
కమాన్‌పూర్ (సెంటినరీకాలనీ): సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల కాలపరిమితి ముగిసింది. దీంతో ఎన్నికలు నిర్వహించాలని, లేనిపక్షంలో అన్ని కార్మిక సంఘాలకు సమాన హోదా కల్పించాలని కోరుతూ టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో ఆర్‌జీ-3 పరిధి ఓసీపీ-2 ఇన్‌ఛార్జి మేనేజర్‌ జయకర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. దేవ శ్రీనివాస్, పాశం శ్రీనివాస్‌రెడ్డి, దాసరి మల్లేష్, ఉరడి రమేష్, వీరగోని సంతోష్, గండి శ్రీనివాస్, బర్ల సుధాకర్, సుద్దాల తిరుపతి, కుమ్మరికుంట వెంకటేష్, సతీష్, సురేష్, రవీందర్ తదితర కార్మికులు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





