

- కదలని ఖడే హనుమాన్ విగ్రహం
- యంత్రాల విఫలంతో దైవ సంకేతం
- రంగంలోకి దిగిన పురావస్తు నిపుణులు
Khade Hanuman: మధ్యప్రదేశ్లోని ప్రముఖ ధార్మిక క్షేత్రం ఉజ్జయినిలో 2028లో జరగనున్న ప్రతిష్టాత్మక ‘సింహస్థ కుంభమేళా’ ఏర్పాట్లలో భాగంగా రోడ్ల విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కంఠాల్ చౌరాహా – ఛత్రీ చౌక్ మార్గంలో ఉన్న దాదాపు 170 ఏళ్ల నాటి చారిత్రక ‘ఖడే హనుమాన్(Khade Hanuman)’ ఆలయ నిర్మాణాన్ని అధికారులు తొలగించారు. అయితే, ఆ నిలబడి ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని సమీపంలోని టాంకీ చౌక్ వద్దకు సురక్షితంగా తరలించేందుకు జిల్లా యంత్రాంగం, మున్సిపల్ కార్పొరేషన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భారీ క్రేన్లు, హైడ్రాలిక్ యంత్రాలను ఉపయోగించి నాలుగు సార్లు ప్రయత్నించినప్పటికీ విగ్రహం అంగుళం కూడా పక్కకు కదల్లేదు.
- యంత్రాల విఫలంతో దైవ సంకేతం




