
పత్తికొండ గ్రామీణం : తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కరవు సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. పత్తికొండ సమీపంలో ఎండిపోయిన వేరుశనగ పంటను సోమవారం సీపీఐ బృందంతో కలిసి ఆయన పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో గతంలో ఎప్పుడూ లేనంతగా కరవు పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. రూ.వేలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు ఎండిపోవడంతో రైతులకు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులను ఆదుకోవడానికి బ్యాంకులో తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని, పంట నష్టపరిహారం కింద ఎకరాకు రూ.50 వేలు చెల్లించాలని, గ్రామాల్లో వలసల నివారణకు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని కోరారు. బృందంలో సీపీఐ రైతు సంఘం నాయకులు రామచంద్రయ్య గిడ్డయ్య, కాటమయ్య, లెనిన్‌ తదితరులు ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





