
దిల్లీ: భారత యువ షట్లర్‌ ఇషారాణి బారువా వియత్నాం ఓపెన్‌ సూపర్‌ 100 బ్యాడ్మింటన్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. చక్కటి ప్రదర్శనతో టైటిల్‌ పోరుకు అర్హత సాధించిన ఇషారాణి.. ఆదివారం జరిగిన ఫైనల్లో అంచనాలను అందుకోలేకపోయింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 39వ స్థానంలో ఉన్న ఆమె 8-21, 15-21తో 106వ ర్యాంకర్‌ సరున్‌రక్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓటమి పాలైంది. 34 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్‌లో తొలి గేమ్‌లో తేలిపోయిన ఇషారాణి.. రెండో గేమ్‌లో పుంజుకున్నప్పటికీ మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





