
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఏర్పాటుచేసిన 69 అడుగుల బడా గణనాథుడి విగ్రహానికి రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా దంపతులు తొలి పూజలు చేశారు. విగ్రహ కమిటీ సభ్యులు, మంత్రి పొన్నం ప్రభాకర్‌, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌లు గవర్నర్‌కు స్వాగతం పలికి విగ్రహం వద్దకు తీసుకువెళ్లారు. అనంతరం అర్చకులు గవర్నర్‌తో పూజలు చేయించారు. ఖైరతాబాద్‌ గణనాథుడికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ పట్టువస్త్రాలు సమర్పించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వినాయకుడికి భారీ కండువా, యజ్ఞోపవీతం సమర్పించారు.




