
మొత్తానికి పల్లవికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాడు అశ్విన్. అయితే పల్లవి ఏదో సమస్యలో ఉందని కనిపెట్టేసింది అవని. ఇక ఈరోజు (ఆగస్టు 15) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. ఇంట్లో వాళ్లంతా డైనింగ్ టేబుల్‌పై కూర్చుని భోజనం కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో అవని.. స్పెషల్ ఐటమ్‌కి అంటూ ఊరిస్తూ ఉంటుంది. ఇక ఎప్పుడూ వదిన భజనలో భార్యని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్న కమల్.. తొలిసారి పల్లవి మాట వినడంతో ఆనందంతో ఉప్పొంగిపోతుంది భానుమతి. అందరూ వచ్చారు.. అక్షయ్ ఎక్కడా అని పార్వతి అడగడంతో.. ఆరాధ్యని వెళ్లి పిలిచుకుని రమ్మని చెప్తుంది. ఓ పక్క కడుపు కాలిపోతున్నా.. నేను రాను అంటూ ఓవరాక్షన్ చేస్తుంటాడు అక్షయ్. ఇక అవని స్పెషల్ డిష్‌తో ఊరించడంతో ఉరకలేసుకుంటూ వస్తాడు. తీరా ప్లేట్లో కాకరకాయ కర్రీలు వడ్డించేసరికి.. నోరెళ్ల బెడతాడు అక్షయ్. కావాలనే అక్షయ్‌కి కాకరకాయ విందు వడ్డిస్తుంది అవని. ఇక మిగిలిన వాళ్లకి కాకరకాయే వడ్డించడంతో ఒక్కొక్కరి ఫేస్ మాడిపోతుంది. ఏంటి వదినా.. మొత్తం కాకరకాయే. దీన్ని ఎలా తింటాం అని అంటారు కమల్, శ్రీకర్లు. ఇంట్లో పెద్ద వాళ్లు ఉన్నారు కదా.. వాళ్ల కోసంమైన మనం వారానికి ఒకసారైనా కాకరకాయ వెరైటీలే తినాలి’ అని అంటుంది అవని.ఈ చేదు కూరలు నా వల్ల కాదు అని భానుమతి అనడంతో.. అసలు చేసిందే మీకోసం అయితే.. మీరే వద్దంటే ఎట్టా అందరూ తినండి అని అంటుంది అవని. అయితే ఒక్కరు కూడా ఇష్టంగా తినలేరు. ఇందుకే కదా.. ఈ అవని శాడిజం భరించలేం అనే కాదు ఆ పల్లవి పారిపోదాం అని అంటుండేది. లేకపోతే వాళ్లకి ఇష్టమైనవి మానేసి.. అవనికి ఏది ఇష్టమూ అదే వండటం కాదు.. అదే తినాలంటూ బలవంతంగా వాళ్లతో తినిపిస్తుంది అవని. ఆ ఫుడ్ తిన్న తరువాత.. వాళ్ల నోరంతా చేదుగా మారిపోయింది. అయితే అక్షయ్ మీద ఉన్న కోపంతోనే అందరికీ కాకరకాయ వండిపెట్టేసింది తెలుసుకుంటారు కమల్, శ్రీకర్లు. నువ్వు మాట్లాడు అన్నయ్యా.. వదిన కోపం కాకరకాయ కూరలా మారకముందే వెళ్లి వదినతో మాట్లాడు అన్నయ్యా అంటూ తెగ బ్రతిమిలాడతారు కమల్, శ్రీకర్లు.ఆడవాళ్లు వాళ్లకే అలా ఉంటే మనకి ఎంత ఉండాలిరా అని అంటాడు అక్షయ్. ఆడాళ్లతో పెట్టుకుంటే కాపురాలు కూలిపోతాయ్ అన్నయ్యో అని అంటారు కమల్, శ్రీకర్లు. అసలు ఈ కాకరకాయ గోల ఏంట్రా బాబూ అని తలపట్టుకుంటారు. ఇక అక్షయ్.. బెడ్ రూంలోకి వెళ్తాడు. ‘పనికిమాలిన పంతాలకు పోతే నచ్చిన కూరలతో కడుపునిండా తినే అదృష్టం ఉండదని అర్థమయ్యే ఉంటుంది. పెళ్లంతో గొడవలు పడితే తిప్పలు తప్పవు’ అని అక్షయ్ వినాలనే అంటుంది అవని. సరే మీరు బెట్టు దిగకపోతే.. రేపటి నుంచి మీకు ప్రతిరోజూ కాకరకాయే అని అంటుంది అవని. అయినా సరే బెట్టు వీడడు అక్షయ్. దాంతో ‘కోపమా నాపైనా’ అంటూ సాంగ్ వేసుకుంటుంది అవని.వాళ్లేనా సాంగ్‌లు వేసుకునేదీ రొమాన్స్‌లు చేసుకునేదీ అన్నట్టుగా.. కమల్‌కి అడిగి మరీ హగ్ ఇస్తుంది పల్లవి. వాళ్లు కూడా ‘నాలో చిలిపి కల.. నీలా ఎదురైందా.. ఏదో వలపు వలా నన్నే లాగిందా’ అంటూ సాంగ్ వేసుకుంటారు. హగ్ ఇస్తే సరిపోలేదంటాడు కమల్. దాంతో పల్లవి.. ‘పెదవి విందు’ అందిస్తుంది. మీదికి లాక్కుని లిప్ లాక్ రుచి చూపిస్తుంది. ఇక కమల్.. పల్లవిని దగ్గరకు తీసుకుని.. ‘నాకు పిల్లలు కావాలి పల్లవీ’ అంటూ ప్రేమగా అడుగుతాడు. దాంతో పల్లవి ఎమోషనల్ అయ్యి.. కమల్ని హగ్ చేసుకుంటుంది. కట్ చేస్తే దీపాలు ఆర్పినట్టూ.. తెల్లారినట్టూ సింబాలిక్ షాట్ వేస్తారు. అంటే అక్కడ మ్యాటర్ ఏమైందో ఊహకే వదిలేశారన్నమాట.ఇక రేపటి ఎపిసోడ్లో.. అశ్విన్ ఆట కట్టిస్తుంది అవని. పల్లవిని వెంటపెట్టుకుని వెళ్లి.. అశ్విన్‌కి డబ్బులిస్తానని చెప్పి అతని దగ్గరున్న వీడియోలను లాక్కుని పోలీసులతో అరెస్ట్ చేయిస్తుంది అవని. ఆ ముచ్చట తరువాతి ఎపిసోడ్లో చూద్దాం.