
రూంలో విక్రమ్ కూర్చుంటాడు. విక్రమ్‌కి చీర తగిలేలా అటూ ఇటూ నడుస్తూ పనులు చేసుకుంటూ ఉంటుంది రాధ. ఇక చీర గాలికి విక్రమ్‌కి ఏదో అయిపోతుంది. రాధ చీరని విక్రమ్ పట్టుకుంటాడు. ఏయ్ దొంగ అన్నట్టుగా రాధ చూస్తుంది. ఛీ ఛీ నాకు ఉద్దేశం లేదు అన్నట్టుగా విక్రమ్ చూస్తాడు. చివరకు రూం తలుపులు మూస్తుంది రాధ. ఇంకో వైపు సునంద మాత్రం విక్రమ్ చెబుతున్న అబద్దాలు, ప్రవర్తన బట్టి ఏదో తేడాగా జరుగుతోందని పసి గడుతుంది. ఇదే విషయాన్ని నంద గోపాల్‌కి చెబుతుంది. భార్యాభర్తలు అన్నాక గొడవ కామనే కదా.. వాటిని మన వరకు తీసుకు రాకుండా నీ కొడుకు, కోడలు హ్యాండిల్ చేస్తున్నారు గ్రేట్ కదా అని నంద గోపాల్ అంటాడు.మన పరువు పోవొద్దని విక్రమ్ మీద కోపం ఉన్నా వరలక్ష్మీ వ్రతం కోసం వచ్చింది రాధ.. రాధ లాంటి కోడలు దొరకడం మన అదృష్టం అని అంటుంది సునంద. ఇంకో వైపు రాధ, విక్రమ్ కలిసి సరసాలు చాలు శ్రీవారు అనే పాట వేసుకుంటారు. ఏయ్ ఇదంతా ఎందుకు చేస్తున్నావ్ అని చిరాకు పడతాడు విక్రమ్. రూం అవతల అత్తయ్య, మామయ్య వింటున్నారు సైలెంట్ అని అంటుంది రాధ. కానీ విక్రమ్ నమ్మడు. కావాలంటే వెళ్లి చూసుకోండి అని రాధ అంటుంది. డోర్ తీయగానే నంద గోపాల్ కింద పడిపోతాడు. ఏంటి నాన్నా ఏం చేస్తున్నారు అని విక్రమ్ అడుగుతాడు.ఏం లేదురా మీ నాన్న బాగా తాగాడు.. ఇది మా రూం అనుకుంటున్నాడు.. నేను కాదంటే వినడం లేదు.. ఏవండి ఇది మన రూం కాదు అని నంద గోపాల్ని సునంద తీసుకు వెళ్తుంది. ఇప్పటికైనా నమ్ముతారా? నేను చెప్పేది నమ్మండి అని అంటుంది రాధ. నేను నా కళ్లతో చూస్తేనే నమ్ముతా అని విక్రమ్ అంటాడు. ఇంకో విషయం చెప్తే నమ్ముతారా?.. దొంగ చిట్టి అనిపిస్తోంది.. డీఎన్ఏ టెస్ట్‌లో ఏదో మతలబు ఉంది.. ఎంక్వైరీ చేయండి అని రాధ చెబుతుంది. నేను నమ్మను.. అది మా చిట్టినే.. డీఎన్ఏ రిపోర్ట్ వచ్చింది కదా అని విక్రమ్ అంటాడు.ఇక విక్రమ్ వినడు అనుకుని బయటకు వచ్చిన రాధ ఓ సీన్ చూసి షాక్ అవుతుంది. రామచంద్ర చేత గోరు ముద్దలు పెట్టించుకుంటూ దొంగ చిట్టి నాటకాలు ఆడుతుంది. చూశావా? అన్నట్టు రాధని చూస్తూ కనుబొమ్మలు ఎగిరేస్తుంది చిట్టి. నాన్నా.. నేను దూరం అయితే నువ్వేం చేస్తావ్ అని సుందరి అడుగుతుంది. చేయడానికి నేను ఉంటే కదమ్మా.. నువ్వు దూరమైన క్షణమే నేను చచ్చిపోతాను అమ్మా అని రామచంద్ర అంటాడు. చూశావా? అన్నట్టుగా మళ్లీ కనుబొమ్మలు ఎగిరేస్తుంది దొంగ చిట్టి. దీంతో రాధకి మరింత కోపం వస్తుంది.చేతులు కడిగేసి వస్తా అని రామచంద్ర్ పక్కకి వెళ్తాడు. ఏంటి? వార్నింగ్ ఇస్తే బయటకు వెళ్లకుండా ఇక్కడే ఇలా ఉందేంటి? అని చూస్తున్నావా? జరిగేది ఏంటో నేను చెప్తా.. నువ్వు నన్ను దొంగ చిట్టి అని నిరూపించే ప్రయత్నంలో ఇంట్లో వాళ్లకి దూరం అవుతావ్.. నిన్ను బయటకు గెంటేస్తారు.. ఈ ఇంటికి నేను వారసురాలిని అవుతా.. విక్రమ్‌ని పెళ్లి చేసుకుంటా అని అంటుంది సుందరి. నా భర్త జోలికి వస్తే అపరకాళిలా మారిపోతా.. నేనుండగా గురూజీకి, విక్రమ్‌కి అన్యాయం చేయనివ్వను అంటుంది రాధ. కానీ సుందరి మాత్రం ఏడుస్తూ ఉంటుంది. దీంతో అందరూ వస్తారు. ఈ రాధ నన్ను ఈ ఇంట్లోంచి వెళ్లిపోమని అంటోంది అని ఏడుస్తూ చెబుతుంది సుందరి. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.



