
ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకడిగా పేరొందాడు. వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, గ్లెన్ మెక్‌గ్రాత్, ఆంబ్రోస్‌లా మంచి పేస్, దూకుడైన బౌలర్. ఇప్పటికీ ఏదైనా సెర్చ్‌ ఇంజిన్‌లో టాప్‌ 5 పేసర్లు ఎవరు అంటే డేల్ స్టెయిన్‌ కూడా ఆ జాబితాలో ఉంటాడు. సఫారీ జట్టు తరఫున 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడిన స్టెయిన్ మొత్తంగా 699 వికెట్లు పడగొట్టాడు. మరి ఇలాంటి పేసర్‌ను సమర్థంగా ఎదుర్కొన్న బ్యాటర్లూ ఉన్నారు. అతడు బౌలింగ్‌కు వచ్చాడంటే పెవిలియన్‌కు చేరిన వారూ లేకపోలేదు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో డేల్ స్టెయిన్ ఎదుట ఓ ప్రశ్న ఎదురైంది. మాజీ క్రికెటర్ వెర్నాన్ ఫిలాండర్‌ ‘‘ఇప్పటికీ మీరు ఏ బ్యాటర్‌కు బౌలింగ్ చేయడానికి ఇష్టపడతారు?’’ అని అడిగాడు. దానికి డేల్ స్టెయిన్ (Dale Steyn) స్పందిస్తూ ‘‘పాక్‌కు చెందిన మాజీ బ్యాటర్ మహ్మద్ హఫీజ్‌కు బౌలింగ్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తా. నేను అతడిని 16 సార్లు ఔట్ చేశా. అందుకే అతడి పేరును చెబుతా. ఎందుకంటే ఎక్కువ సార్లు అతడినే పెవిలియన్‌కు చేర్చా’’ అని వెల్లడించాడు. ‘‘వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Sooryavanshi ) ప్రత్యేకమైన ఆటగాడు. ప్రస్తుతం ఉన్న చాలా మంది అంతర్జాతీయ ఆటగాళ్ల కంటే గొప్పవాడే. బాల మేధావి. భారత క్రికెట్‌కు అద్భుతమైన నిధిలాంటోడు. సచిన్‌, విరాట్ వంటి క్రికెటర్లను చూశాం. వారి కంటే వైభవ్‌ ఇంకా విధ్వంసకరం. కెరీర్‌ను ఇలాగే చక్కగా కొనసాగిస్తే ఆ ఇద్దరిని అధిగమించి పెద్ద స్టార్ అవుతాడు. ఇక్కడ ఒకటే నాకు ఆందోళన కలిగించే అంశం. అతడిని ఎలా మేనేజ్‌ చేస్తారో చూడాలి. మంచిగా చూసుకుంటే గొప్ప ప్రతిఫలం అందిస్తాడు. మీరు (మేనేజ్‌మెంట్) అతడిని సరిగా చూసుకోకపోతే కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తప్పవు’’ అని స్టెయిన్ విశ్లేషించాడు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా ఘనంగా ఆరంభించింది.





