
తాళ్లూరు: ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం హరిదాస్ నగర్లో కొందరు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణి చేశారు. ఆ గ్రామంలో వ్యవసాయ శాఖ ప్రకృతి విభాగంలో ఐసీఆర్పీగా పని చేస్తున్న అనంత లక్ష్మి సొంతంగా ఈ ప్రతిమలను తయారు చేశారు. ఆవు పేడ, ఆవు పంచతం, బంక మట్టి, ఆవు నెయ్యి, పేడ మట్టితో పవిత్రమైన వినాయక ప్రతిమలను తీర్చిదిద్దారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ విగ్రహాలు తయారు చేసినట్లు అనంతలక్ష్మి తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




