
శివ్వంపేట : మెదక్ జిల్లా శివ్వంపేట మండలం సికింద్లాపూర్ గ్రామంలోని అడవిలో లక్ష్మినృసింహ స్వామి కొండపై ఉన్న భారీ బండరాయిపై గుర్తించిన రాతి శిల మహా వినాయక రూపానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఎం. ధనుంజయ శర్మ, పూజారి విద్యాకర్ చారి సోమవారం వినాయక చవితి సందర్బంగా విశేష పూజలు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి వినాయకుడిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ఏవో సారా శ్రీనివాస్, జూనియర్ సహాయకులు నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



