
అజ్మీర్: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో పట్టపగలు జరిగిన చైన్ స్నాచింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ రిటైర్డ్ గవర్నమెంట్ డాక్టర్ తన భార్యతో కలిసి స్కూటర్‌పై వెళ్తుండగా.. ఇద్దరు దుండగులు బైక్‌పై వెంబడించి బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే దొంగలు వేసిన ప్లాన్ చివరకు వారికే ఎదురుతిరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.



