
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దగ్గర కొంత కాలం మేనేజర్‌గా పని చేసి.. 2020 జూన్ 8న మరణించిన దిశా సాలియన్ మృతి కేసులో సీబీఐ తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే, సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్, మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తదితరుల పేర్లను కూడా సీబీఐ ఎఫ్ఐఆర్లో చేర్చడం గమనార్హం.





