
లండన్ వీధుల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది.. తొలిసారి లండన్‌లోని థేమ్స్ నది వద్ద గంగాహారతి కార్యక్రమం జరిగింది. భారతదేశంలోని గంగా నది వద్ద జరిగే ప్రపంచ ప్రసిద్ధ హారతి స్ఫూర్తితో.. తమ సంస్థ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘చిన్మయ మిషన్ UK’, వార్షిక ‘టోటల్లీ థేమ్స్’ ఫెస్టివల్‌తో కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా చిన్మయ మిషన్ UK రెసిడెంట్ టీచర్ బ్రహ్మచారిణి ప్రియ చైతన్య మాట్లాడుతూ.. నదితో పాటు ప్రకృతికి, జీవరాశిని కాపాడే పంచభూతాలకు కృతజ్ఞతలు తెలుపుతూ దీపాలను సమర్పించేందుకు తరతరాలుగా ప్రజలు గంగా తీరంలో ఈ హారతులు ఇస్తున్నారని తెలిపారు. థేమ్స్ నదిపై జరిగిన గంగా హారతి కూడా అదే స్ఫూర్తిని కలిగి ఉందన్నారు.





