
ఇందు, నందు ఎంత చెప్పినా శశి గాడి ట్రాప్ లోంచి ఐశ్వర్య బయటకు రాదు. దీంతో ఐశ్వర్య ఫ్రెండ్ రేణుని తీసుకు వస్తుంది నందు. రేణు కూడా శశి గాడి గురించి నిజం చెబుతుంది. వాడు మంచి వాడు కాదు, నిన్ను మోసం చేస్తున్నాడు.. వాడు ప్రేమించడం లేదు అని రేణు చెబుతుంది. కానీ ఐశ్వర్య మాత్రం నమ్మదు. ఈ ఇందు, నందు నిన్ను భయపెట్టి ఉంటారు.. అందుకే ఇలా చెబుతున్నావ్ అని ఐశ్వర్య అంటుంది. నన్ను ఎవ్వరూ భయపెట్టడం లేదు.. ఇదే నిజం అని అంటుంది రేణు. కానీ ఐశ్వర్య నమ్మదు. నువ్వు నమ్మవు అని నాకు తెలుసే.. అందుకే ఎవరి చేత చెప్పించాలో వాడ్నే తీసుకు వచ్చా అని శశి గాడ్ని దించుతుంది నందు. వీళ్లు చెప్పింది నిజం.. అని శశి గాడు అంటాడు. దీంతో ఐశ్వర్య షాక్ అవుతుంది. ఇప్పటికైనా నమ్ముతావా? అని నందు అంటే.. నమ్మకం ఏం చేస్తుంది అని శేషు, భ్రమరం అంటారు. నీకు బుద్దిలేదా ఇలాంటి పనులు చేయడానికి అని అంతా శశి గాడి మీద ఫైర్ అవుతారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని భ్రమరం అంటుంది.ఇలానే చెప్పమని బెదిరించారు.. ఇప్పుడు మీకు సంతోషమేనా? మీరు చెప్పమన్నట్టుగానే చెప్పా.. అని ప్లేటు ఫిరాయిస్తాడు శశి. ఏంట్రా అబద్దాలు ఆడుతున్నావ్ అని ఇందు అంటుంది. నిన్న వీళ్లు నన్ను కొట్టారు.. ఇలా చెప్పకపోతే నా కుటుంబం పరువుతీస్తామని అన్నారు.. అసలే మాది పెద్ద కుటుంబం.. మా నాన్నకి ఉన్న పలుకుబడి గురించి తెలిసిందే కదా.. అందుకే ఇందాక అలా అబద్దం చెప్పా అని శశి అంటాడు. వాడు అబద్దాలు చెబుతున్నాడు అని ఇందు అంటే.. నువ్వే అబద్దాలు చెబుతావ్.. నేను శశిని నమ్ముతున్నాను.. నేను శశిని ప్రేమిస్తున్నా.. శశినే పెళ్లి చేసుకుంటా అని ఐశ్వర్య అంటుంది.ఇది కూడా దాని అమ్మలాంటిదే.. అక్కా అంటావ్.. ఐశ్వర్య మీద నీకు ఇంత ఉందా? ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని ఇందుని భ్రమరం తిడుతుంది. ఇది కూడా వాళ్ల అమ్మ లానే.. పైకి మంచిదానిలా నటిస్తుంది.. కానీ లోపల మాత్రం ఇలాంటి పనులే చేస్తుంది అని ఐశ్వర్య అంటుంది. ఇంకోసారి మా అమ్మ గురించి మాట్లాడితే బాగోదు అని ఐశ్వర్య అంటుంది.. ఏం చేస్తావే.. ఇలానే అంటాను.. అదే నిజం అని ఐశ్వర్య అంటుంది. మీరు ఏం అనుకున్నా సరే నేను ఐశ్వర్యనే పెళ్లి చేసుకుంటాను అని శశి గాడు అంటాడు.మన వైపు తిప్పుకుందాం వీడు బాగా ఉన్నోడిలా ఉన్నాడు.. మన వైపు తిప్పుకుందాం అని భ్రమరం ప్లాన్ వేస్తుంది. మా ఇంటి పిల్లకు అలా అయిందని ఇందాక అలా మాట్లాడాను.. ఏం అనుకోకు బాబు అని భ్రమరం అంటుంది. ఏం పర్లేదు అండి అని శశి అంటాడు. మీరు ఎన్ని చేసినా కూడా నేను ఐశ్వర్యనే పెళ్లి చేసుకుంటా అని శశి అంటాడు. నువ్వెళ్లు శశి.. నేను మళ్లీ ఫోన్ చేస్తా అని ఐశ్వర్య అంటుంది. సారీ బాబు.. అని రేఖ అంటుంది. ఇందుని ఛీ అంటూ అనుకుంటూ ఐశ్వర్య వెళ్తుంది.ఇందుతో శశి ఛాలెంజ్.. రేయ్ ఇందాక ఎందుకు రా అబద్దాలు చెప్పావ్ అని శశి గాడ్ని అడుగుతుంది ఇందు. నువ్వు నన్ను కొట్టావ్.. నా ఈగో హర్ట్ అయింది.. ఇంత వరకు నేను ఐశ్వర్యను మోసం చేసి వదిలేద్దామని అనుకున్నా.. కానీ నీ దుగ్గిరాల ఇంటికి ఉన్న పరువు, ప్రతిష్టల్ని పోగొడతాను.. అని సవాల్ విసురుతాడు శశి. నేను ఉండగా అది జరగనివ్వను రా.. అని ఇందు అంటుంది. నువ్వు ఎంత చేసినా సరే.. ఐశ్వర్య నన్నే నమ్ముతుంది.. నేను అన్నది చేస్తానో లేదో నువ్వే చూద్దువు గానీ అని అంటాడు శశి.ఇంకోసారి వాడి సంగతి చూద్దాం.. ఏయ్.. ఇందు నీకు అసలు బుద్ది ఉందా.. రాత్రి నాకు విషయం చెప్పొచ్చు.. కదా.. ఇలా చేస్తే వాడి నిజస్వరూపం ఎలా బయటకు వస్తుంది.. నాకు చెప్తే వాడి పని, ఐశ్వర్యకు కళ్లు తెరిపించే పని నేను చూసేవాడ్ని కదా.. అని రాజు అంటాడు. దీంతో ఇందుకి కోపం వస్తుంది. రాత్రి ఫోన్ చేసింది ఇందుకే.. కానీ నువ్వు మాత్రం వినిపించుకోలేదు.. అని తిడుతుంది. అప్పుడే ఏదో మత్తులో ఉన్నాను అని రాజు అంటే.. ఈ ఇంటి మీద నీకు బాధ్యత లేదా.. సమస్యల్లో ఉంటే కాపాడవా? అని ఇందు అంటుంది. ఇకపై ఇలా జరగదు.. ఇంకో ఛాన్స్ దొరుకుతుంది.. అప్పుడు వాడి నిజ స్వరూపం బయటకు తీసుకు వద్దాం అని రాజు అంటాడు.కాళ్లు పట్టుకున్న లక్కీ.. మేడం, ఇంకో రెండు రోజులే ఉన్నాయి.. మా అమ్మని వెతికి పెడతారు కదా.. మొన్నే చూశారు కదా.. ఎంతలా అవమానించారో.. చిన్నప్పటి నుంచీ ఇంతే.. నన్ను, మా అమ్మని అవమానిస్తూనే ఉన్నారు.. ఇందులో నేను చేసిన తప్పేంటి? పుట్టడం నా తప్పా? అందరి రాతల్ని ఆ దేవుడు రాస్తే.. నా రాతని మాత్రం నన్ను వదిలించుకుని మా అమ్మే రాసింది.. నన్ను ఎందుకు వదిలేసిందో ఒక్కసారి మా అమ్మని చూసి అడగాలని ఉంది.. అమ్మని చూడాలని ఉంది మేడం.. దయచేసి మా అమ్మని వెతికి పెట్టండి.. కావాలంటే మీ కాళ్లు పట్టుకుంటాను అని రేఖ కాళ్లు పట్టుకుంటాడు లక్కీ. ఇక లక్కీ గాడి ప్రేమకు రేఖ కరిగిపోతుంది.లక్కీ కోసం మదన్‌ను.. ఇంతలో మదన్ వచ్చి లక్కీతో గొడవ పెట్టుకుంటాడు. నీ అమ్మ నిన్ను అలా వదిలేసిందంటే.. తెలియడం లేదా.. నీ తల్లి తప్పుడు దారిలో కన్నది అని.. నీ తల్లి తప్పుడిది అని మదన్ అంటాడు. దీంతో లక్కీకి కోపం వచ్చి మదన్ కాలర్ పట్టుకుంటాడు. నా కలర్ పట్టుకుంటావా అని మదన్ ఆ లక్కీని కొట్టబోతోంటే రేఖ అడ్డుకుంటుంది. వీడి కోసం నన్ను అడ్డుకుంటావా? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు అని మదన్ వెళ్లిపోతాడు. అప్పటికే అక్కడకు వచ్చిన రాజు తన ఫ్రెండ్ లక్కీని ఓదార్చుతాడు. మీ అమ్మ నీ గురించి కూడా ఆలోచిస్తుంది రా.. నీ అవమానాల్ని చూస్తుంది రా.. మీ అమ్మ వస్తుంది అని రేఖను ఉద్దేశించి అంటాడు రాజు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. 🔹‘గుండెనిండా గుడిగంటలు’ టుడే ఎపిసోడ్: చీదరించుకున్న మనోజ్.. ప్రాధేయపడ్డ రోహిణి.. బాలులో కొత్త అనుమానం





