
స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు ’ సీరియల్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కథ కూడా మంచి రసపట్టులో సాగుతుంది. ఇంతలో ఊహించని షాక్ ఇచ్చింది జియో హాట్ స్టార్. నిజానికి ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతుండగా.. ఎప్పుడో రాత్రి వరకూ ఏం ఎదురుచూస్తాం.. పైగా నరాలు తెగే ఉత్కంఠ మధ్య సీరియల్స్ సా..గుతూ ఉంటాయి కాబట్టి.. ఆ టెన్షన్ భరించలేక ఉదయాన్నే హాట్ స్టార్‌లోనే చూసేస్తుంటారు చాలామంది సీరియల్స్ ఫ్యాన్స్.అయితే ఈ మధ్య రిపీటెడ్‌గా మంచి రేటింగ్‌తో సాగుతున్న ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌ని హాట్ స్టార్‌లో ఆలస్యంగా స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈరోజు (ఆగస్టు 13) ఎపిసోడ్‌ని ఉదయం ఆరు గంటలకే స్ట్రీమింగ్ చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకూ పాత ఎపిసోడ్‌నే కనిపిస్తుంది తప్పితే.. కొత్త ఎపిసోడ్‌ని స్ట్రీమింగ్ చేయలేదు. దీంతో జియో హాట్ స్టార్‌ని సబ్స్క్రిప్షన్ తీసుకున్న సీరియల్స్ ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. వందలు, వేలు పెట్టి ఈ సీరియల్స్ కోసమే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే.. ఆన్ టైమ్‌లో ఎపిసోడ్ టెలికాస్ట్ చేయకపోవడంతో పెదవివిరుస్తున్నాయి.అయితే హాట్ స్టార్ సీరియల్ ఆలస్యంగా స్ట్రీమింగ్ చేయడం అనేది ఇదే తొలిసారి కాదు. చాలా సందర్భాల్లో ఇదే రిపీట్ అవుతూ వస్తుంది. పోనీ ప్రైమ్ టైమ్‌లో రేటింగ్ పెంచడానికే ఇలా చేస్తున్నారా అంటే.. ఏ మధ్యాహ్నం పూటనే చడీ చప్పుడు లేకుండా కొత్త ఎపిసోడ్‌ని స్ట్రీమింగ్ చేస్తుంటారు. నేటి (ఆగస్టు 13) ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ విషయంలో కూడా అదే రిపీట్ కావచ్చు.ఇక ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కథ విషయానికి వస్తే.. ధీరజ్‌కి వదిలి వెళ్లిపోయిన ప్రేమ.. భద్రావతి మాటల్ని నమ్మి ధీరజ్‌తో ఇంకా ఇంకా దూరాన్ని పెంచుకుంటుంది. అయితే.. ప్రేమ-ధీరజ్‌లు విడిపోవడానికి కారణం భద్రావతి, వల్లీలే అనే విషయాన్ని పసిగట్టిన నర్మద.. ఆ నిజాన్ని ప్రేమకి చేరవేయడానికి గట్టిగానే ప్రయత్నిస్తుంది. అటు విశ్వక్ కూడా.. ప్రేమ-ధీరజ్‌లను ఒక్కటి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే నిన్నటి ఎపిసోడ్లో గుడిలో ప్రేమకి ఘోర అవమానం జరిగింది.ప్రేమకి సర్ది చెప్పే ప్రయత్నంలో పట్టుకోబోయిన ధీరజ్.. ఆమె జాకెట్‌ని చింపేస్తాడు. దాంతో ఆమె నలుగురిలో అవమాన పడుతుంది. ఆడపిల్లతో ఇలాగేనా ప్రవర్థించేది అంటూ రామరాజు ఆగ్రహంతో ఊగిపోతూ.. ధీరజ్ చెంప చెల్లుమనిపిస్తాడు. అటు భద్రావతి ఇదే మంచి అవకాశంగా భావించి.. వాళ్లిద్దరి మధ్య దూరాన్ని పెంచడానికి మరో అడుగు ముందుకి వేసింది.ఆ కళ్యాణ్ గాడితో లేచిపోయిందని అందరి ముందు చెప్పి.. నా మేనకోడల్ని క్యారెక్టర్ లేని దాన్ని చేశాడు.. ఇప్పుడు గుడిలో అందరి ముందు జాకెట్ చింపేసి.. బతికి ఉండగానే చంపేశాడు. ఇంకా ఏం చేయాలనుకుంటున్నావ్ అంటూ చెలరేగిపోతుంది భద్రావతి. అయితే వాళ్లిద్దరి మధ్య గొడవల్ని పెంచొద్దని.. వేదవతి వేడుకుంటుంది. దయచేసి ఇంటికి రా ప్రేమా అని ప్రాధేయపడుతుంది వేదవతి. రామరాజు కూడా.. కాపురాన్ని కూల్చుకోవద్దని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే ప్రేమ మాత్రం.. ధీరజ్‌తో కలిసి ఉండేది లేదని తెగేసి చెప్తుంది.అయితే ప్రేమ ఎంత తెగేసినా.. భద్రావతి ఎంత దిగేసినా .. శ్రీవల్లి కుట్రల్ని కుదేసినా కూడా చివరికి అయ్యేది మాత్రం ప్రేమ తన తప్పుని తెలుసుకుని ధీరజ్ దగ్గరకు రావడమే. ఓ బలమైన భావోద్వేగ సన్నివేశంతో ప్రేమ, ధీరజ్‌లు మళ్లీ కలవబోతున్నారు. భద్రావతి, శ్రీవల్లి కుట్రల్ని.. నర్మద, వేదవతిలు ప్రేమకి అర్థమయ్యేట్టు చెప్పి.. వాళ్ల ఆట కట్టించబోతున్నారన్నమాట.




