
రాయగడ గ్రామీణం : గణేష్ పూజా మండపంలో విద్యుదాఘాతానికి గురై అల్లు రాజు(26) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం రాయగడ-1 జిల్లాలోని చండీలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జేకేపూర్‌లో జరిగింది. మండపాన్ని అలంకరించే పనులు చేస్తుండగా అల్లు రాజుకు విద్యుత్ తీగ తగిలింది. అతడిని వెంటనే రాయగడ-1 జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు అల్లు రాజు ఆంధ్రప్రదేశ్‌లో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది తన పాఠశాల స్నేహితులతో కలిసి స్వగ్రామం చందిలిలో గణేష్ పూజను నిర్వహించుకునేందుకు రెండు రోజుల క్రితమే వచ్చాడు. ఇందుకోసం ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనతో జేకేపూర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చండీలి పోలీసులు ఈ ఘటనపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




