
వట్టిచెరుకూరు: వినాయక చవితి పర్వదినం సందర్భంగా గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని లేమల్లెపాడు గ్రామంలో బొమ్మినేని ప్రేమ సాగర రావు సోమవారం ఉదయం మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. విగ్రహాలతోపాటు పూజకు అవసరమైన సామగ్రిని కూడా ఆయన అందించారు. గడిచిన 12 ఏళ్లగా గ్రామంలో వినాయక చవితి రోజున మట్టి వినాయకులను పర్యావరణ పరిరక్షణ కోసం పంపిణీ చేస్తున్నట్లు బొమ్మినేని ప్రేమ సాగర రావు తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




