చేస్తారా? వాడు చేశాడు. మా నాన్న నాకు ఆరోజే చెప్పారు.. ‘ఒకడు తన సామర్థ్యాన్ని తగ్గించుకుని.. వెళ్లే అవకాశం ఉన్నా.. వెళ్లిపోకుండా ఉన్నాడంటే.. వాడ్ని ఏదో ఒక శక్తి ఆపుతుంది’ అని. ఆ శక్తి వాడి పగే. వాడే కోటేశ్వరుడైనప్పుడు వాడికెందుకు డబ్బు, జీతం. సూరజ్ విషయంలో మనం ఎప్పటికప్పుడు మోసపోతున్నాం.. మంచితనమే మనిషికి నిజమైన శత్రువు. దాన్ని అడ్డుపెట్టుకుని అందర్నీ మోసం చేసి.. మనల్ని దోషుల్ని చేశాడు. మన ఫ్యామిలీకి జరిగిన అన్యాయం చూస్తూ ఊరుకోం అని.. వాడు చాలా తెలివిగా మనల్ని మన ఫ్యామిలీకి దూరం చేశాడు.ఆ
ఫర్నీచర్ షాప్‌కి వెళ్లొచ్చు అని ప్రభావతి చెబుతుంది. దీంతో రోహిణిని తీసుకుని వమనోజ్ వెళ్తాడు. నా శపథం నెరవేర్చుకున్నా.. అత్తయ్య నోటితోనే వెళ్లమనేలా చేశా అని రోహిణి అనుకుంటుంది. నాకు ఎక్కడో తేడా కొడుతోంది మీనా అని బాలు అంటాడు. మీకు అన్నీ అనుమానాలే అని మీనా కొట్టి పారేస్తుంది. సరే గానీ నా ఫ్రాడ్ ఫ్రెండ్‌కి కలుద్దాం పదా అని బాలు అంటాడు. నేను రాను అని మీనా అంటే.. నాకు ఇంత అందమైన భార్య ఉందని తెలియాలి కదా అని బాలు అంటాడు. ఆటోకి డబ్బుల్లేక నడుచుకుంటూ వస్తాడేమో అని బాలు అనుకుంటే.. రిచ్ గా కారులోంచి దిగుతాడు ఫ్రాడ్ ఫ్రెండ్. అది చూసి బాలు షాక్ అవుతాడు. ఇదేంట్రా ఇలా దిగావ్.. అని బాలు అడిగితే.. కూటి కోసం కోటి విద్యలు కదరా అని ఫ్రాడ్ ఫ్రెండ్ అంటాడు. మొన్నే పెద్ద జైలు నుంచి రిలీజ్ అయ్యారా అని అంటాడు ఫ్రాడ్ ఫ్రెండ్ రాజు. ఎందుకు రా.. దొంగతనాలు సరిగ్గా చేయడం లేదా? ఇంకా దొరికిపోతున్నావా? అని ఇద్దరూ దొంగల కష్టాలు, బాధల్ని మాట్లాడుకుంటూ ఉంటారు. మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే గజ దొంగలు చాలా ఏళ్ల తర్వాత కలుసుకుని మాట్లాడినట్టు ఉందని తిడుతుంది మీనా.ఫర్నీచర్ షాప్‌కి రిచ్ మెన్లా.. అసలు ఏ పని మీద వెళ్తున్నావ్ రా అని బాలు అడుగతాడు. ఓ లేడి కిలాడి ఉందిరా.. ప్రభావతి అనే ఫర్నిచర్ షాప్‌కి వెళ్లి రిచ్ మ్యాన్‌లా నటించాలి.. అందుకు ఆ షాప్ ఓనర్ రోహిణి నాకు ఐదు వేలు ఇస్తుంది.. అసలే సాయంత్రం నా గర్ల్ ఫ్రెండ్‌తో సినిమాకి వెళ్లాలి.. ఆ డబ్బులు కూడా కావాలి.. కదా.. అందుకే నటించేందుకు వెళ్తున్నా అని అంటాడు. సర వెళ్లు.. నీ వల్ల మా నోటికి, మా ఇంట్లో వాళ్ల చేతికి కూడా పని దొరికింది అని బాలు అంటాడు
మీ అక్క బతికి ఉన్నన్నిరోజులు నన్ను బాగా చూసుకుంది.. అయినా మీ అక్కని చంపినందుకు ఈ నారాయణ జైలు శిక్ష అనుభవించి వచ్చాడు కదా.. అయినా నీకు మీ అక్క పిల్లలు అంటే ప్రేమ లేదా? అని తాయారు అంటుంది. ఇప్పుడు ఈ చంపుకోవడం లాంటివి వద్దు అని అంటుంది. మామయ్య.. మేం చిన్నప్పటి నుంచి ఏ దిక్కు లేకుండా బతికాం. మా అందరినీ చూసి పై నుంచి అమ్మ ఆత్మ ఎంత బాధ పడి ఉంటుందో అని పెద్ది అంటాడు. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ కూడా లేదు.. ఇప్పుడు నాన్నకి దూరం చేస్తారా? అని మహా అడుగుతుంది. వీడు నాకు ప్రాణ భిక్ష పెట్టడం ఏంటి.. అని నారాయణ పైపైకి వెళ్తుంటాడు. మా అక్క చూసి మిమ్మల్ని.. మీ మొహం చూసి ఈ నారాయణను ఇప్పుడు వదిలేస్తున్నా.. ఈ పగ మాత్రం చల్లారలేదు.. నీ చావంటూ ఉంటే.. అది నా చేతుల్లోనే అని దుర్గ ప్రసాద్ అంటాడు. దీంతో నారాయణ గొడవకు వెళ్తుంటాడు. అందరూ కలిసి నారాయణను బయటకు తీసుకు వస్తారు. కారులో అందరూ హైదరాబాద్‌కు రిటర్న్ అవుతారు.కేరింగ్‌గా చూసుకున్న మహా.. కారులో కూర్చున్న నారాయణని కన్నా టచ్ చేస్తాడు. అబ్బ.. దెబ్బలు బాగా తగిలాయ్ రా అని అంటాడు. నీకు ఎలా ఉంది రా అన్ని కేశవ అడిగితే.. ఇవన్నీ నాకు అలవాటు అయ్యాయ్ కదరా అని చక్రి అంటాడు. ఇక దారిలో మెడికల్ షాప్ చూసి కారు ఆపండి అని మహా అంటుంది. చక్రి చేతిని పట్టుకుని ఆయింట్ మెంట్ రాస్తుంది. అమ్మ అని చక్రి అరుస్తుంటే.. మీరేమైనా చిన్న పిల్లాడిని అనుకుంటున్నారా? అని మహా అంటుంది. షర్ట్ బటన్స్ విప్పండి.. బ్యాక్ సైడ్, షోల్డర్ మీద రాస్తాను అని మహా అంటుంది. నాకు సిగ్గు అండి అంటూ మెలికలు తిరుగుతుంటాడు చక్రి.మళ్లీ వద్దాం.. వాళ్లని తిడదాం, కొడదాం
వామ్మో.. ఇంటింటి రామాయణం సీరియల్లో ప్రేమ మామూలుగా పొంగటం లేదు. అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా ఉంటే ప్రేమని తెగ పొంగిచేస్తారు.. లేదంటే పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. పల్లవి మారిన తరువాత ఆమెపై తెగ ప్రేమ కురిపించేస్తున్నారు. అవని, మీనాక్షి, పార్వతి, శ్రియ, భానుమతి, చక్రధర్.. వీళ్లంతా ప్రేమ కురిపించడంలో తెగ పోటీపడుతున్నారు. అయితే చూసి చూసి పల్లవి అందర్నీ మడతపెట్టేసే రోజు దగ్గర్లోనే కనిపిస్తుంది కానీ.. ఈరోజు (ఆగస్టు 21) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. శ్రియ, మీనాక్షిలు తెగ ప్రేమ కురిపించుకుంటారు. ఒకర్నొకరు పట్టుకుని తెగ ఎమోషనల్ అయిపోతారు. సొంత అనుకోవడానికి రక్త సంబంధాలే ఉండాల్సిన అవసరం లేదు శ్రియ.. ప్రేమ పంచితే మామూలు సంబంధాలే అనుబంధాలు బలపడతాయి అంటూ శ్రియని పట్టుకుని తెగ ఏడ్చేస్తుంది మీనాక్షి.ఇక ఊ అంటే చాలు పార్వతి.. అవని భజన చేస్తూ ఉంటుంది కదా.. అది చూసీ చూసి భానుమతి ఒళ్లు మండింది. ‘ఈ ఇంట్లో అవని ఒక్కతే మనిషా.. మిగిలిన వాళ్లెవ్వరూ మనుషులు కాదా? ఊ అంటే చాలు అన్నింటికీ అవనే అంటావ్ ఏంటీ’ అంటూ దులిపేస్తుంది భానుమతి. ఆ తరువాత పల్లవి.. ఏదో బిజినెస్ చేయాలని అనుకుంటుంది కదా.. ఏం చేస్తుందో అడగొచ్చు కదా అని అంటుంది భానుమతి. అంతా అవని చూసుకుంటుంది అని పార్వతి అనడంతో.. ఇంకా మండిపోతుంది భానుమతికి. ఇంతలో పల్లవికి కాఫీ తీసుకుని వచ్చి ఇస్తుంది మీనాక్షి. ఇది కాఫీలా లేదు.. అమ్మ ప్రేమలా చాలా బావుంది అని తెగ పొగిడేస్తుంది పల్లవి. వీళ్లిద్దరి మధ్య నాటకీయం మామూలుగా లేదు. ఆపండి తల్లో చూడలేక చేస్తున్నాం అనేట్టుగానే ఉంది.మరో వైపు జైల్లో ఉన్న అశ్విన్ పగతో రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో కొత్త ఎస్ఐ వచ్చి.. అశ్విన్‌ని అవమానిస్తూ మాట్లాడతాడు. ‘ఆడదాని మాటల్ని నమ్మి నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు.. ఆ పల్లవికి నాకు మధ్య అసలు స్టోరీ ఏంటనేది
అంతా నువ్వే చేసి ఇప్పుడు ఏం చేయనట్టు, తెలీనట్టు అడుగుతున్నావ్ అని శైలు ఆట పట్టిస్తుంది. అసలు ఇదెలా జరిగింది? అని కేశవ అంటే.. అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? మా వాళ్లు ముందే చెప్పార్రా నీ గురించి.. నిన్ను నమ్మొద్దు, నాకు సంబంధం లేదు అని మధ్యలోనే వదిలేస్తాడు అని.. కానీ నేనే నా కేశవ అలాంటి వాడు కాదని అన్నాను.. కానీ నువ్వేం చేశావ్.. వాళ్లే రైట్ అని నిరూపించావ్ అని కోపంగా ఉన్నట్టు ఫోన్ కట్ చేస్తుంది. దీంతో కేశవ అయోమయంలో పడిపోతాడు. ఇంతలో చక్రి వచ్చి కాబోయే తండ్రి అని ఆట పట్టిస్తుంది. అలా ఎలా.. ఇలా ఎలా.. ఇదంతా కల అంటూ నేనేం చేయలేదురా అని అంటాడు కేశవ. నువ్వేం చేయకపోతే పై నుంచి ఎవరైనా వచ్చి మంత్రం వేశార్రా.. ఊరుకోరా.. ఏం కాదు.. మనం వెళ్లిన తర్వాత మాట్లాడి పెళ్లి చేద్దాం.. ఇక మీ అత్త, మీ బామ్మర్ది గాడు కూడా ఏం చేయలేడు.. అని అంటాడు చక్రి. మరి మాట అని కేశవ అంటే.. ఇంకేం మాటలు రా.. వరాల మూట పుడుతుంటే అని చక్రి అంటాడు.నీకు నరకం చూపిస్తా.. కొడుతుంటే బాధగా ఉందా, నొప్పిగా ఉందా?.. నువ్వు మా అక్కని చంపేటప్పుడు కూడా మా అక్క ఇలానే బాధ పడి ఉంటుంది కదా.. ఇప్పుడు నీకు నరకం చూపిస్తా.. పైకి వెళ్లాక మా అక్క ఏ శిక్ష వేస్తుందో.. తన ఇష్టం.. నేను మాత్రం ఇక్కడ నీకు మరణ శిక్ష వేస్తాను.. నీకు ఎంత ధైర్యం ఉంటే.. మళ్లీ పాతికేళ్ల తర్వాత నా ఊరికి వస్తావ్.. నిన్ను వదిలి పెడతాను అని ఎలా అనుకున్నావ్ రా.. వీడ్ని కొట్టండి.. నరకం అంటే ఏంటో చూపించిండి అని దుర్గా ప్రసాద్ ఆగ్రహిస్తాడు.నా కొడుకులు వస్తే.. ఇలా కట్టేసి కొడుతున్నారు.. మీరు మగాళ్లేనారా.. ఒకసారి కట్లు
బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్‌లోని ఆరో ఎపిసోడ్లో డేర్ ఆర్ డై అని టాస్కుల్ని పెట్టారు. ఈ టాస్కుల్లో గెలిచిన వారిని టాప్ 15లోకి పంపించారు. అలా నేటి ఎపిసోడ్ ద్వారా నలుగురు కంటెస్టెంట్లు తమ బెర్తుల్ని కన్పామ్ చేసుకున్నారు. అలా నేటి ఎపిసోడ్ ముగిసే సరికి టాప్ 15లోకి ఏడు మంది కంటెస్టెంట్లు ఉన్నారు. హోల్డ్‌లో ఉన్న 14 మంది నుంచి ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక రేపటి ఎపిసోడ్లో 13 మంది నుంచి టాప్ 15కి ఇంకో 8 మంది కంటస్టెంట్లను సెలెక్ట్ చేస్తారన్న మాట. మరి నేటి ఎపిసోడ్ ఎలా సాగిందో ఓ సారి చూద్దాం.షాలిని, అమన్ ఇద్దరూ కూడా మొదటి టాస్క్‌లో పోటీ పడ్డారు. కుళ్లిన కూరగాయలు అంటూ పెట్టిన ఈ టాస్కులో షాలిని చాలా స్పీడుగా దూసుకుపోయింది. ఈ చివరకు ఈ టాస్కులో షాలిని గెలిచి టాప్ 15లో స్థానం సంపాదించుకుంది. రెండో టాస్కు ప్రారంభం కంటే ముందు బ్రేకప్ స్టోరీలను చెప్పమని అన్నారు. అలా దీపక్, రోహిత్, గాయత్రి ఇలా కొంత మంది తమ తమ బ్రేకప్ స్టోరీలను చెప్పారు. రెండో టాస్కుగా ఎక్స్‌కి ఫోన్ చేసి మళ్లీ జీవితంలో కలవాలి.. ఐ లవ్యూ చెప్పాలి.. సారీ అని అడగాలి అనే టాస్క్ ఇచ్చారు.ఈ రెండో టాస్క్ కోసం చాలా మంది ముందుకు వచ్చారు. గంటను ముందు పట్టుకున్న వారే టాస్క్ ఆడాల్సి ఉంటుందని ఓ ట్విస్ట్ పెట్టారు. కానీ దీపక్, రోహిత్, గాయత్రి ఇలా అందరూ గంటను పట్టుకుని గెలుస్తారు. కానీ వారి ఫోన్లను అవతలి వ్యక్తులు లిఫ్ట్ చేయరు. దీంతో చివరకు శ్రష్టికి ఈ ఛాన్స్ వస్తుంది. తన మాజీ లవర్‌కి ఫోన్ చేసి తప్పైందని, సారీ అని, ఐ లవ్యూ అని, నువ్వు లేకపోతే నేను లేను అని మాట్లాడుతుంది. అవతలి వ్యక్తి సరే అని సైలెంట్‌గా ఉండిపోతాడు
నీ భార్య నీ పక్కన లేకపోతే నువ్వు జీరో.. మీ ఆవిడను ఈ షాప్‌లో మళ్లీ పెట్టు.. అని మణికంఠ చెబుతుంటాడు. ఇలా చెప్పడానికి మా ఆవిడ నీకు ఎంత ఇచ్చింది.. అని మనోజ్ అంటాడు. నేను అమ్ముడు పోను అని మణికంఠ అంటాడు. అదే టైంలో రోహిణి వస్తుంటుంది. చూశావా.. మాటల్లోనే వస్తోంది.. నూరేళ్లు ఉంటుంది అని మణికంఠ అంటే.. ఇంకెంత మందిని మోసం చేయడానికి అని మనోజ్ అంటాడు. ఆ మాటలు రోహిణి వింటుంది. మా ఆవిడ ఓ స్టూల్ తీసుకు రమ్మంది.. కొంటాను.. అని అంటాడు. చూశావా ఇప్పటి వరకు నేను ఫ్రెండ్‌గా ఉన్నా.. మీ ఆవిడ రాగానే నేను కస్టమర్‌ను అయ్యా అంటాడు మణికంఠ. కానీ రోహిణి పిలుస్తుంటే మనోజ్ పట్టించుకోడు. ఇంతలో ఓ కస్టమర్ వచ్చి.. భారీ ఆర్డర్ ఇస్తాడు. కాకపోతే అది మలేషియాకి పార్శిల్ చేయాలని అంటాడు. మలేషియా తప్పా ప్రపంచంలో ఎక్కడికైనా డెలివరీ చేస్తా అంటాడు మనోజ్. ఏం నీకు తిక్కనా.. ఇంత పెద్ద ఆర్డర్ వద్దంటున్నావ్ అని అంటాడు. తిక్క లేదు.. ఫ్రాడ్ వైఫ్ ఉందని ఆ కస్టమర్‌ని పంపిస్తాడు మనోజ్.బాలుకే ముందు తెలుస్తుంది.. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు.. ఇక్కడికి వచ్చావ్ అని అమ్మకి తెలిస్తే.. నిన్ను కొట్టినట్టే నన్ను కూడా కొడుతుంది.. అని మనోజ్ అంటాడు. నేను వచ్చాను అన్న విషయం ఎవరు చెప్తారు.. ఎవరికి తెలుస్తుంది.. అని రోహిణి అంటుంది. ఆ బాలు గాడికి తెలుస్తుంది.. మనం ఏం మింగినా, నువ్వేం మోసం చేసినా ముందు వాడికే కదా తెలుస్తుంది అని అంటాడు మనోజ్. నా మీద ఇష్టం లేక ఇలా అంటున్నావా? మీ అమ్మకి భయపడి అంటున్నావా? అని రోహిణి అడుగుతుంది. ఇలాంటి లాజిక్స్ అడగకు అని అంటాడు మనోజ్.ఇలా దూరం పెట్టకు.. నేను ఇలా ఎందుకు చేశానో అర్థం చేసుకో మనోజ్.. నీ కోసమే కదా

సామాన్యులను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించేందుకు నిర్వహిస్తున్న 'అగ్నిపరీక్ష' కార్యక్రమంలో అతిగా జరుగుతోంది. బిగ్ బాస్‌లోకి వెళ్లడం ఏమో గానీ, అంతకంటే ముందే అగ్నిపరీక్ష షోలోనే కంటెస్టెంట్లకు అసలైన టార్చర్ చూపిస్తున్నారు. సెలబ్రిటీలు నేరుగా బిగ్ బాస్‌లోకి వచ్చి తమను తాము నిరూపించుకోవడానికి టాస్క్‌లు ఆడతారు. కానీ సామాన్యులు మాత్రం అంతకంటే కఠినమైన టాస్క్‌లను ఇక్కడే ఎదుర్కోవాల్సి వస్తోంది.అగ్నిపరీక్ష సీజన్ 2లో సెకండ్ రౌండ్ ప్రారంభమైంది. 18 మంది కంటెండర్లను కంటెస్టెంట్లుగా మార్చడానికే ఇంత టార్చర్ చూపిస్తే, ఇక హౌస్ లోపల ట్రోఫీ కోసం వీరు ఇంకెంత పెద్ద యుద్ధం చేయాలో! మొత్తానికి అగ్నిపరీక్ష 2లో రెండో రౌండ్ ఒక చెత్త టాస్క్‌తో మొదలైంది. వారం రోజులు కుళ్లబెట్టిన చెత్త కంపును భరిస్తూ.. లాక్ ఓపెన్ చేసే కీ కోసం వెతకాలి. లాక్ తెరిచిన తర్వాత అందులో ఉన్న జ్యూస్‌ను పూర్తిగా తాగితేనే ఆ టాస్క్ పూర్తవుతుంది. ఈ టాస్క్ చేయడానికి చాలామంది ముందుకు వచ్చినప్పటికీ, ఆఖరిగా అమన్, షాలినీ పోటీ పడ్డారు. ఇద్దరూ తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ, చాలా చిన్న తేడాతో షాలినీ గెలిచి కంటెస్టెంట్‌గా మారింది. అమన్ చేసిన ప్రయత్నానికి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇక రెండో రౌండ్లో రెండో టాస్క్.. బ్రేకప్ లవ్ స్టోరీ. ముందుగా లవ్ స్టోరీస్ గురించి యాంకర్ శ్రీముఖి అడగ్గా ఎవరూ స్పందించలేదు. కానీ బ్రేకప్ లవ్ స్టోరీస్ గురించి అడిగినప్పుడు మాత్రం అందరూ స్పందించారు. తమ ఎక్స్ లవర్‌కి ఫోన్ చేసి, మళ్లీ వారిని ప్రేమలోకి దింపిన వారిని 'డేరింగ్ పర్సన్'గా గుర్తించి కంటెస్టెంట్‌గా ప్రమోషన్ ఇస్తారు. ఈ టాస్క్ కోసం నలుగురు సిద్ధమవ్వగా, శివ సృష్టికి ఆ అవకాశం దక్కింది. ఆమె తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌కి ఫోన్ చేయగా అతను తీవ్రంగా షాక్ అయ్యాడు. చివరికి అనుకున్న టాస్క్‌ను పూర్తి చేసి శివ సృష్టి కంటెస్టెంట్ల లిస్ట్‌లోకి చేరిపోయింది. అగ్నిపరీక్షలో
నా పెంపకంలో తప్పు ఉందా? నేను తప్పు చేశానా? అని శేఖరం అడుగుతాడు. లేదు నాన్నా అని శైలు అంటుంది. మరి ఇంత పెద్ద తప్పు ఎందుకు చేశావ్.. పెళ్లికి ముందే ఇలాంటి తప్పు చేశావ్ అని అందరికీ తెలిస్తే మన పరువు ఏం అవుతుంది.. నీకు కావాల్సినంత స్వేచ్చ ఇచ్చాను.. అమ్మాయిలు చదువుకోవాలి అని.. నిన్ను కాలేజీకి పంపిస్తే కడుపు చేసుకుని వస్తావా? అని శేఖరం అడుగుతాడు. నాన్నా.. అని శైలు అంటుంది. అవునమ్మా.. నాన్ననే.. నాన్ననే అంటున్నాను.. చెప్పమ్మా అని అంటాడు శేఖరం. ఎందుకే మా పరువుతీశావ్.. మీ నాన్న నీ గురించి ఎంతో గొప్పగా చెబుతూ తలెత్తుకుని తిరిగేవాడు.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని బయటకు వెళ్లమంటావే.. పరువు తీశావ్ కదే అని చితక్కొడుతుంది వరాలు. ఇది అబద్దమే కదా.. అని వరాలు అంటే.. ఇది అబద్దమే, నేను ఏ తప్పు చేయలేదు.. కానీ ఈ విషయం ఇప్పుడు మీకు చెప్తే మీరు మళ్లీ పెళ్లి అంటారు.. కేశవ వచ్చాకే ఈ నిజం చెప్పాలి అని శైలు తన లోలోపల అనుకుంటుంది. ఇంతలో కేశవకి సురేష్ గాడు ఫోన్ చేసి.. మా చెల్లికి కడుపు చేస్తావా? ఇక్కడకు రారా నిన్ను నరికేస్తా అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు. కడుపు ఏంట్రా అని కేశవ అడిగే లోపు కట్ చేసేస్తాడు.పోలీసు కేసు పెడతా మాధవకి ఫోన్ చేస్తుంది వరాలు. ఎవరు అని మాధవ అడుగుతాడు. నేను శైలు మహామ్మారిని కన్నా అమ్మని,.. అమ్మమ్మని అవుతున్నాను అని గర్వంగా చెప్పుకోవాలా? పెళ్లికి ముందే ఇలా చేసిందని చెప్పుకోవాలా? ఇదంతా మీ తమ్ముడి పుణ్యమే అని చెప్పుకోవాలా? అని ఏడ్చేస్తుంటుంది. మా తమ్ముడు అలాంటివాడు కాదండి అని మాధవ అంటాడు. మా కూతురు అంత పెద్ద నోరు వేసుకుని, అందరికీ వినిపించేలా చెబుతోంది.. దానికి మాయ మాటలు చెప్పి మోసం చేశాడు.. మీ
పల్లవి మారింది అనుకునే లూపే ఆమెలో విషం నింపుతూ ఉంది భానుమతి. ఈరోజు (ఆగస్టు 19) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. అవని ఆఫీస్‌కి వెళ్తానంటోంది.. శ్రియ కూడా జాబ్ చేస్తుంది. నువ్వు మాత్రం ఇంట్లో వంటింటి కుందేలులా ఉంటున్నావ్. నీకెలా ఉందో కానీ.. నాకు మాత్రం సిగ్గుగా ఉంది.. నువ్వూ చదువుకున్నావ్ కదా.. నీ చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలని లేదా? బాగా ఆలోచించుకో’ అంటూ పల్లవికి ఎక్కిస్తుంటుంది భానుమతి. అయితే భానుమతి మాటల్ని మీనాక్షి వినేస్తుంది. పల్లవి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇక మీనాక్షి.. అవనిని తీసుకుని వెళ్లి చక్రధర్‌ని కలుస్తుంది. కుశల ప్రశ్నల తరువాత అసలు మ్యాటర్‌కి వస్తుంది మీనాక్షి. ‘మీతో పల్లవి గురించి మాట్లాడాలి.. పల్లవి మారిందంటే మీరు చాలా సంతోషపడ్డారు. మీకంటే, అవనికంటే కూడా నేను ఎక్కువ సంతోషపడ్డాను. కానీ మనం సంతోషపడటం వల్ల పల్లవికి ఏ ఉపయోగం లేదు. మనందరం కోరుకున్నట్టుగానే పల్లవి మారింది.. కానీ మంచిగా మారిన పల్లవి మాత్రం సంతోషంగా లేదండీ’ అని అంటుంది మీనాక్షి.పల్లవి సంతోషంగా లేకపోవడం ఏంటి? అని చక్రధర్ అడిగితే.. తను మారింది కానీ తలెత్తుకుని బతకలేకపోతుంది అని అంటుంది మీనాక్షి. తను ఎవరికీ తక్కువ కాదు అనేట్టుగా పల్లవి ఉండాలి.. అప్పుడే కదా తనకి నిజమైన సంతోషం అని అంటుంది మీనాక్షి. దాంతో అవని.. ‘నిజమేనమ్మా.. నువ్వు చెప్పిందీ.. పల్లవి సంతోషం కోసం నేను కానీ నాన్న కానీ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం’ అని అంటుంది. చెప్పు అవనీ.. పల్లవికి డబ్బు అవసరమా? ఎంతైనా ఇస్తాను అని అంటాడు చక్రధర్. ‘మీరు ఇచ్చే ఆమె అవసరాన్ని తీర్చుతుందేమో కానీ.. గుర్తింపుని తీసుకుని రాదు’ అని అంటుంది మీనాక్షి. మరి ఏం చేయాలి? అని చక్రధర్, అవనిలు అడగడంతో.. ‘పల్లవి అంత పెద్ద చదువులు చదువుకుని ఇంట్లో ఖాళీగా ఉంటుంది.. అవని, శ్రీయలు
బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్‌లోని ఐదో ఎపిసోడ్లో హోల్డ్‌లో ఉన్న కొంత మంది కంటెస్టెంట్లకు అన్యాయం జరిగినట్టు అనిపిస్తుంది. 70 మంది ఆడిషన్స్ పూర్తయింది. ఇందులో ముగ్గురు కంటెస్టెంట్లు మాత్రమే టాప్ 15 బెర్త్‌ని కన్ఫామ్ చేసుకున్నారు. ఆపై 26 మందిని హోల్డ్‌లో పెట్టారు. అయితే ఇందులో రెండు గ్రీన్స్, ఒక గ్రీన్ వచ్చిన వారు కూడా ఉన్నారు. హోల్డ్‌లో ఉన్న వారి సంఖ్య ఎక్కువ అయింది అగ్ని పరీక్ష టీం తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. జడ్జ్‌లు, హోస్ట్‌లు కలిసి కొంత మంది కంటెస్టెంట్లను హోల్డ్ నుంచి డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేసేశారు. అసలు నేటి ఎపిసోడ్ ఎలా సాగిందో చూద్దాం.జ్యోష్న రెడ్డి అంటూ కర్నూలుకి చెందిన అమ్మాయి జోష్‌గా ఎంట్రీ ఇచ్చింది. సరదా సరదాగా మాట్లాడుతూనే నాన్న లేడన్న విషయాన్ని చెప్పింది. దీంతో అందరూ ఎమోషనల్ అయ్యారు. బైక్స్ అంటే ఇష్టం, ఫ్రీగా తిరగడం అంటే ఇష్టమని చెబుతుంది. అలా ఫ్రీగా తిరిగే దానికి బిగ్ బాస్ ఇంటికి ఎందుకు అని అడుగుతారు. మా నాన్నకి బిగ్ బాస్ అంటే ఎక్కువ ఇష్టం.. ఈ రోజు ఇలా ఈ స్టేజ్ మీద ఉంటే.. ఆయన పైనుంచి సంతోషిస్తుంటాడు.. నేను బిగ్ బాస్ వెళ్లినట్టు.. మా నాన్న నేను ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉండే వాళ్లం.. నాకు మా నాన్నతో బాండింగ్ ఎక్కువగా.. ఇంట్లో ఎవ్వరూ లేకపోతే.. తాగుతావా అని అడిగి మరీ బీర్ తీసుకు వచ్చి ఇచ్చాడు అంటూ ఇలా తన గురించి చెబుతుంటుంది జోష్న.బైక్ అమ్మే టాస్క్‌ని జోష్నకి ఇస్తారు. అలా కాసేపు నవ్వించే ప్రయత్నం చేస్తుంది.. ఏదో సరదాగా ఉంది.. మ్యాటర్ అయితే అర్థం కాలేదు.. నేను గ్రీన్ ఇస్తా అని నవదీప్.. జోష్ న.. జోష్ ఉంది.. కానీ అదేంటో చూడాలి.. కానీ ఇంకా కాన్ఫిడెంట్ కావాలి.. అని గ్రీన్ ఇస్తాడు అభిజిత్.. మా నాన్న వాయిస్ మర్చిపోతోన్నా
నేను కూడా ఈ ఇంటి వారసురాలినే నాకు డబ్బులు ఇవ్వు అని ఇందుని ఐశ్వర్య అడుగుతుంది. నువ్వు అసలు అని అపర్ణ ఏదో అనబోతంటే ఇందు ఆపుతుంది. డబ్బులు లేవు.. ఆల్రెడీ లెక్కలు చెప్పాను.. కదా.. తాతయ్య ఆపరేషన్ కోసం మాత్రమే డబ్బుంది అని ఇందు అంటుంది. ఆ డబ్బులే ఇవ్వు.. ఇప్పుడు ఆ ముసలోడికి ఆపరేషన్ అవసరమా? చచ్చే వరకు అలానే చెయిర్లో ఉంటాడు.. లేచి పొడిచేది ఏముంది అని ఐశ్వర్య అంటుంది. ఆ మాటలకు ఇందుకి అగ్ని పర్వతం బద్దలైనట్టుగా కోపం వస్తుంది. ఐశ్వర్యను లాగి పెట్టి కొడుతుంది. ఆ సౌండ్‌కే భ్రమరం భయపడిపోతుంది. ఏం అన్నావ్.. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకోను.. నన్ను ఎన్ని అన్నా నేను భరిస్తాను కానీ.. తాతయ్య, నానమ్మని అంటే మాత్రం అసలు ఊరుకోను.. వాళ్లని ముసలివాళ్లు అని అంటావా? ఇంకో ముప్పై ఏళ్లు అయితే నువ్వు కూడా అలానే అవుతావ్ కదా అని తిడుతుంది ఇందు. ముసలివాళ్లు అని అంటున్న వాళ్లే ఒకప్పుడు ఈ దుగ్గిరాల వంశాన్ని నిలబెట్టారు.. వాళ్లే మనకు గతాన్ని ఇచ్చారు.. మన భవిష్యత్తుని తీర్చి దిద్దుతారు.. సీతారామయ్య తాత ఇచ్చిన వారసత్వాన్ని వీళ్లే కొనసాగించారుఐశ్వర్యకు చీవాట్లు.. వాళ్లంటూ ఉన్నారు కాబట్టే.. మనం పుట్టుకతోనే ఓ ఐడెంటెటీతో వచ్చాం.. నీలాగా వాళ్లు కూడా తాగుడు, తిరుగుడు, పబ్స్ అంటూ వెళ్తే మనం ఉండే వాళ్లమే కాదు, ఇంకోసారి వాళ్ల జోలికి వస్తే మాత్రం ఊరుకోను అని తిట్టేసి వెళ్తుంది ఇందు. నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు.. నరం లేని నాలుక ఇలా అనవసరంగా వాగితే ఇలానే ఉంటుంది.. అందుకే నోరు అదుపులో పెట్టుకో అనేది అని నందు కూడా తిడుతుంది. దీంతో ఐశ్వర్యకి ఒళ్లు మండిపోతూ ఉంటుంది. ఇంకో వైపు శేషు పగలబడి నవ్వేస్తుంటాడు.రెచ్చగొట్టిన రేఖ.. ఇలా ఇందు కొడుతుందని నీకు ముందే తెలుసు కదా అమ్మా
రోహిణి దగ్గర ఏటీఎం లాక్కోవడం తప్పు అని ఇంట్లో బాలు, మీనా, శ్రుతి, రవి అంతా అనుకుంటారు. ఇక ఇదే విషయాన్ని మనోజ్‌కి అర్థమయ్యేలా చెబుదాం అని డాబా మీదకు పిలుస్తారు. మీరు నాకు, అమ్మకి దూరం పెంచాలని చూస్తున్నారా? మీరు ఇలా నన్ను రెచ్చగొడితే.. నేను వెళ్లి అమ్మతో గొడవ పడాలా?.. అయినా అది వాళ్ల సమస్య.. వాళ్లు చూసుకుంటారు.. అమ్మ ఏం చేసినా రైటే.. దాని వెనక ఓ కారణం ఉంటుంది.. ఆ కారణం తెలుసుకునే స్థాయికి మీరు ఎదగలేదు.. మీకు అంత బుద్ది రాలేదు అని మనోజ్ అంటాడు. నీకు బుద్ది చెప్పాలని పిలిస్తే.. మాకే బుద్ది లేదని అంటావా? చదువుకున్న మూర్ఖుడివిరా నువ్వు.. నీకు, అమ్మకి దూరం పెంచాలనే ఉద్దేశం లేదు.. కానీ నువ్వు మాత్రం ఎక్కడి దాకో వెళ్లి ఆలోచిస్తున్నావ్.. నువ్వు నా కళ్ల ముందు ఉండొద్దురా వెళ్లిపో అని అంటాడు బాలు. కానీ మనోజ్ వెళ్లడు. దీంతో అక్కడే ఉన్న టైర్‌ని తీసుకుని మనోజ్ నెత్తి మీద వేయాలని బాలు చూస్తాడు. దీంతో కంగారు పడి కిందకు పారిపోతాడు మనోజ్. దీంతో అందరూ నవ్వుకుంటారు.అమ్మ కళ్లు తెరిపించే ఐడియా ఈ మూర్ఖుడ్ని మార్చలేం అని మనకు తెలిసిందే కదా అని బాలు అనుకుంటారు. వదిలేయండి అని మీనా అంటే.. వదిలేయ లేను.. అన్నదమ్ముల బంధం అని ఉంది కదా అని బాలు అంటాడు. మీరిద్దరి థాట్స్ ఒకేలా ఉంటాయి.. ఒకరి మాట ఇంకొకరు వింటారు కదా.. మరి మనోజ్ ఎందుకు అలా ఉన్నాడు.. మనోజ్‌ని ఎక్కడి నుంచైనా దత్తత తెచ్చుకున్నారా? అని శ్రుతి కామెడీ చేస్తుంది. మాకు చిన్నప్పటి నుంచి బామ్మ మాట బంగారు మూట.. వాడికి అమ్మ మాట వజ్రాల మూట అని రవి అంటాడు. అమ్మ కళ్లు తెరిపించే ఐడియా వచ్చిందని బాలు అంటాడు.ఏటీఎం కార్డ్ తీసుకుంది ఉదయాన్నే బాలు పంచాయితీ పెడతాడు

Sudigali Sudheer Remuneration: కమెడియన్‌గా బుల్లితెరపై అడుగుపెట్టి.. యాంకర్‌గా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ ప్రస్తుతం వరుస షోలు, సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన యాంకరింగ్‌కు ఉన్న క్రేజ్‌తో పాటు రెమ్యూనరేషన్పై కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గతంలో వచ్చిన మీడియా నివేదికల ప్రకారం సుధీర్ ఒక్కో ఎపిసోడ్‌కు సుమారు రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు అంచనాలు ఉన్నాయి. అయితే ఇవి అధికారికంగా ధృవీకరించిన ప్రస్తుత రెమ్యూనరేషన్ గణాంకాలు కావు. తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. కామెడీతో కెరీర్ ప్రారంభించిన ఆయన యాంకరింగ్, డ్యాన్స్, నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోనూ హీరోగా కనిపించిన సుధీర్.. ప్రస్తుతం టెలివిజన్ కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఒకప్పుడు తెలుగు టెలివిజన్‌లో మేల్ యాంకర్ అంటే ప్రదీప్ మాచిరాజు పేరు ఎక్కువగా వినిపించేది. టీవీ షోలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు, సినిమా ఈవెంట్లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ ప్రదీప్ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇప్పుడు సుధీర్ కూడా తనదైన శైలిలో హోస్టింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయన కామెడీ టైమింగ్, ఎనర్జీ, సెలబ్రిటీలతో ఇంటరాక్షన్ షోలకు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి. సుధీర్ తన కెరీర్‌ను కామెడీ ఆర్టిస్ట్‌గా ప్రారంభించారు. జబర్దస్త్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన ఆయనకు కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో నటుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. గాలోడు చిత్రంతో హీరోగా కమర్షియల్ విజయాన్ని అందుకున్నప్పటికీ, ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అనంతరం సుధీర్ టెలివిజన్‌పై మళ్లీ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ది ఫ్యామిలీ స్టార్స్ వంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతో పాటు ఇతర టీవీ ప్రోగ్రామ్‌లకు కూడా హోస్ట్‌గా కనిపిస్తున్నారు
సైకిల్‌పై చక్రి, మహా వెళ్తుంటారు. ఊరి అందాలను చూస్తూ.. ఎంత బాగుందో కదా అని చక్రి, మహా అనుకుంటారు. నాకు వదిలి వెళ్లబుద్ది అవ్వడం లేదు అని మహా.. నాకు అయితే ఇక్కడే ఉండిపోవాలని ఉందంటూ చక్రి.. మళ్లీ ఇల్లు ఎవరు ఇస్తారో అని మహా.. ఖాళీగా ఉంటాయి.. అని చక్రి.. నీ కోసమా? అని మహా.. లేదు వాళ్ల కోసమే.. అందరూ సిటీలోనే జాబ్ చేస్తుంటారు.. మనలా పండుగలకో, జాతరకో వస్తుంటారు కదా అని చక్రి అంటాడు. ఇక్కడే ఓ ఇల్లు ఉంటే ఎంత బాగుండు అని మహా.. అవును అని చక్రి.. మామిడి చెట్టు ఉంటే బాగుంటుంది అని మహా.. జామ చెట్టు ఉంటే ఇంకా బాగుంటుంది అని చక్రి.. ఇలా ఇంటి గురించి మాట్లాడుతూ ఉంటారు. తులసి చెట్టు ఉండాలి.. ఉదయాన్నే మీరు నెత్తికి టవల్ చుట్టుకుని పూజ చేస్తూ ఆ తులసి కోట చుట్టూ తిరగాలి.. అని చక్రి అంటే.. మీరు దేని చుట్టూ తిరుగుతారు అని మహా అడుగుతుంది. నేను కారు చుట్టూ తిరుగుతూ, కారుని క్లీన్ చేస్తూ ఉంటాను అని అంటాడు చక్రి.సైకిల్‌పై సవారి.. మండువాలాంటి ఇల్లు అయితే ఇంకా బాగుంటుందని మహా.. అవును వర్షం నీళ్లు ఇంట్లో పడుతుంటే.. మీరు, నేను కాఫీ తాగుతూ ఉండొచ్చు అని చక్రి అంటే..మన ఇద్దరమే ఎందుకు అందరూ ఉంటారు.. అందరం కలిసే కాఫీ తాగుదాం అని మహా అంటుంది. సరే సరే అని అంటాడు. ఇంతలో పెద్ద బండ అడ్డం వస్తే సైకిల్ నుంచి మహా కింద పడబోతోంది. వెనకాల సీటు ఇరిగింది.. అయినా భార్యాభర్తలు అంటే.. ముందు కూర్చోబెట్టుకోవాలి.. ముందు కూర్చోబెట్టుకో అని ఓ ఆవిడ చెప్పి వెళ్తుంది. దీంతో మహా ముందు కూర్చుంటుంది. పక్కనే కనిపిస్తున్న మామిడి తోటకు వెళ్దాం అని మహా అంటుంది.ఏడ్పించిన ఆకతాయిలు.. మహా, చక్రి నవ్వుతూ మామిడితోటలో అలా సరదాగా
పాపం జ్యోత్స్న ఓసారి బావ చేతిలో మోసపోయింది. చిన్నప్పటి నుంచి బావపైనే బోలెడు ఆశలు పెట్టకుంది. అతనే ప్రాణం అనుకుంది. అతనితోనే ప్రేమ, పెళ్లి అనుకుని తన జీవితాన్నే త్యాగం చేసింది. చివరికి పరిస్థితులు ఏమైనా కావచ్చు కానీ.. దీప ఎంట్రీ ఇచ్చి కార్తీక్‌ని లాగేసుకుంది. ప్రాణం అనుకున్న మరదలు జ్యోత్స్నని కాదని.. ఆల్రెడీ పెళ్లై కూతురున్న దీప మెడలో తాళి కట్టాడు కార్తీక్. వీళ్లిద్దరూ బాగానే ఉన్నారు కానీ.. జ్యోత్స్న మాత్రం బావపై పిచ్చి ఆశని వదలుకోలేదు. ఏనాటికైనా తన బావ తనవాడే అనుకుని పిచ్చి ఆశలు పెంచుకుంది. తన బావని దక్కించుకోవడం కోసం చేయని ప్రయత్నం లేదు. ఎన్నో కుట్రలు చేసింది కానీ.. అవన్నీ ఫలించలేదు.అయితే అనూహ్యంగా ఆమె జీవితంలోకి సూరజ్ వచ్చాడు. అనాథగా వచ్చిన అతను.. ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడ్డాడు. బావపై ఉన్న పిచ్చి ఇష్టంతో అతని ప్రేమను తిరస్కరించింది జ్యోత్స్న. అయితే దీప, కార్తీక్‌లతో పాటు.. ఇంట్లో వాళ్లంతా పెళ్లికి బలవంతం చేయడంతో.. తన నుంచి సమాధానం రాకుండానే ఆమెను రిజెక్ట్ చేశాడు సూరజ్. నీ మనసులో నీ బావ ఉన్నాడు కాబట్టి.. నేను నిన్ను పెళ్లి చేసుకోలేనని చెప్తాడు సూరజ్. అయితే రిజెక్ట్ని యాక్సెప్ట్ చేయలేకపోయిన జ్యోత్స్న.. తన మదిలో పథిలంగా నిలిచిపోతాడనుకున్న కార్తీక్ బావని చెరిపేసి.. సూరజ్‌ని తన మనసులో నింపుకుంది. పెళ్లంటూ చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది. ఒకరకంగా చెప్పాలంటే.. జ్యోత్స్నని ప్రేమ మైకంలోకి దింపేశాడు సూరజ్. తన ప్రేమలో నిండా మునిగేట్టు చేశాడు.అయితే ఇదంతా కార్తీకదీపంలో కనిపిస్తున్న కథ.. వినిపిస్తున్న వ్యధ. అయితే దీన వెనుక పెద్ద కథ నడుస్తోంది. ఈ సీరియల్ చూస్తున్న వాళ్లకి సూరజ్ ప్రవర్తన చూస్తే మొదటి నుంచి అనుమానంగాను ఉంటుంది. అతను అనాథ అని చెప్తున్నా కూడా.. అతనికి కథలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మాలిని, దక్షణమూర్తిలతో ఏదో రిలేషన్ ఉండే ఉంటుందని డౌటానుమానాలు

తెలుగు బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ రంగంలో మెయిల్ యాంకర్ గా సుదీర్ఘకాలం వెలుగు వెలుగుతున్నాడు ప్రదీప్. ఏదైనా ఈవెంట్ ఉంటే మెయిల్ యాంకర్ అంటే ఎక్కువగా ప్రదీప్ పేరే వినిపిస్తుంటుంది. ముఖ్యంగా టీవీ షోలో ప్రదీప్, ప్రీరిలీజ్ ఈవెంట్స్ లో సుమ హోస్టింగ్ ఉంటే వచ్చే క్రేజ్ వేరు. అయితే, ప్రస్తుతం బుల్లితెరపై ఈ ఇద్దరిని బీట్ చేస్తున్నాడు సుధీర్. అతని గ్రాఫ్ ఈ మధ్య కాలంలో ఊహించని స్థాయిలో పుంజుకుంది. కామెడీ షోలు, డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు, స్పెషల్ ఈవెంట్ల ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్, ప్రస్తుతం రెమ్యూనరేషన్ విషయంలో ఏకంగా సీనియర్ యాంకర్లను సైతం మించిపోతున్నారనే చర్చ జరుగుతోంది. ఒక సాధారణ కమెడియన్‌గా జబర్దస్త్ ద్వారా కెరీర్ ప్రారంభించిన సుధీర్, తన అద్భుతమైన కామెడీ టైమింగ్, డ్యాన్స్, ఆల్‌రౌండ్ టాలెంట్‌తో చాలాతక్కువకాలంలోనే స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. ఆ పాపులారిటీతో వెండితెరపైకి అడుగుపెట్టి కమెడియన్‌గానే కాకుండా హీరోగా కూడా అవకాశాలు దక్కించుకున్నారు. ఆయన హీరోగా నటించిన 'గాలోడు' చిత్రం కమర్షియల్ విజయాన్ని సాధించడంతో మార్కెట్లో సుధీర్ క్రేజ్ మరింత పెరిగింది. కానీ ఆతరువాత వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ అవ్వలేదు. సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో .. సుధీర్ మళ్లీ యాంకర్‌గా రీ-ఎంట్రీ ఇచ్చారు. ప్రముఖ ఛానెల్లో ప్రసారమయ్యే 'ది ఫ్యామిలీ స్టార్స్' అనే కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ షోకి ఆయన యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి భారీగా టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి. ఈ షో విజయంలో సుధీర్ హోస్టింగ్ కీలక పాత్ర పోషిస్తోంది.దీనితో పాటు సుధీర్ డ్రామా జైనియర్స్ ను కూడా హోస్ట్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. 'ది ఫ్యామిలీ స్టార్స్' షో కోసం సుధీర్ ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు ₹2.5 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది. బుల్లితెరపై ప్రదీప్ లాంటి స్టార్ యాంకర్లు ఒక ఎపిసోడ్‌కు ₹1.8
రూంలో విక్రమ్ కూర్చుంటాడు. విక్రమ్‌కి చీర తగిలేలా అటూ ఇటూ నడుస్తూ పనులు చేసుకుంటూ ఉంటుంది రాధ. ఇక చీర గాలికి విక్రమ్‌కి ఏదో అయిపోతుంది. రాధ చీరని విక్రమ్ పట్టుకుంటాడు. ఏయ్ దొంగ అన్నట్టుగా రాధ చూస్తుంది. ఛీ ఛీ నాకు ఉద్దేశం లేదు అన్నట్టుగా విక్రమ్ చూస్తాడు. చివరకు రూం తలుపులు మూస్తుంది రాధ. ఇంకో వైపు సునంద మాత్రం విక్రమ్ చెబుతున్న అబద్దాలు, ప్రవర్తన బట్టి ఏదో తేడాగా జరుగుతోందని పసి గడుతుంది. ఇదే విషయాన్ని నంద గోపాల్‌కి చెబుతుంది. భార్యాభర్తలు అన్నాక గొడవ కామనే కదా.. వాటిని మన వరకు తీసుకు రాకుండా నీ కొడుకు, కోడలు హ్యాండిల్ చేస్తున్నారు గ్రేట్ కదా అని నంద గోపాల్ అంటాడు.మన పరువు పోవొద్దని విక్రమ్ మీద కోపం ఉన్నా వరలక్ష్మీ వ్రతం కోసం వచ్చింది రాధ.. రాధ లాంటి కోడలు దొరకడం మన అదృష్టం అని అంటుంది సునంద. ఇంకో వైపు రాధ, విక్రమ్ కలిసి సరసాలు చాలు శ్రీవారు అనే పాట వేసుకుంటారు. ఏయ్ ఇదంతా ఎందుకు చేస్తున్నావ్ అని చిరాకు పడతాడు విక్రమ్. రూం అవతల అత్తయ్య, మామయ్య వింటున్నారు సైలెంట్ అని అంటుంది రాధ. కానీ విక్రమ్ నమ్మడు. కావాలంటే వెళ్లి చూసుకోండి అని రాధ అంటుంది. డోర్ తీయగానే నంద గోపాల్ కింద పడిపోతాడు. ఏంటి నాన్నా ఏం చేస్తున్నారు అని విక్రమ్ అడుగుతాడు.ఏం లేదురా మీ నాన్న బాగా తాగాడు.. ఇది మా రూం అనుకుంటున్నాడు.. నేను కాదంటే వినడం లేదు.. ఏవండి ఇది మన రూం కాదు అని నంద గోపాల్ని సునంద తీసుకు వెళ్తుంది. ఇప్పటికైనా నమ్ముతారా? నేను చెప్పేది నమ్మండి అని అంటుంది రాధ. నేను నా కళ్లతో చూస్తేనే నమ్ముతా అని విక్రమ్ అంటాడు. ఇంకో విషయం చెప్తే నమ్ముతారా?.. దొంగ చిట్టి అనిపిస్తోంది.. డీఎన్ఏ టెస్ట్‌లో
బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్‌లోని నాలుగో ఎపిసోడ్లో మొదటి కంటెస్టెంట్‌గా లక్ష్మీ దీపక్ సేనాపతి వచ్చాడు. తన జర్నీ గురించి చెప్పాడు. 2021కి ముందు, ఆ తర్వాత తన జీవితం అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. క్రికెట్ ఎక్కువగా ఇష్టమని, అయితే తనకు ఆరోగ్య సమస్యలు రావడంతో ఆ ఆటను వదిలేసి యాక్టింగ్, మోడలింగ్ సైడ్ వచ్చానని అన్నాడు. ఇలా తన జర్నీ చెబుతూ ఉంటే.. నవదీప్ వెళ్లి అతని చేతిలో ట్రిమ్మర్ పెడతాడు. ఇది ఎందుకు ఇచ్చి ఉంటారు? అని శ్రీముఖి అడుగుతుంది. హెయిర్ షేవ్ చేసుకోమని అంటారేమో అని అతగాడు గెస్ చేస్తాడు. హెయిర్ మాత్రం తీయను.. మీసం, గడ్డం తీస్తాను అని అతను అంటాడు.ఈ ఫాంలో మీసం తీసుకోను అని రాశావ్.. ఇప్పుడేమో తీసుకుంటా అంటున్నావ్.. ఇలా మాటలెందుకు మార్చుతున్నావ్ అని పాయింట్‌ను పట్టుకుంటారు. దీంతో బిందు మాధవి వెంటనే రెడ్ ఇస్తుంది. అలా రాస్తే అదే చేయిస్తాం.. నీ జుట్టు జోలికి రాము అని నువ్వు అనుకున్నావ్.. మమ్మల్ని మానుప్యులేట్ చేద్దామని అనుకున్నావ్ అంతేనా? అని నవదీప్.. ఇన్ని కెమెరాలు ఉండగా.. మోసం చేయాలని చూస్తావా? అని శ్రీముఖి అంటాడు. చివరకు తన తప్పు ఒప్పుకుంటాడు. కావాలనే అలా చేశాను అని అంటాడు. స్టేజ్ మీదే గడ్డం, మీసం తీసేస్తాడు. కానీ అభిజిత్ కూడా రెడ్ ఇస్తాడు. అతి తెలివి చూపించాడు.. ఇది కూడా కావలి.. నెక్ట్స్ ఏం చేస్తాడో ఓ ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని అంటాడు నవదీప్. అలా అతడ్ని హోల్డ్‌లో పెట్టేశారు.ఆ తర్వాత అపూర్వ అనే అమ్మాయి వస్తుంది.. ఆమె యాంకరింగ్ చేస్తూ, హోస్ట్‌లో, న్యూస్ ప్రజెంటర్లా మాట్లాడుతూ ఉంటుంది. ఆమె గురించి పూర్తిగా ఏమీ చెప్పకుండానే ఆమె మాటలకు తెగ నవ్వుతూ గ్రీన్ ఇచ్చేస్తాడు నవదీప్. ఇక అసలు ఆమె కథ చెప్పడం ప్రారంభించే సరికి ఓ పాయింట్లో దొరికిపోతుంది. పురుషాధిక్యత లేని ప్లేస్
సిగ్నల్స్ వద్ద నీ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు కదా.. వెళ్లొచ్చు కదా అని అరుణ్‌ను సుమతి అంటుంది. ఫ్రెండ్సా? అంటే.. అని అరుణ్ ఆశ్చర్యంగా అడుగుతాడు. అదే ట్రాఫిక్ పోలీసులు లేరు కదా.. వెళ్లొచ్చు కదా అని అంటున్నాను అని సుమతి చెబుతుంది. అలా లేరు కదా అని వెళ్లడం తప్పు.. ఎవ్వరూ చూడటం లేదు కదా అని దొంగతనం చేయడం తప్పు కదా అని అరుణ్ అంటాడు. మీరు చాలా సిన్సియర్.. నా దగ్గర కూడా ఫైన్ వేశారు అని సుమతి అంటే.. ఆ స్థానంలో మా అమ్మ ఉన్నా ఫైన్ వేస్తా అని అంటాడు అరుణ్. అలా వేయకపోతే నా ఉద్యోగానికి ద్రోహం చేసినట్టు అవుతుంది.. రిటైర్డ్ అయ్యేటప్పుడు నిజాయితీగా రిటైర్డ్ అవ్వాలని అనుకుంటున్నా.. అని అరుణ్ అంటాడు. ఇంతలో ఇక బైక్ ఆపమని సుమతి అంటుంది. అరుణ్, సుమతి మాట్లాడుకునేది మీనా కూడా చూస్తుంది. దర్జాగా ఇంటి వద్ద డ్రాప్ చేసే రోజుని త్వరగా రానివ్వు అని అరుణ్ అంటే.. ఆలోచిస్తాను అని సుమతి చెప్పి వెళ్లిపోతుంది. ఇతను ఎవరు? అని మీనాలో అనుమానం మొదలు అవుతుంది.ఆ రోహిణి పొగరు తగ్గలేదా? ఇంటికి వచ్చిన సుమతి.. అమ్మకి అన్నం తినిపిస్తుంటుంది. ఇంతలో మీనా కూడా వస్తుంది. నువ్వు కూడా తింటావా? అక్కా అని అడుగుతుంది. నాకు వద్దు.. ఆకలిగా లేదు అని అంటుంది. మీ ఇంట్లో గొడవలు తగ్గాయా? అని అడిగితే.. మా మామయ్య గారి అమ్మ గారు వచ్చి సెట్ చేసి వెళ్లారు అని అంటుంది మీనా. ఇంకా ఆ రోహిణి పొగరు తగ్గలేదా? ఇంకా నిన్ను ఏమైనా అంటోందా? సుమతి అడిగితే.. ఒకప్పటిలా నా తప్పు లేకుండా అంటే పడే రోజులు పోయాయి లే అని మీనా చెబుతుంది. మీరిద్దరూ ఉండండి.. పూల కొట్టుకి నేను వెళ్తాను.. అక్కకి కాఫీ పెట్టు అని వెళ్తుంది అమ్మ.నేనే చెబుదాం
ఏంటి? నాన్న.. ఇదంతా నిజమా? అని షాక్ అవుతూ శేఖరంను అడుగుతుంది శైలు. అవును.. నిజమే అమ్మ.. ఈ రోజు నీ పెళ్లి.. అని అంటాడు శేఖరం. అంటే నన్ను మోసం చేశారన్న మాట.. అని శైలు అంటుంది. ఈ ప్రపంచంలో నాకంటే ఎక్కువగా మిమ్మల్నే నమ్మాను కదా నాన్న.. మీరు కూడా నన్ను మోసం చేస్తారా? అని శైలు బాధ పడుతుంది. నువ్వు పెళ్లి అని చెప్తే వినవు కదా.. అందుకే ఇలా చేశాం అని వరాలు అంటుంది. కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు.. పెళ్లి చూపులు లేవు.. ఏం లేవు అని అంటుంది శైలు. నిన్న మా ఫ్రెండ్ వచ్చింది అందుకే.. అమ్మానాన్నలతో మాట్లాడటానికే.. నన్ను చూడటానికి కాదు అని సురేష్ అంటాడు. ఏంటి నాన్నా ఇదంతా అని శేఖరం అంటే.. అవునమ్మా.. నిజమే అంటాడు శేఖరం. మీరు ఇలా నన్ను మోసం చేసి ఇక్కడకు తీసుక వస్తే తల వంచుకుని తాళి కట్టించుకుంటాను అని అనుకుంటున్నారా? నేను చచ్చిన వేరే వాడ్ని పెళ్లి చేసుకోను.. కేశవను తప్ప ఇంకెవ్వరినీ చేసుకోను అని అంటుంది శైలు.అయితే చచ్చిపోండి వాడిని చేసుకుంటే జీవితం పాడు అవుతుంది తల్లి అని శేఖరం అంటాడు. అయినా పర్లేదు అని శైలు అంటుంది. కేశవ లేకపోతే నేను చచ్చిపోతాను అని శైలు అంటుంది.. నువ్వు వెళ్లిపోతే మేం చస్తాం అని వరాలు అంటుంది. అయితే చచ్చిపోండి అని శైలు అంటుంది. చూశారా? అండి అది ఎలా మాట్లాడుతుందో అని వరాలు అంటుంది. మీరు చేసింది తప్పు కాదు.. నేను ఒక్క మాట మాట్లాడితే తట్టుకోలేకపోతోన్నారు.. కదా.. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను ఆగండి అని శైలు ఫోన్ తీస్తుంది. కానీ సురేష్ గాడు ఆ ఫోన్ లాక్కుంటాడు. పెళ్లి అయ్యే వరకు నీకు ఫోన్ ఇచ్చేది లేదు.. అని శైలుని సురేష్ గాడు, వరాలు కలిసి
బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్‌లోని మూడో ఎపిసోడ్లో రాజ కుమారి హైలెట్‌గా నిలిచారు. ఆమెతో పాటుగా వచ్చిన చాలా మంది కంటెస్టెంట్లు ఎన్నెన్నో కథల్ని చెప్పారు. ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. కానీ రాజ కుమారి కథ మాత్రం అందరినీ కదిలించింది. ఎప్పుడూ స్టేజ్ మీద కంటతడి పెట్టుకోని నవదీప్ కూడా ఏకంగా కన్నీరు పెట్టేసుకున్నాడు. ఆమె కథను విన్న బిందు మాధవి, అభిజిత్ అంతా కూడా హ్యాట్సాఫ్ చెప్పేశారు. ముగ్గురూ గ్రీన్స్ ఇచ్చేసి నేరుగా టాప్ 15లోకి పంపించేశారు. అసలు నేటి ఎపిసోడ్లో వచ్చిన కంటెస్టెంట్లు ఎవరు? హోల్డ్‌లోకి వచ్చిన వారు ఎవరు? అన్నది ఓసారి చూద్దాం.మొదటగా శ్రష్టి వ్యాకరణం అనే అమ్మాయి వచ్చింది. మోడల్ అని, మిస్ ఇండియా, మిస్ ఏసియా ఇలా చాలా వాటిల్లో పాల్గొని టాప్ 10లో ఉన్నానని చెప్పింది. తనకు నటన, డ్యాన్స్ అంటే ఇష్టమని, కాలేజీలో ఉన్నప్పుడు డ్యాన్స్ చేస్తానని అంటే తన మాజీ ప్రియుడు కొట్టాడని, అప్పుడు చెవికి తీవ్రమైన గాయమైందని తెలిపింది.. ముంబైలో ఉంటున్నాను అని ఇలా తన స్టోరీ చెబుతూ వచ్చింది. నీకు ఎలాంటి అబ్బాయిలు అంటే ఇష్టమని బిందు మాధవి అడిగితే.. వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అని అంటుంది. ఎందుకు అని అంటే.. మార్చుకోవచ్చు కదా అని ఆమె చెబుతుంది. అందరూ ఇలానే అనుకుంటారు అని నవదీప్ నవ్వేస్తాడు.ఇక్కడ ఇలా ఉన్నావ్ కానీ.. లోపల పరిస్థితులు వేరేలా ఉంటాయి.. ఇప్పుడు నేను నీకు రెడ్ ఇస్తాను అని బిందు మాధవి అంటుంది. నువ్వెంతో సాధించావ్.. బెనిఫిట్ ఆఫ్ డౌట్‌తో.. గ్రీన్ ఇస్తా అంటాడు అభిజిత్. అందర్ క్యా హై.. అది బయటకు రావాలి.చ. క్యూరిసిటీ మాక్కూడా ఉంది.. అని గ్రీన్ ఇస్తాడు నవదీప్. అలా ఆమెని హోల్డోలో పెట్టేశాడు. పంతులు వేషంలో అయ్యప్ప సాదు వస్తాడు. తర్వాత రెమోలా స్టైలీష్‌గా వస్తాడు. పంతులుకి ఇలాంటి వేషాలు అవసరమా? అని
మా అమ్మ.. రోహిణిని రోస్ట్ చేస్తోంది.. అని బాలు ఇంకో ఇంగ్లీష్ పదాన్ని వాడతాడు. రోస్టా? అంటే ఏంటి? అండి అని మీనా అడుగుతుంది. రోస్ట్ అంటే కాల్చుకుని తినడం.. ఈ రోజే ఈ పదాన్ని నేర్చుకుని పార్లరమ్మ పుణ్యమా? అని ఈ రోజే ఆ పదాన్ని వాడేశా అని బాలు అంటాడు. రోహిణి విషయంలో అత్తయ్య గారు ఓవర్ చేస్తున్నారనిపిస్తోంది అని మీనా అంటుంది. పార్లరమ్మ మాత్రం ఏమైనా తక్కువ చేసిందా? ఎన్ని మోసాలు చేసింది అని బాలు అంటాడు. అయినా శిక్షిస్తున్నట్టు లేదు.. కక్ష తీర్చుకుంటున్నట్టుగా ఉంది అని మీనా అంటుంది. హారతి కర్పూరం ఆర్పేసి మరీ చెప్పింది కదా.. ఆ మాటకు అయినా గౌరవం ఇచ్చి వదిలేయాల్సింది కదా అని మీనా అంటుంది. నాకు డౌటే.. ఇంకా ఎన్ని దాచి పెడుతుందో.. ఇంకా ఎన్ని చేస్తుందో.. చేస్తుందో బాలు అంటాడు. ఆ టైంలోనే విద్య ఫోన్ రావడంతో మీనా లిఫ్ట్ చేస్తుంది. ప్రేమ ప్రపోజల్ గురించి చెబుతుంది. నెక్ట్స్ ఏం చేయాలని సలహా అడుగుతుంది. ఇంకేముంది పెళ్లి చేసుకోండి.. నిజాయితీగా ఉంటేనే బంధం బలంగా ఉంటుంది.. అని సలహా ఇస్తుంది. సరే త్వరలోనే గుడ్ న్యూస్‌తో ఫోన్ చేస్తాను అని విద్య అంటుంది.నేను మాత్రం ఇవ్వకూడదు.. నువ్వు మాత్రం లవ్ గురులా సలహాలు ఇవ్వొచ్చు.. నేను మాత్రం ఇవ్వకూడదు.. పైగా నువ్వు ఆ పార్లరమ్మ ఫ్రెండ్ విద్యకు ఇస్తున్నావ్ అని మీనాతో బాలు అంటాడు. విద్య మంచిది.. ఫ్రెండ్ కోసం అలా మన దగ్గర కూడా విషయాన్ని దాచి పెట్టింది అంట.. అని మీనా చెబుతుంది. మీరు ఆ మురళీకి సలహాలు ఇస్తే ఏం జరిగిందో చూశారు కదా అని మీనా అంటుంది. అది అప్పుడు అని బాలు కవర్ చేస్తాడు. నేను హర్ట్ అయ్యాను అని బాలు అంటే.. మిమ్మల్ని కూల్ చేయాలా? అని చక్కిలిగింతలు పెడుతుంది మీనా.మన
నారాయణ కుటుంబం నుంచి ఎవ్వరూ రాలేదా? అని పంతులు అడుగుతారు. రావడానికి ఎవరున్నారు అని తాయారు ఎగతాళి చేస్తుంది. అంతకు ముందే రుద్రాంబిక అమ్మవారి వద్ద తన బాధను చెప్పుకుంటుంది మహా. నేను ఆ ఇంటి కోడలిని కాదు..నేను చక్రిని ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసు.. నీకు కూడా బంధాలే కావాలా? అమ్మా.. పెద్ది కోసం నేను ఇది చేయాలని అనుకుంటున్నా.. అని మహా అంటుంది. ఆ టైంకి గుడిలోని గంట మోగుతుంది. అదే అమ్మ వారి అంగీకారం అని మహా అనుకుంటంది. నిప్పుల చట్టీతో మహా వస్తుంది. అటు చూడండి అని మనీషా అంటుంది. అలా గాయత్రి, మహా ఇద్దరూ నిప్పుల చట్టీతో వస్తుంటారు. దీంతో నారాయణ సంబర పడతాడు. విజిల్స్ వేస్తాడు. ఇక ఎండలో అలా మహాలక్ష్మీ చెప్పులు లేకుండా నిప్పుల చట్టీతో నడుస్తుండటంతో చక్రి చూడలేకపోతాడు. బిందెతో నీళ్లు తీసుకు వచ్చి దారి అంతా కూడా తడుపుతూ ఉంటాడు. అలా కాసేపు సేవ చేస్తాడు చక్రి. చివరకు మహా, గాయత్రి ఇద్దరూ కూడా మూడు ప్రదక్షిణలు పూర్తి చేస్తారు. అలా పూజా కూడా చివరకు పూర్తవుతుంది.శైలుకి డౌట్.. ఆటోలోంచి దిగేటప్పుడు.. దిగమ్మా.. రామ్మా అని అంటుంది శైలు. ఆరోగ్యం బాగానే ఉందా? నీకు ఏమైంది? అని శైలు అడుగుతుంది. నాకేం అవుతుందే అని వరాలు అంటుంది. ఎప్పుడూ కాళ్లు విరిచేస్తా.. చేతులు విరిచేస్తా.. చంపేస్తా అని నన్ను కొడుతూనే ఉంటావ్.. ఇప్పుడు పదమ్మా.. రామ్మా అని ప్రేమగా అంటున్నావ్.. అంటే ఏదో తేడా కొడుతోంది.. ఏదో చేస్తున్నారు.. చెప్పండి.. ఏం చేస్తున్నారు అని శైలు అడుగుతుంది. మేం ఏం చేస్తామే.. హోమం చేయడానికి వచ్చాం అని చెప్పాను కదా అని శైలుతో వరాలు అంటుంది.నా సిక్స్త్ సెన్స్ చెబుతోంది.. లేదు.. మీరు అబద్దం చెబుతున్నారు.. ఏ గుడికి వెళ్లినా పాజిటివ్ వైబ్స్ వస్తాయి.. కానీ ఇక్కడ నాకు
బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్ రెండో ఎపిసోడలో ఆర్జే చరణ్ మూడు గ్రీన్స్‌ను సంపాదించి టాప్ 15లోకి వెళ్లిపోయాడు. ఇక కొందరిని హోల్డ్‌లో పెట్టారు. ఇంకొందరిని అయితే అటు నుంచి అటే పంపించారు. అక్షయ్ రాజ్ అనే కంటెస్టెంట్ మాత్రం జడ్జ్‌లకు చిరాకు తెప్పించాడు. బిగ్ బాస్ లవ్ ట్రాక్ సెట్ చేస్తే.. చేస్తాను అంటూ నోరు జారాడు. బిగ్ బాస్ అలా లవ్ ట్రాక్ సెట్ చేస్తాడా? అది రియాల్టీ గేమ్ షో కదా అని శ్రీముఖితో పాటు మిగతా జడ్జ్‌లు కూడా షాక్ అవుతారు. ఇక అక్షయ్ రాజ్ మాత్రం జడ్జ్‌లకు విసుగు తెప్పించడంతో అటు నుంచే అటే వెళ్లాల్సి వచ్చింది. అసలు ఈ రెండో ఎపిసోడ్ ఎలా సాగిందో చూద్దాం.ఆర్జే చరణ్ అని నిజామాబాద్ నుంచి 26 ఏళ్ల కుర్రాడు వచ్చాడు. మల్టీ టాస్కర్ అని, హోస్టింగ్ చేయడం ఇష్టం అని, బిగ్ బాస్ షోకి వెళ్తాను అని, ఆ తర్వాత బజ్ ఇంటర్వ్యూలకి హోస్ట్ కూడా చేస్తానని కాన్ఫిడెంట్‌గా చెబుతాడు. ఒకప్పుడు రిలేషన్స్ ఉండే.. ఇప్పుడు సింగిల్ అని చాలా జోవియల్, ఎంటర్టైనింగ్గా అన్నీ చెప్పుకొచ్చాడు. డిగ్రీలో రిలేషన్ షిప్ ట్రై చేశా.. రెండు, మూడు నెలలకే బోర్ కొట్టింది.. రోజూ మాట్లాడటం ఏంటి అని అనిపించింది.. అని నవ్వుకుంటూ చెప్తాడు. తమ్ముడు చిన్న వయసులోనే కళ్లు తెర్చుకున్నాడు.. అని అభిజిత్, నవదీప్ అంటారు. మేమంతా అదే బ్యాచ్ అని బిందు, శ్రీముఖి అంటే.. నేను కూడా మీ బ్యాచ్‌లో జాయిన్ అవుతా అని అంటాడు చరణ్.కోడిలా ఎందుకు.. ఉంటా అని రాశావ్ అని శ్రీముఖి అడిగితే.. పోతూ పోతూ ఓ ఇద్దరి ఆకలి తీర్చాలని.. అని కామెడీ చేస్తాడు. చరణ్. ఎవరి ఇష్టం వాళ్లది కదా.. ఆ అమ్మాయిని అలా తనని తనలా వదిలేయాలి కదా.. అని రిలేషన్ షిప్ గురించి బిందు మాధవి అంటుంది
మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని రోహిణి గారు హోమం చేయించారు.. మీకు కళ్లు పోయినప్పుడు వచ్చి చేయించారు అని విబూది తెచ్చి మనోజ్‌కి ఇస్తాడు పంతులు. అలాంటి భార్య దొరకడం నీ పూర్వజన్మ సుకృతం అని ఓ డైలాగ్ వేసి పోతాడు పంతులు. ఆ మాటతో మనోజ్ కాస్త సంతోషిస్తాడు. మీరు చెప్పినట్టుగానే చెప్పాను అమ్మా అని రోహిణికి ఫోన్ చేసి ఆ పంతులు చెబుతాడు. ఆయన మొహంలో సంతోషం కనిపించిందా? అని రోహిణి అడిగితే.. ఆశ్చర్యం కనిపించింది అని పంతులు చెబుతాడు. ఆ ఆశ్చర్యమే సంతోషంగా, ప్రేమగా మారుతుంది.. ద్వేషం తగ్గుతుంది అని రోహిణి అనుకుంటుంది. ఇంతలో షాప్ పబ్లిసిటీ కోసం పాంప్లేట్స్ పంచి వస్తుంటారు పని చేసే ఎంప్లాయిస్. ఇదంతా ఎవరు చేయమన్నారు అని మనోజ్ అడిగితే.. ఇది వారం నుంచి జరుగుతుంది.. రోహిణి గారు చెప్పారు.. అని అంటారు. దీంతో రోహిణి గురించి కాస్త పాజిటివ్‌గానే ఆలోచిస్తాడు మనోజ్. ఇక వంట గదిలో రోహిణి కుస్తీ పడుతుంటుంది. నువ్వేంటి ఇక్కడ అని మీనా అడుగుతుంది. ఇకపై నా వంట నేనే వండుకోవాలని అత్తయ్య గారు అన్నారంటూ రోహిణి చెబుతుంది.టైం బాగా లేకపోతే.. నీకు వంట రాదు కదా రోహిణి అని మీనా అంటే.. తప్పదు నేర్చుకోవాలి.. టైం బాగా లేకపోతే ఎలాంటి స్థితి నుంచి అయినా ఇలాంటి స్థితికి రావాల్సిందే అని రోహిణి అంటుంది. పర్లేదు మారిపోయేలానే ఉంది అని మీనా అనుకుంటుంది. ఇంతలో శ్రుతి వస్తుంది. ఏదో మాడిన వాసన వస్తోంది.. అని శ్రుతి కౌంటర్లు వేస్తుంది. రోహిణి వంట చేస్తోంది అని మీనా చెబితే.. రోహిణినా? వంటనా? అని షాక్ అవుతుంది. ఒకప్పుడు హోం మినిస్టర్, ఇప్పుడు కిచెన్‌కి ట్రాన్స్ ఫర్ చేశారా? అని కౌంటర్లు వేస్తుంది.వంట మీద ఫోకస్ పెట్టనివ్వు.. నీకు ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ముందే
చాలా రోజుల తరువాత నర్మద కొప్పులో మల్లెపూలు పెట్టి ప్రేమ కురిపిస్తాడు సాగర్. దొరగారికి ప్రేమ పొంగుకొస్తుందేంటో అని తెగ మురిసిపోతూ.. ‘నిన్నా మొన్నా నాలోనా’ అంటూ సాంగ్ వేసుకుంటుంది. ఆ తరువాత ఇద్దరూ రొమాన్స్‌లో మునిగిపోతారు. ఏమాట కామాటే కానీ.. ఇంతకు ముందు రొమాంటిక్ సీన్ అంటే నర్మద చింపేసేది కానీ.. సాగర్ కాస్త ఇబ్బంది పడుతూ చేసేవాడు. కానీ ఈసారి మాత్రం మనోడు రాటుదేలినట్టుగానే రెచ్చిపోయాడు. నటించరా బాబూ అంటూ నర్మదని మీదికి లాక్కుని రెచ్చిపోయాడు. మల్లెపూల కంటే నీ కళ్లే చాలా మత్తుగా కనిపిస్తున్నాయి.. నీ స్వాస కూడా పరిమళం వెదజల్లుతుంది.. పెదాలు కూడా మాట్లాడుతున్నాయి.. గుర్తుండిపోయేలా జీవిత సంతకం చేయమని అంటూ మీదికి లాక్కుని ముద్దుపెట్టేస్తాడు సాగర్. ఆ తరువాత మరో సాంగ్ వేసుకుని అలా లైట్లు ఆర్పేస్తారు. ఇటు ధీరజ్.. రాత్రి పూట ప్రేమని వెతుక్కుంటూ భద్రావతి ఇంట్లోకి అడుగుపెడతాడు రహస్యంగా. మొత్తానికి అతి కష్టంపై ప్రేమ గదిని వెతుక్కుంటూ ప్రేమ దగ్గరకు వెళ్తాడు. నేను దీని కోసం ఇంత కష్టపడి గోడలు దూకి వస్తుంటే.. ఇది ప్రశాంతంగా పాటలు వింటుందా? ఏం పాటలు వింటుందబ్బా అంటూ ఆమె ఇయర్ ఫోన్స్ ఒకటి తీసి వింటాడు. మగాళ్లు ఒట్టి మాయగాళ్లే అంటూ పాటను పెట్టుకుని వింటూ పడుకుంటుందన్నమాట ప్రేమ.అసలేమైందీ.. ఆహా బావుందిగా వీళ్లపని అది విన్న ధీరజ్.. ‘ఏంటీ నేను మాయగాడినా? అంటూ బిత్తరపోతాడు. ఇంతలో ప్రేమ నిద్రలో నుంచి లేచి కూర్చొంటుంది. ఎదురుగా ధీరజ్ని చూసి కెవ్వుమంటుంది. దాంతో ధీరజ్.. ఆమెకి ముద్దు పెట్టేస్తాడు. ఆ తరువాత సాంగ్ స్టార్ట్. ‘అసలేమైందీ.. కన్నెమనసుకి రెక్కలొచ్చి ఎక్కడికో వాలిందీ’ అంటూ సాంగ్ వేసుకుని ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. కాస్త తేరుకున్న ప్రేమ.. ధీరజ్ని తోసిపారేస్తుంది. సచ్చినోడా నా గదిలోకే వస్తావ్ రా.. పోరా అంటూ చితకబాదుతుంది. నేను చెప్పేది విను ప్రేమా అంటూ అడ్డుకునే
ఈ ఇంట్లో ఆడవాళ్లు ఎవరున్నారు.. మహాలక్ష్మీ వల్ల కాదు అని నిప్పుల చట్టి గురించి తాయారు చెబుతుంది. నిప్పుల చట్టి అంటే అమ్మాయి చేతులు కాలుతాయి.. వద్దు అని నారాయణ అంటాడు. కానీ మహాలక్ష్మీ మాత్రం చేస్తాను అని అంటుంది. ఇంటికి వచ్చాక కూడా ఇదే విషయం గురించి మహాలక్ష్మీ మాట్లాడుతుంది. నేను నిప్పుల చట్టి పట్టుకుంటాను అని మహా అంటుంది. అది మేం ఇంకా నిర్ణయించుకోలేదు కదా అని కేశవ అంటాడు. నేను కదా ఎత్తేది.. మీరు నిర్ణయించడం ఏంటి? అని మహా అంటుంది. వద్దు అండి అని చక్రి అంటాడు. మీ తాయారు అత్త చూశారు కదా ఎన్నెన్ని మాటలు అన్నారో అని మహా అంటుంది. ఆమె మాటలు మేమే పట్టించుకోం.. మీరే ఎందుకు పట్టించుకుంటున్నారు అని చక్రి, కేశవ అంటారు. నేను రేపు పెద్ది కోసం నిప్పుల చట్టి పట్టుకుంటాను అని మహా అంటుంది. దీంతో మహాని పక్కకి తీసుకెళ్లి మాట్లాడతాడు పెద్ది. నీకు వద్దని గుడిలోనే చెప్పాను కదమ్మా.. మళ్లీ అలానే అంటావ్ ఏంటి? అని పెద్ది అడుగుతాడు. నేను నీ కోసం చేయాలని అనుకుంటున్నాను పెద్ది అని మహా చెబుతుంది.చక్రిని భర్తగా భావిస్తున్నావా? నువ్వు చక్రిని భర్తగా భావిస్తున్నావా? వాడు కట్టిన తాళిని అంగీకరిస్తున్నావా? లేదు కదా.. నువ్వు మా ఇంటి కోడలిగా ఆ పూజ చేస్తేనే ఫలితం వస్తుంది.. అలా కాదని నువ్వు ఎంత చేసినా వృథానే అవుతుంది. అందుకే వద్దని చెబుతున్నా అని చెప్పేసి వెళ్లిపోతాడు మాధవ. రేపు ఆమె పూజ చేయదు.. వద్దు అని సతీష్‌కి చెప్తాడు మాధవ. మీ ఇష్టం.. అలా చేస్తే మీ దోషాలు పోతాయని అన్నాను అంటే.. మీకు ఇష్టం లేకపోతే వద్దు అని సతీష్ అనేసి వెళ్లిపోతాడు. ఇక రాత్రి అంతా మహా అలా ఆలోచిస్తూనే ఉంటుంది.నాక్కూడా తెలీదు కదరా మహాలక్ష్మీ అలా బయట ఆలోచిస్తూ అటూ
మొత్తానికి పల్లవికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాడు అశ్విన్. అయితే పల్లవి ఏదో సమస్యలో ఉందని కనిపెట్టేసింది అవని. ఇక ఈరోజు (ఆగస్టు 15) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. ఇంట్లో వాళ్లంతా డైనింగ్ టేబుల్‌పై కూర్చుని భోజనం కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో అవని.. స్పెషల్ ఐటమ్‌కి అంటూ ఊరిస్తూ ఉంటుంది. ఇక ఎప్పుడూ వదిన భజనలో భార్యని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్న కమల్.. తొలిసారి పల్లవి మాట వినడంతో ఆనందంతో ఉప్పొంగిపోతుంది భానుమతి. అందరూ వచ్చారు.. అక్షయ్ ఎక్కడా అని పార్వతి అడగడంతో.. ఆరాధ్యని వెళ్లి పిలిచుకుని రమ్మని చెప్తుంది. ఓ పక్క కడుపు కాలిపోతున్నా.. నేను రాను అంటూ ఓవరాక్షన్ చేస్తుంటాడు అక్షయ్. ఇక అవని స్పెషల్ డిష్‌తో ఊరించడంతో ఉరకలేసుకుంటూ వస్తాడు. తీరా ప్లేట్లో కాకరకాయ కర్రీలు వడ్డించేసరికి.. నోరెళ్ల బెడతాడు అక్షయ్. కావాలనే అక్షయ్‌కి కాకరకాయ విందు వడ్డిస్తుంది అవని. ఇక మిగిలిన వాళ్లకి కాకరకాయే వడ్డించడంతో ఒక్కొక్కరి ఫేస్ మాడిపోతుంది. ఏంటి వదినా.. మొత్తం కాకరకాయే. దీన్ని ఎలా తింటాం అని అంటారు కమల్, శ్రీకర్లు. ఇంట్లో పెద్ద వాళ్లు ఉన్నారు కదా.. వాళ్ల కోసంమైన మనం వారానికి ఒకసారైనా కాకరకాయ వెరైటీలే తినాలి’ అని అంటుంది అవని.ఈ చేదు కూరలు నా వల్ల కాదు అని భానుమతి అనడంతో.. అసలు చేసిందే మీకోసం అయితే.. మీరే వద్దంటే ఎట్టా అందరూ తినండి అని అంటుంది అవని. అయితే ఒక్కరు కూడా ఇష్టంగా తినలేరు. ఇందుకే కదా.. ఈ అవని శాడిజం భరించలేం అనే కాదు ఆ పల్లవి పారిపోదాం అని అంటుండేది. లేకపోతే వాళ్లకి ఇష్టమైనవి మానేసి.. అవనికి ఏది ఇష్టమూ అదే వండటం కాదు.. అదే తినాలంటూ బలవంతంగా వాళ్లతో తినిపిస్తుంది అవని. ఆ ఫుడ్ తిన్న తరువాత.. వాళ్ల నోరంతా చేదుగా మారిపోయింది. అయితే అక్షయ్ మీద ఉన్న కోపంతోనే అందరికీ కాకరకాయ
బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్ శనివారం నాడు లాంచ్ అయింది. టీవీల్లో రాత్రి ప్రసారం అయ్యే ఈ ఎపిసోడ్ జియో హాట్ స్టార్‌లో ఆల్రెడీ వచ్చేసింది. ఈ ఫస్ట్ ఎపిసోడ్లో పది మంది కంటెస్టెంట్లను పిలిచారు. ఇందులో ఒక్కడికి మాత్రమే మూడు గ్రీన్స్ వచ్చాయి. షాలిని దామెరకి, సింగర్ ఝాన్సీకి రెండేసి గ్రీన్ ఓట్లు వచ్చాయి. ఇక వారిని హోల్డ్‌లో పెట్టారు. అభి సాంగర్, అంజలి, అర్జున్, శ్రీవాణి, దెబోరా, రన్నింగ్ రాజా అంటూ ఇలా కొంత మంది వచ్చారు. కానీ వారు ఏ మాత్రం జడ్జ్‌లను ఇంప్రెస్ చేయలేకపోయారు. అందుకే వారికి మూడు రెడ్ ఫ్లాగ్స్ చూపించి రిజెక్ట్ చేసేశారు.కరీంనగర్‌కు చెందిన షాలినీ ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తుందట. బిగ్ బాస్ కోసం మళ్లీ అక్కడి నుంచి ఇక్కడకు వచ్చిందట. గతంలో ఒక రిలేషన్ ఉండేదని, ఇద్దరికీ సెట్ కావడం లేదని పరస్పర అంగీకారంతోనే విడిపోయాం అని చెప్పింది. నీ ఫోన్‌ని మేం చెక్ చేయొచ్చా? అని బిందు అడుగుతుంది. సరే కానీ స్నాప్ చాట్ మాత్రం చూడొద్దు, ఎవరికైనా పర్సనల్ ఉంటుంది కదా.. నేను కూడా మీలానే మీ ఫోన్ చూస్తానంటే ఒప్పుకుంటారా? అని రివర్స్‌లో అడుగుతుంది. అవునా సరే అయితే మీ ఫోన్‌ను పగలగొట్టండి అని నవదీప్ అంటాడు. ఇక ఆమె ఆ ఫోన్‌ను పగలగొడుతుంది.వాష్ రూం క్లీన్ చేయడం నచ్చదు అని అప్లికేషన్లో ఉంది కదా.. ఇప్పుడు షూ క్లీన్ చేయండి అని టాస్క్ ఇస్తారు. షూని అయిష్టంగానే క్లీన్ చేస్తుంటుంది షాలిని. అంతలో ఇంకో కంటెస్టెంట్ అభి సాంగర్‌ను శ్రీముఖి పిలుస్తుంది. ఎంట్రీలోనే అతడ్ని రోస్ట్ చేసేస్తుంది శ్రీముఖి. 23 ఏళ్లు అని చెప్పడం, బిజినెస్ మెన్, ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పడం ఇవన్నీ కూడా జడ్జ్‌లకు ఎక్కదు. సరే ఆ షాలినీ అవుట్ ఫిట్ ఎలా ఉంది.. ఆమె ఎలా ఉంది చెప్పు అని టాస్క్
స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు ’ సీరియల్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కథ కూడా మంచి రసపట్టులో సాగుతుంది. ఇంతలో ఊహించని షాక్ ఇచ్చింది జియో హాట్ స్టార్. నిజానికి ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతుండగా.. ఎప్పుడో రాత్రి వరకూ ఏం ఎదురుచూస్తాం.. పైగా నరాలు తెగే ఉత్కంఠ మధ్య సీరియల్స్ సా..గుతూ ఉంటాయి కాబట్టి.. ఆ టెన్షన్ భరించలేక ఉదయాన్నే హాట్ స్టార్‌లోనే చూసేస్తుంటారు చాలామంది సీరియల్స్ ఫ్యాన్స్.అయితే ఈ మధ్య రిపీటెడ్‌గా మంచి రేటింగ్‌తో సాగుతున్న ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌ని హాట్ స్టార్‌లో ఆలస్యంగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈరోజు (ఆగస్టు 13) ఎపిసోడ్‌ని ఉదయం ఆరు గంటలకే స్ట్రీమింగ్ చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకూ పాత ఎపిసోడ్‌నే కనిపిస్తుంది తప్పితే.. కొత్త ఎపిసోడ్‌ని స్ట్రీమింగ్ చేయలేదు. దీంతో జియో హాట్ స్టార్‌ని సబ్స్క్రిప్షన్ తీసుకున్న సీరియల్స్ ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. వందలు, వేలు పెట్టి ఈ సీరియల్స్ కోసమే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే.. ఆన్ టైమ్‌లో ఎపిసోడ్ టెలికాస్ట్ చేయకపోవడంతో పెదవివిరుస్తున్నాయి.అయితే హాట్ స్టార్ సీరియల్ ఆలస్యంగా స్ట్రీమింగ్ చేయడం అనేది ఇదే తొలిసారి కాదు. చాలా సందర్భాల్లో ఇదే రిపీట్ అవుతూ వస్తుంది. పోనీ ప్రైమ్ టైమ్‌లో రేటింగ్ పెంచడానికే ఇలా చేస్తున్నారా అంటే.. ఏ మధ్యాహ్నం పూటనే చడీ చప్పుడు లేకుండా కొత్త ఎపిసోడ్‌ని స్ట్రీమింగ్ చేస్తుంటారు. నేటి (ఆగస్టు 13) ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ విషయంలో కూడా అదే రిపీట్ కావచ్చు.ఇక ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కథ విషయానికి వస్తే.. ధీరజ్‌కి వదిలి వెళ్లిపోయిన ప్రేమ.. భద్రావతి మాటల్ని నమ్మి ధీరజ్‌తో ఇంకా ఇంకా దూరాన్ని పెంచుకుంటుంది. అయితే.. ప్రేమ-ధీరజ్‌లు విడిపోవడానికి కారణం భద్రావతి, వల్లీలే అనే విషయాన్ని పసిగట్టిన నర్మద.. ఆ నిజాన్ని ప్రేమకి చేరవేయడానికి గట్టిగానే ప్రయత్నిస్తుంది
ఒంటరిగా ఉన్న రాధ మీద అటాక్ ప్లాన్ చేస్తాడు భవానీ శంకర్. ఇలా లైవ్‌లో మర్డర్ చూసి చాలా రోజులు అయిందని భవానీ శంకర్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఇంతలో రాధ పక్కన విక్రమ్ వచ్చి కూర్చుంటాడు. దీంతో రౌడీలు సైలెంట్ అవుతారు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అని భవానీ శంకర్ అనుకుంటాడు. ఇక రాధను కూల్ చేసేందుకు ఐస్ క్రీం కూడా తెస్తాడు. కానీ రాధ మాత్రం మారాం చేస్తుంది. నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్తావా? అని అలుగుతుంది. రాధను కూల్ చేసి ఆ ఐస్ క్రీం తినిపించాలని విక్రమ్ అనుకుంటాడు.ఇక అప్పుడే ఫోన్ చేసిన దమయంతికి భవానీ శంకర్ లైవ్ రన్నింగ్ కామెంటరీ చేస్తాడు. రాధ చిన్నగా నవ్వింది.. విక్రమ్ గట్టిగా నవ్వాడు.. ఇద్దరూ కలిసి పకపకా నవ్వుకుంటున్నారు.. రాధకి విక్రమ్ ఐస్ క్రీం తినిపిస్తున్నాడు అని చెప్తాడు భవానీ శంకర్. వదిలేసినోడు మళ్లీ ఎందుకు వచ్చాడు అని దమయంతి అనుకుంటుంది. ఏమో అమ్మా.. ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కువగానే ఉన్నట్టుంది. నువ్వులేక నేనులేను అనే రేంజ్లో ప్రేమ ఉంది.. ఏడేడు జన్మల బంధం అన్నట్టుగా ఉందని భవానీ శంకర్ అంటాడు.ఇంకో వైపు సునంద మాత్రం వారసుడు రావాలని పూజ చేయించాలని చూస్తుంది. రాధ, విక్రమ్ ఇంకా గుడ్ న్యూస్ చెప్పడం లేదని, ఏమైనా దోషాలున్నాయేమో అని పంతుల్ని అడుగుతుంది సునంద. అప్పుడు ఏదో వ్రతం ఉందని రాధ చెప్పింది కదా అని నంద గోపాల్ గుర్తు చేస్తాడు. నాకు తెలిసి అది అబద్దం అండి, అందుకే ఇలా పంతుల్ని అడిగాను.. పూజకి ముహూర్తం కూడా పెట్టించాను అని సునంద అంటుంది. ఇంకో వైపు రాధ తన పుట్టింట్టో విక్రమ్‌ను ఏడ్పిస్తుంటుంది. తినడానికి కూర్చో పెట్టి.. పద్మావతి పక్కకు వెళ్లిన ప్రతీ సారి విక్రమ్‌ని గిల్లుతూ, గిచ్చుతూ ఏడ్పిస్తుంటుంది రాధ.ఇంకో వైపు ఖాళీ తింటూ ఎంజాయ్
ఇందు, నందు ఎంత చెప్పినా శశి గాడి ట్రాప్ లోంచి ఐశ్వర్య బయటకు రాదు. దీంతో ఐశ్వర్య ఫ్రెండ్ రేణుని తీసుకు వస్తుంది నందు. రేణు కూడా శశి గాడి గురించి నిజం చెబుతుంది. వాడు మంచి వాడు కాదు, నిన్ను మోసం చేస్తున్నాడు.. వాడు ప్రేమించడం లేదు అని రేణు చెబుతుంది. కానీ ఐశ్వర్య మాత్రం నమ్మదు. ఈ ఇందు, నందు నిన్ను భయపెట్టి ఉంటారు.. అందుకే ఇలా చెబుతున్నావ్ అని ఐశ్వర్య అంటుంది. నన్ను ఎవ్వరూ భయపెట్టడం లేదు.. ఇదే నిజం అని అంటుంది రేణు. కానీ ఐశ్వర్య నమ్మదు. నువ్వు నమ్మవు అని నాకు తెలుసే.. అందుకే ఎవరి చేత చెప్పించాలో వాడ్నే తీసుకు వచ్చా అని శశి గాడ్ని దించుతుంది నందు. వీళ్లు చెప్పింది నిజం.. అని శశి గాడు అంటాడు. దీంతో ఐశ్వర్య షాక్ అవుతుంది. ఇప్పటికైనా నమ్ముతావా? అని నందు అంటే.. నమ్మకం ఏం చేస్తుంది అని శేషు, భ్రమరం అంటారు. నీకు బుద్దిలేదా ఇలాంటి పనులు చేయడానికి అని అంతా శశి గాడి మీద ఫైర్ అవుతారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని భ్రమరం అంటుంది.ఇలానే చెప్పమని బెదిరించారు.. ఇప్పుడు మీకు సంతోషమేనా? మీరు చెప్పమన్నట్టుగానే చెప్పా.. అని ప్లేటు ఫిరాయిస్తాడు శశి. ఏంట్రా అబద్దాలు ఆడుతున్నావ్ అని ఇందు అంటుంది. నిన్న వీళ్లు నన్ను కొట్టారు.. ఇలా చెప్పకపోతే నా కుటుంబం పరువుతీస్తామని అన్నారు.. అసలే మాది పెద్ద కుటుంబం.. మా నాన్నకి ఉన్న పలుకుబడి గురించి తెలిసిందే కదా.. అందుకే ఇందాక అలా అబద్దం చెప్పా అని శశి అంటాడు. వాడు అబద్దాలు చెబుతున్నాడు అని ఇందు అంటే.. నువ్వే అబద్దాలు చెబుతావ్.. నేను శశిని నమ్ముతున్నాను.. నేను శశిని ప్రేమిస్తున్నా.. శశినే పెళ్లి చేసుకుంటా అని ఐశ్వర్య అంటుంది.ఇది కూడా దాని అమ్మలాంటిదే.. అక్కా అంటావ్.. ఐశ్వర్య మీద నీకు ఇంత
జ్యోత్స్న పూర్తిగా మారిపోయింది. కార్తీక్‌తో బంధాన్ని తెంపేసుకుని సూరజ్ వైపు గాలి మళ్లించింది. ఓ వైపు అతను వద్దూ అంటూనే.. అతని ప్రేమకోసం తపించడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూశాం. ఇక ఈరోజు (ఆగస్టు 13) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. కార్తీక్ ఇంటికి వచ్చిన జ్యోత్స్న తిరిగి ఇంటికి వెళ్లడానికి క్యాబ్స్ కోసం చూస్తుంటుంది. ఎప్పటికీ క్యాబ్ బుక్ కాదు. దాంతో ఎలా వెళ్లాలీ అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సెకండ్ హీరో వచ్చేస్తాడు బైక్ వేసుకుని. ఇక్కడ క్యాబ్ సర్వీస్ తక్కువగా ఉంటుందని బ్రదర్ చెప్పాడు కదా.. పైగా వర్షం పడేలా ఉంది.. రా లిఫ్ట్ ఇస్తాను.. అని అంటాడు సూరజ్. ‘నువ్వు ఎంత అడిగినా నేను రాను’ అని అంటుంది జ్యోత్స్న. ‘అబ్బా రా.. గొడవల్ని పక్కనపెట్టి ఎక్కు.. వర్షం పడితే ఇద్దరం ఇరుక్కుపోతాం’ అని బ్రతిమిలాడి జ్యోత్స్నని బైక్ ఎక్కించుకుంటాడు సూరజ్. ఇక అద్దంలో జ్యోత్స్నని చూస్తూ.. ‘ఎవరే.. ప్రేమని మాయన్నదీ’ అంటూ తెగ ప్రేమించేస్తూ సాంగ్ వేసుకుంటాడు సూరజ్. ఇక ఇంటి దగ్గర డ్రాప్ చేయడంతో థాంక్స్ అని అంటుంది జ్యోత్స్న. ఇట్స్ ఓకే కానీ.. చాలా కష్టపడుతున్నట్టున్నావ్ అని అంటాడు సూరజ్.వస్తువులు తిరిగి ఇచ్చేస్తే మనసులో ఉన్న ఇష్టం పోతుందా?? దేని గురించి మాట్లాడుతున్నావ్ అని జ్యోత్స్న అంటే.. ‘నన్ను నమ్మించడానికి’? అని అంటాడు సూరజ్. ‘నిన్ను నమ్మించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావ్ అని జ్యోత్స్న కోపంగా చూస్తుంది. నీ మనసులో ఎవరూ లేరని నన్ను నమ్మించడానికి చాలా కష్టపడుతున్నట్టున్నావ్.. అని అంటాడు సూరజ్. ‘నేను ఎవర్నీ నమ్మించాల్సిన అవసరం లేదు.. అలాగే నా మనసులో ఎవరికీ స్థానం లేదు.. రాదు’ అని అంటుంది జ్యోత్స్న. ‘సర్లే.. కనీసం నీ మనసులో నీకైనా స్థానం ఉందా? వస్తువులు తిరిగి ఇచ్చేసినంత మాత్రాన మనసులో ఉన్న ఇష్టం పోతుందా? అని అడుగుతాడు సూరజ్. మా బావపై ఉన్నది
ఇక్కడికి కూడా దాపరించారా? మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా? నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారా? ఇక్కడికి ఎందుకు వచ్చార్రా అని తిడుతుంది తాయారు. ఇదేమైనా నా మొగుడి సొత్తా? మేం రాకూడదా? అని కేశవ అంటాడు. ఈ టైంకే రావాలని, ఇక్కడికే రావాలని ఉందా? ఇక్కడి నుంచి వెళ్లిపోండి..అసలు మీకు ఈ అడ్రెస్ చెప్పింది ఎవడ్రా అని తిడుతుంది తాయారు. మేం వెళ్లం నీకు నచ్చకపోతే.. నువ్వే వెళ్లిపో అని చక్రి, కేశవ అంటాడు. ఈ అడ్రెస్ ఆ మెడలు తిరగనోడే ఇచ్చాడు అని అంటాడు నారాయణ. వాడి సంగతి చెప్తా అని తాయారు రమణయ్యకి ఫోన్ చేసి తిడుతుంది. అమ్మో ఇప్పుడు దీనికి నేనే కావాలని చెప్పాని తెలిస్తే నన్ను చంపేస్తుంది.. అమ్మవారు కలలోకి వచ్చింది. అందుకే చెప్పాను అని కవర్ చేస్తాడు రమణయ్య. ఏమైనా సమస్య.. నేను కూడా రావాలా? అని అంటాడు రమణయ్య. వద్దులే.. ఏమైనా ఉంటే ఫోన్ చేస్తా అప్పుడు రా అని అంటుంది తాయారు. ఇంకో వైపు శైలు, కేశవ మాట్లాడుకుంటూ ఉంటే సురేష్ ఉడికిపోతుంటాడు. దీంతో సురేష్ ఓ కన్నింగ్ ప్లాన్ వేస్తాడు.కేశవతో ఫోన్.. కేశవకి శైలు ఫోన్ చేస్తుంది. వామ్మో ఇది ఫోన్ చేస్తుంది.. ఫోన్ చేయలేదు అని తిడుతుందేమో.. మనమే రిటర్న్‌లో తిడదాం అని కేశవ అనుకుంటాడు. నన్ను మర్చిపోయావా?ఫోన్ కూడా చేయడం లేదు అని శైలు అంటుంది. ఇప్పుడే సత్రంలోకి దిగాం.. ఇక్కడ సిగ్నల్స్ కూడా ఉండటం లేదు అని కేశవ అంటాడు. మనం కూడా అక్కడే పెళ్లి చేసుకుందాం.. ఎలాగూ మనం లేచిపోయి పెళ్లి చేసుకోవాల్సిందే.. నువ్వు మా వాళ్లకి నచ్చవు.. నేను నిన్ను తప్ప ఇంకెవ్వర్నీ చేసుకోను అని అంటుంది శైలు. ఈ మాటలన్నీ కూడా సురేష్ గాడు వింటాడు. వచ్చి శైలుతో గొడవ పడతడు. వందకి ఫోన్ చేయాలా? అని శైలు బెదిరిస్తుంది.సైలెంట్‌గా పెళ్లి.. నేను

Illu Illalu Pillalu August 12th Episode Reveiw: జ మధ్యలో లేచి వెళ్లిపోతుంది ప్రేమ. ప్రేమ వెనకాలే ధీరజ్ వస్తాడు. భర్త పేరు గోత్రం చెప్పనందుకు, ధీరజ్ చేత కుంకుమ పెట్టించుకుని ఆశీర్వాదం తీసుకోనందుకు ప్రేమ కుమిలిపోతుంది. లేచిపోయావని అవమానించావు. ఆ బాధ మనసులో నీ మీదున్న ప్రేమని చంపేస్తోంది ధీరజ్ అని ప్రేమ ఏడుస్తుంది. మరోవైపు ప్రేమ తన మీద ఎందుకింత ద్వేషం పెంచుకుందని ధీరజ్ ఆలోచిస్తుంటాడు. ఓ భక్తుడు కళ్లు తిరిగి కింద పడబోతుంటే పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టుకుంటాడు ధీరజ్. ఆ క్షణం గుడిలో ప్రమాదం జరుగుతుంది. తాటాకు పై కప్పు భారీ శబ్దంతో నేరుగా ధీరజ్‌పై పడుతుంది. నుదుటికి దెబ్బ తగిలి రక్తం కారుతుంది. శుభమా అని గుడికొస్తే నీకిలా జరగడేంట్రా కొడుకుతో వేదవతి ఎమోషనల్ అవుతుంది. భర్త పేరు చెప్పకపోతే అశుభం .. కుంకుమ పెట్టించుకోకపోతే అరిష్టం .. పూజారి మాటలు గుర్తొచ్చి ప్రేమ భయపడిపోతుంది. నా భర్త పేరు మీద అర్చన చేయండి అని పంతుల్ని వేడుకుంటుంది. తప్పంతా నాదే క్షమించు తల్లీ నా భర్తకు ఏమీ కాకూడదు .. ధీరజ్‌పై ప్రేమను బయటపెడుతుంది ప్రేమ. [caption id="attachment_1886120" align="alignnone" width="1280"] Illu Illalu Pillalu Serial[/caption] ఆగు ప్రేమా .. నా మాటలు నిన్నెంతగా బాధపెట్టాయో నా కర్థమైంది. అయితే ఎంత కోపం వస్తే నేనలా మాట్లాడానో అర్థం చేసుకో. మీనాన్న రెచ్చగొడితేనే మాట్లాడాననీ నువ్వు తెలుసుకోవాలి ప్రేమా అంటాడు .. నాకేం చెప్పొద్దు.. నీ సంజాయిషీ అవసరం లేదు అంటుంది. ఆ మాట అనకుండా ఉండాల్సింది. మనసు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏం చెప్పినా వినలేదు. నర్మద, వేదవతి ప్రేమకు సర్ది చెబుతారు. ఆ రోజు ధీరజ్ ఆ మాట అనాల్సి ఉండకూడదు. అసలు మీ వాళ్లు ఎందుకు మా ఇంటికొచ్చి గొడవ పెట్టుకున్నారో నువ్వు తెలుసుకోవాలి ప్రేమా. అమ్మ పుట్టిన రోజు
సూరజ్, జ్యోత్స్నల ప్రేమాయణం పట్టాలెక్కేసింది. ఇంట్లో వాళ్లంతా సూరజ్‌కి ఇచ్చిపెళ్లి చేయడానికి సిద్ధపడతారు. అయితే జోత్స్న మాత్రం పెళ్లికి ఒప్పుకోదు. ఆ మాట చెప్పకుండానే.. జ్యోత్స్నతో పెళ్లిని రిజెక్ట్ చేస్తాడు సూరజ్. దాంతో ఆమె ఘోరంగా హర్ట్ అయిపోయింది.. నన్నే రిజెక్ట్ చేస్తాడా అని. నిన్న మొన్నటి వరకూ తన వెంటపడిన వాడు.. తనని కాదనేసరికి హర్ట్ అయ్యింది. దీప దగ్గర కన్నీటిపర్యంతం అయ్యింది. అయితే ఆడదాని మనసు ఆడదానికే తెలుస్తుందని.. జ్యోత్స్న మనసులో మొన్నటి వరకూ కార్తీక్ ఉన్నా.. ఇప్పుడు అతన్ని డిలీట్ చేసి.. సూరజ్‌ని ప్రేమిస్తుందంటూ.. జ్యోత్స్న మనసుని చదివేస్తుంది దీప. జ్యోత్స్నలో మార్పు మొదలైంది.. జ్యోత్స్నకి సూరజ్ కావాలి.. ఈ విషయం తనకి తెలియకపోయినా.. తన మనసుకి తెలుసు.. ఈ విషయం త్వరలోనే సూరజ్‌కి కూడా తెలుస్తుంది.. వాళ్లు ఒకర్నొకరు చూసుకోకుండా ఉండలేరు కూడా.. అని కార్తీక్త్కి చెప్తుంది దీప. కట్ చేస్తే.. ఆఫీస్‌లో ఎదురెదురు కూర్చుని అదే పనిలో ఉంటారు సూరజ్, జ్యోత్స్నలు.కన్నార్పకుండా జ్యోత్స్నని అలా చూస్తూనే ఉంటాడు సూరజ్. జ్యోత్స్న చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. కోపంగా లేచి సూరజ్ దగ్గరకు వస్తుంది. అయితే సూరజ్ చాలా తెలివిగా ఆమె కూర్చున్న కుర్చీని చూస్తూ ఉంటాడు. ‘నేను ఇక్కడుంటే అక్కడేం చూస్తున్నావ్’ అని అంటుంది జ్యోత్స్న. ‘నేను నిన్ను ఎందుకు చూడాలీ’ అని అంటాడు సూరజ్. మరి ఇంతసేపూ ఎవర్ని చూశావ్.. నన్నే కదా చూస్తూ ఉన్నావ్ అని అంటుంది జ్యోత్స్న. నువ్వు ఇక్కడకొచ్చినా అక్కడే చూస్తున్నానంటే.. నిన్ను చూడలేనట్టు కదా అని అంటాడు సూరజ్. మరి ఎవర్ని చూస్తున్నావ్ అంటే.. ‘శూన్యం’లో చూస్తున్నా’ అంటూ జ్యోత్స్నకి చిరాకు తెప్పిస్తాడు సూరజ్. నీతో మాట్లాడితే పిచ్చి ఎక్కుతుంది అని జ్యోత్స్న అంటే.. కొత్తగా ఎక్కాలా ఏంటీ అంటూ మరింత చిరాకు తెప్పిస్తాడు సూరజ్.అయితే వీళ్లిద్దరూ తగువులాడుకుంటూ ఉంటే.. అది చూసి దీప, కార్తీక్‌లు తెగ సంబరపడిపోతారు. ‘‘ఇదన్న
ఇష్టమైన వ్యక్తితో డ్యాన్స్ చేయమనే చీటి నంద గోపాల్‌కి వస్తుంది. దీంతో సునందతో కలిసి నంద గోపాల్ స్టెప్పులు వేస్తాడు. లవంగం చీటి తీస్తే.. దేవుడు కనిపిస్తే ఏం కోరుకుంటావ్ అని ఉంటుంది. నాకు పెళ్లి కావాలని కోరుకుంటాను అని లవంగం అంటే.. మోనాలిసా కౌంటర్లు వేస్తుంది. ఇక దమయంతి తీసిన చీటిలో మీ ధ్యేయం ఏంటి? అని అంటుంది. నా ప్రజలకు అండగా ఉండాలి.. చందమామని కోరినా సరే నా కూతురికి తెచ్చిస్తా.. నా కూతురి కళ్లలో సంతోషం చూస్తా అని దమయంతి అంటుంది. దేవుడి తర్వాత మీరు ఆ స్థానంలో చూసే వ్యక్తి ఎవరు అని సుందరి తీసిన చీటిలో ఉంటుంది.దేవుడి తర్వాత ఎవరు ఉంటారు.. ఎవ్వరూ లేరు అని సుందరి అంటుంది. ఓహో.. ఇతను ఒకడు ఉన్నాడు కదా.. నాకు దేవుడి కంటే ముందే నాన్న ఉంటాడు.. నాన్న తర్వాతే దేవుడు అని కవర్ చేస్తుంది సుందరి. ఇష్టం లేని వ్యక్తితో డ్యాన్స్ చేయాలి అని అను తీసిన చీటిలో ఉంటుంది. ఈ ఇంట్లో అందరూ నాకు ఇష్టమే.. ఈ రామలింగం అంటే ఇష్టం లేదు కదా అని అను అంటుంది. అయితే అతడితోనే డ్యాన్స్ చేయ్ అని సునంద, నంద గోపాల్ అంటారు. అబ్బా ఏం నటిస్తున్నారే.. నా ప్రేమకు అడ్డు వచ్చాడు కదా.. మీ ప్రేమకు నేను అడ్డు వస్తా అని ప్రియ లోలోపల అనుకుంటుంది.అను, రామలింగం డ్యాన్స్ చేస్తారు. చివరకు మిగిలిన చీటిని విక్రమ్ తీస్తాడు. మా అన్నయ్య, మా వదిన ఒకటే కదా అని అనసూయ అంటుంది. పెళ్లి గురించి మీ ఒపీనియన్ చెప్పండి అని అందులో ఉంటుంది. ఈ చీటి గురించి రాధ చెబుతుందని విక్రమ్ తప్పించుకుంటాడు. పెళ్లి అంటే.. మనం వేసే ముడి కాదు.. అది దేవుడు వేసిన ముడి.. బ్రహ్మముడి.. మనం ఈ భూమ్మీదకు రాకముందే.. స్వర్గంలో మన పెళ్లి
ఐశ్వర్య ఫోన్లో జీపీఎస్ ట్రాకర్ పెట్టా.. నేను తనను కాపాడుకుంటా.. అది నా బాధ్యత.. నువ్వు కంగారు పడకు స్వాతి ని అంటుంది ఇందు. ఇంకో వైపు వెంకీ ఫోన్ చేస్తున్నాడని నందు గాల్లోతేలిపోతుంది. నాకు తెలుసు రా నాతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవు అని, ఇందు అక్క చెప్పినట్టుగా నువ్వే నాకు ఫోన్ చేస్తున్నావ్ చూడు అని నందు అనుకుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన నందు.. చెప్పు అని అంటుంది. రేపు నీతో మాట్లాడాలి.. వస్తావా? అని అడుగుతాడు వెంకీ. తమరు బిజీ కదా.. నేను కలిస్తే డిస్టర్బ్ అవుతుంది కదా.. మీకు ఒక్క నిమిషం కూడా వృథా కాకూడదు కదా అని నందు సెటైర్లు వేస్తుంది. అదేదో చిరాకులో ఉన్నా.. అందుకే అలా మాట్లాడా.. సారీ అని వెంకీ అంటాడు. నాకేం నీ సారి వద్దు.. నేను అలిగాను అని నందు అంటుంది. రేపు నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి.. కలుస్తావా? అని వెంకీ అంటాడు. లవ్ గురించి చెబుతాడేమో అని నందు సంబరపడుతూ ఓకే చెబుతుంది. సరే వస్తా.. గుడ్ నైట్ అని అంటుంది నందు.తను కాపాడకపోయి ఉంటే చనిపోయేవాడ్ని.. ఎందుకు రా మళ్లీ ఆ అమ్మాయిని కలుస్తా అని అంటున్నావ్ అని లక్ష్మీ అడుగుతుంది. నన్ను మర్చిపోదు.. అందుకే రేపు ఓ ప్లాన్ వేశా అని వెంకీ అంటాడు. ఆ అమ్మాయిని మర్చిపోయి ఉండగలవా అని లక్ష్మీ అడిగితే.. నాన్న కోసం ఉంటాను అమ్మా.. ఆ అమ్మాయి అంటే నాకు ప్రాణం.. ఆ రోజు తను కాపాడకపోయి ఉంటే చనిపోయేవాడ్ని.. కానీ నాన్న కంటే నాకు ఎవ్వరూ ఎక్కువ కాదు అని వెంకీ అంటాడు. నాన్నకి అర్థమయ్యేలా చెప్తాం అని లక్ష్మీ అంటాడు. మనకోసం ఒప్పుకుంటాడు కానీ సంతోషంగా ఉండలేడు కదమ్మా.. నాన్న కోసం నా ప్రేమను త్యాగం చేస్తా అని వెంకీ అంటాడు.అమ్మని, నిన్ను కలిపే బాధ్యత
తాగిన మత్తు కాస్త దిగడంతో మనోజ్ కిందకు వస్తాడు. నన్ను ఈ ఇంటికి ఎవరు తీసుకు వచ్చారు అని మీనాని అడుగుతాడు. మీ నాన్న, మీ తమ్ముడు అని అంటుంది మీనా. ఇంకెవ్వరూ లేరా అని మనోజ్ అడుగుతాడు. లేరు అని మీనా అంటుంది. మనోజ్ బయటకు వెళ్తుంటాడు. ఎక్కడికి అని మీనా అడిగితే.. అది నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని మనోజ్ అంటాడు. ఈ టైంలో ఈయనకు బిజినెస్ ఎందుకు గుర్తుకు వచ్చింది అని మీనా అనుకుంటుంది. ఇంతలో బాలు వస్తాడు. మనోజ్ బయటకు వెళ్లిన సంగతి చెబుతాడు. ఇంట్లో ఎవ్వరూ లేరు కదా.. అని బాలు అంటే.. మీనా రొమాంటిక్‌గా ఫీల్ అవుతుంది. కానీ బాలు మాత్రం మనోజ్ రోహిణి గదిని వెతుకుదాం.. ఏదైనా ఆధారం దొరుకుతుందని అంటాడు. అలా చేయడం తప్పు అని అంటుంది మీనా. బొమ్మ పడితే వెతుకుదాం అని కాయిన్ టాస్ వేస్తాడు. బొమ్మ పడుతుంది.. రూంలో వెతుకుదాం పదా అని బాలు అంటాడు. రూంలోకి వెళ్లి వెతికే ముందే గుమ్మం వద్ద ఉన్న డోర్ వేసి వెళ్తాడు బాలు. ఇక రూంలో వెతుకుతుంటే వారికి ఓ డ్రెస్ కనిపిస్తుంది.మనోజ్, రోహిణిలపై అనుమానం.. ఈ డ్రెస్ ఇక్కడ దాచి పెట్టారు అంటే.. దీని వెనకాల కూడా ఏదో సీక్రెట్ ఉన్నట్టే అని బాలు అంటాడు. మర్చిపోయి పెట్టారా? అయినా.. రోహిణి బీరువాలో ఎందుకు ఉంది? అని మీనా అనుకుంటుంది. మీ అన్నయ్య కొని.. రోహిణి బీరువాలో పెట్టాడా? ఆ చింటుకి అయితే ఇది సరిగ్గా సరిపోతుంది కదండి అని మీనా అంటుంది. అవును అని బాలు అంటాడు. ఆ లింకులు అన్నీ ఇప్పుడు కలుస్తున్నాయి.. అని బాలు, మీనా అనుకుంటారు. ఇంతలో కింద కాలింగ్ బెల్ వినిపిస్తుంది. ఎవరో వచ్చినట్టున్నారు పదా అని బాలు, మీనా కిందకు వెళ్లిపోతారు.ఇదంతా నీ ట్రైనింగే కదరా ఎక్కడికి వెళ్లి
పెద్ద కొడుకే తండ్రి చితికి నిప్పు పెడతాడు.. ఇంకోసారి ఇంట్లోంచి వెళ్లాలనే ఆలోచన వస్తే నా చితికి నిప్పు పెట్టి వెళ్లు రా అని ఏడ్చేస్తాడు నారాయణ. మొదటి సారి తండ్రిలా కనిపించాడు.. కాస్త గట్టిగా కొట్టాడా? పర్లేదులే.. ఇంకోసారి వెళ్లాలంటే ఈ దెబ్బ గుర్తుకు వస్తుంది అని చక్రి అంటాడు. ఇక నారాయణ తన మంచం మీద కూర్చుని బీడీ తాగుతూ ఉంటాడు. ఇప్పుడు నా కంటే రిచ్ ఫెల్లో ఎవడు ఉంటాడు అని ఎంతో ఆనందంగా, సంతోషంగా బీడీ కాల్చేస్తుంటాడు. అందరికీ కాఫీ చేసి ఇస్తుంది మహా. మీ ఇంట్లోనే ఇలా గొప్పగా ఆలోచిస్తుంటారా? అభ్యుదయ భావాలతో ఉంటారా?.. ప్రొగ్రెసివ్ థాట్స్‌తో ఉంటారా? అని మహా అడుగుతుంది. ప్రొగ్రెస్సివ్ థాట్స్ అంటే ఏంటండి అని చక్రి అడిగితే.. ఇల్లు వదిలి వెళ్లిపోతే.. అందరూ బాగు పడతారు.. సమాజం మారిపోతుంది.. జాతకం మారిపోతుంది అని అనుకోవడం.. ఇల్లు వదిలి వెళ్లిపోయారు.. ఏం మారింది.. మీరు లేకపోతే ఈ ఇల్లు లేదు.. మీరు లేకపోతే వీళ్లెవ్వరూ ఉండరు.. మీరు పూలను అంటి పెట్టుకున్న దారం లాంటి వారు అని.. దారం లేకపోతే పూలన్నీ విడిపోతాయి.. అలానే మీరు లేకపోతే వీళ్లంతా ఉండలేరు.. మీ ప్రేమే వీరందరినీ ఇలా ఒక్కటిగా కట్టి పెట్టి ఉంచింది.. అని మహా అంటుంది.ఏ కావో జీ అంటూ మన కాలంలోంచి నిన్నటిని తీసేద్దాం.. అందరం ఇంకా అదే మూడ్‌లో ఉన్నాం.. కాస్త నవ్వించొచ్చు కదా అని చక్రిని మహా అడుగుతుంది. దీంతో మనీషాలో గెటప్ వేసుకుని వస్తాడు చక్రి. ఏ కావో జీ అంటూ అన్నయ్యకి చపాతీలు చేసి పెట్టింది అని నవ్విస్తాడు చక్రి. అసలు నువ్వు అక్కడికి వెళ్తావ్ అని మేం అనుకోలేదు అన్నయ్య అని చక్రి అంటే.. నాకు ఇల్లు, పని తప్పా వేరేది తెలీదు కదా.. మీ అందరి గురించి ఆలోచిస్తూ బాధపడ్డా.. ఎలా తింటారు