
నారాయణ నవ్వుతూ వచ్చి తాయారు పక్కన కూర్చుంటాడు. నీ గురించి ఇక్కడ కూడా తెలిసింది.. నువ్వు మన ఏరియాలోనే ఫేమస్ కాదు.. ఇక్కడ కూడా ఫేమస్సే.. మా వియ్యంకురాలికి నీ గురించి తెలిసిపోయింది.. నీ నోరు, గయ్యాలి గంప.. బ్రహ్మ రాక్షసివి అని అంతా తెలిసిపోయినట్టుంది అని ఇలా లేనిపోనివి చెప్పి ఎక్కిస్తాడు నారాయణ. నా గురించి అలా అంటుందా? దాని సంగతి చెప్తా.. అని తాయారు అంటుంది. ఏం చెప్తావ్ అని నారాయణ అంటే.. చెప్పడం లేదు.. కడిగి పారేస్తా అని తాయారు ఆవేశంగా వెళ్తుంది. ఏంటే.. నన్ను ఏదో అన్నావ్ అంట.. ఎలా ఉంది నీకు అని తాయారు రెచ్చిపోతుంది. నా ఇంటికి వచ్చి నన్నే ఏంటో.. గీంటే అంటున్నావ్.. అసలు నువ్వు ఎవత్తివే అని జయంతి మదర్ కూడా ఫైర్ అవుతుంది. నా గురించి నీకు ఎందుకే అని జుట్టు పట్టుకుని కొట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇదంతా చాటుగా నారాయణ అండ్ కో చూసి సంబర పడుతుంటాడు. అటు వైపుగా మాధవ వస్తుంటాడు. ఎందుకు? ఇలా చేస్తున్నారు.. ఏమైంది.. ఈవిడ మా మేనత్త అని అంటాడు మాధవ. ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అని జయంతి మదర్ అంటుంది. ఇలా జరిగినట్టుగా నారాయణ కలలు కంటూ ఉంటాడు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అని నారాయణ ఎగిరి గంతులు వేస్తుంటాడు. ఏం క్యాన్సిల్.. ఎక్కడ క్యాన్సిల్.. నీ కలలోనా? అని తిడతారంతా. అవునా? ఇదంతా నా కలనా? అని నారాయణ షాక్ అవుతాడు. ఇధంతా జరగలేదా? నా ఇమాజినేషనా? అని నారాయణ డల్ అవుతాడు. సరే ఇప్పుడు నిజం చేస్తా.. కలలో వచ్చినట్టుగానే చేస్తా అని నారాయణ అనుకుంటాడు. తాయారు వద్దకు వెళ్లి తాను అనుకున్నట్టుగా అన్నీ ఎక్కించి చెప్తాడు. ఇక తాయారు సైతం జయంతి మదర్ని దుమ్ము దులిపేద్దాం అన్నంత ఫైర్ మీద వెళ్తుంటుంది. నా ప్లాన్ సక్సెస్ అని నారాయణ సంబర పడుతుంటాడు. ఎక్కడికి ఆవేశంగా వెళ్తున్నావ్.. అని గాయత్రి అడ్డుకుంటుంది. వియ్యంకురాలు నన్ను ఏదో అంది అంట.. దాని దుమ్ము దులిపేందుకు వెళ్తున్నా అని తాయారు అంటుంది. అని నీకు ఎవరు? చెప్పారు అని గాయత్రి అడుగుతుంది. ఇంకెవరు ఆ నారి గాడే అని తాయారు అంటుంది. మామయ్యనా? నిన్ను ఎవరైనా తిడితే సంబర పడతాడు కానీ.. నీకు వచ్చి ఎందుకు చెప్తాడు.. ఇందులో ఏదో తిరకాసు ఉందని గాయత్రి అంటుంది. అవును కదా.. వాడు నా గురించి ఎందుకు ఆలోచిస్తాడు.. నాకు ఎందుకు చెప్తాడు అని ఆలోచనల్లో పడుతుంది తాయారు. ప్లాన్ అంతా వేస్ట్ అని నారాయణ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి జయంతి మదర్ వస్తుంది. స్నాక్స్ పంపించాను.. వచ్చాయా? తిన్నారా? ఇంకా ఏమైనా కావాలా? చెప్పండి అని అడుగుతుంది. వద్దులేండి అని గాయత్రి అంటుంది. వస్తానండి.. కాస్త పని ఉంది అని చెప్పి వెళ్లిపోతుంది. చూశావా? నీ మీద కోపం ఉంటే.. నిన్ను తిట్టి ఉంటే ఇలా వచ్చి ప్రేమగా అడిగేదా? అని తాయారుని గాయత్రి అడుగుతుంది. నువ్వు వెళ్లి గొడవ పెట్టి.. ఎంగేజ్మెంట్ ఆగిపోయేలా చేయాలని అనుకున్నావా? అని గాయత్రి అంటుంది. ఛ.. నా ప్లాన్‌ను ఈ గాయత్రి చెడగొట్టిందే అని నారాయణ ఫీల్ అవుతూ ఉంటాడు. అందరూ ఆలోచిస్తూ కూర్చుంటారు. ఎందుకు ఇలా డల్‌గా ఉన్నారు అని గాయత్రి అడుగుతుంది. నీ వల్లే.. నువ్వే మా ప్లాన్‌ను అడ్డుకున్నావ్.. అని నారాయణ అంటాడు. మీకు ఎవ్వరికీ ఈ పెళ్లి ఇష్టం లేదా? అని గాయత్రి అడిగితే. శైలు కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాడు అని జరిగిందంతా గాయత్రికి మహా చెబుతుంది. అయ్యో నాకు తెలీదు కదా మరి.. అందుకే ఆపా అని గాయత్రి అంటుంది. ఇంతలో ఐడియా వచ్చిందంటూ కేశవను పక్కకు తీసుకు వెళ్తాడు కన్నా. ఏంటో చెప్పరా అని మహా అడిగితే.. వచ్చాక చెప్తా అని అంటాడు కన్నా. ఏంట్రా ఇలా తీసుకు వచ్చావ్.. నీ ప్లాన్ ఏంటి? అని కన్నాని కేశవ అడుగుతాడు. అటు చూడు అన్నయ్య అని పంతుల్ని చూపిస్తాడు కన్నా. నా సంభావన విషయంలో నేను ఎంతో కచ్చితంగా ఉంటా.. మాట్లాడుకున్నది ఇవ్వకపోతే.. పీఠల మీద నుంచి కూడా వెళ్లిపోతా.. పెళ్లి కూడా జరిపించను అని ఫోన్లో మాట్లాడుతుంటాడు. ఇతను పంతులు కాదు.. ఇప్పుడు మన పాలిట దేవుడు అని కన్నా అంటాడు. ఏం చేస్తున్నావ్ రా అని కేశవ అడిగితే.. నువ్వు రా అన్నయ్య చెప్తా అని కన్నా అంటాడు. ఈ ఎంగేజ్మెంట్ జరిపితే నీకు ఇస్తామన్న సంభావన కంటే డబుల్ ఇస్తాం.. ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యేలా చూడు అని కన్నా అంటాడు. జాతకాలు కుదరలేదు.. బాగా లేదు అని అబద్దం చెప్పేసేయ్ అని అంటాడు కన్నా. ఏంటి.. అబద్దం చెప్పాలా? కుదరదు అని అంటాడు ఆ పంతులు. ఎందుకు అని కన్నా అడిగితే.. డబుల్ కాదు ట్రిపుల్ ఇస్తే చెప్తా.. అబద్దం కదా.. ఎంగేజ్మెంట్ ఆపాలి కదా.. ఆ మాత్రం తీసుకోవాలి మరి అని అంటాడు ఆ పంతులు. దీంతో సరే అని డబ్బులు ఇస్తారు కన్నా, కేశవ. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.





