
సైకిల్‌పై చక్రి, మహా వెళ్తుంటారు. ఊరి అందాలను చూస్తూ.. ఎంత బాగుందో కదా అని చక్రి, మహా అనుకుంటారు. నాకు వదిలి వెళ్లబుద్ది అవ్వడం లేదు అని మహా.. నాకు అయితే ఇక్కడే ఉండిపోవాలని ఉందంటూ చక్రి.. మళ్లీ ఇల్లు ఎవరు ఇస్తారో అని మహా.. ఖాళీగా ఉంటాయి.. అని చక్రి.. నీ కోసమా? అని మహా.. లేదు వాళ్ల కోసమే.. అందరూ సిటీలోనే జాబ్ చేస్తుంటారు.. మనలా పండుగలకో, జాతరకో వస్తుంటారు కదా అని చక్రి అంటాడు. ఇక్కడే ఓ ఇల్లు ఉంటే ఎంత బాగుండు అని మహా.. అవును అని చక్రి.. మామిడి చెట్టు ఉంటే బాగుంటుంది అని మహా.. జామ చెట్టు ఉంటే ఇంకా బాగుంటుంది అని చక్రి.. ఇలా ఇంటి గురించి మాట్లాడుతూ ఉంటారు. తులసి చెట్టు ఉండాలి.. ఉదయాన్నే మీరు నెత్తికి టవల్ చుట్టుకుని పూజ చేస్తూ ఆ తులసి కోట చుట్టూ తిరగాలి.. అని చక్రి అంటే.. మీరు దేని చుట్టూ తిరుగుతారు అని మహా అడుగుతుంది. నేను కారు చుట్టూ తిరుగుతూ, కారుని క్లీన్ చేస్తూ ఉంటాను అని అంటాడు చక్రి.సైకిల్‌పై సవారి.. మండువాలాంటి ఇల్లు అయితే ఇంకా బాగుంటుందని మహా.. అవును వర్షం నీళ్లు ఇంట్లో పడుతుంటే.. మీరు, నేను కాఫీ తాగుతూ ఉండొచ్చు అని చక్రి అంటే..మన ఇద్దరమే ఎందుకు అందరూ ఉంటారు.. అందరం కలిసే కాఫీ తాగుదాం అని మహా అంటుంది. సరే సరే అని అంటాడు. ఇంతలో పెద్ద బండ అడ్డం వస్తే సైకిల్ నుంచి మహా కింద పడబోతోంది. వెనకాల సీటు ఇరిగింది.. అయినా భార్యాభర్తలు అంటే.. ముందు కూర్చోబెట్టుకోవాలి.. ముందు కూర్చోబెట్టుకో అని ఓ ఆవిడ చెప్పి వెళ్తుంది. దీంతో మహా ముందు కూర్చుంటుంది. పక్కనే కనిపిస్తున్న మామిడి తోటకు వెళ్దాం అని మహా అంటుంది.ఏడ్పించిన ఆకతాయిలు.. మహా, చక్రి నవ్వుతూ మామిడితోటలో అలా సరదాగా తిరుగుతుంటారు. ఇంతలో అక్కడ పేకాట ఆడుకుంటున్న ఆకతాయిలు మహాని ఏడ్పిస్తారు. ఇంత అందమైన అమ్మాయి మన ఊర్లో ఎక్కడుంది రా.. జాతరకు వచ్చి ఉంటుంది.. వాడు ఒక్కడు.. మనం నలుగురం.. వాడేం చేస్తాడ్రా అని వాళ్లు కామెంట్ చేస్తుంటారు. ఏంటి ఇప్పుడు హీరోయిజం చూపిస్తారా? వద్దు.. ఇలాంటి వాళ్లు ఎక్కడికి వెళ్లినా ఉంటారు.. మనం వెళ్లిపోదాం పదా అని చక్రిని తీసుకుని వెళ్తుంటుంది మహా. ఏంట్రా భయపడ్డావా? అని వాళ్లు కామెంట్ చేస్తుంటే.. చక్రిని తీసుకు వెళ్తుంటుంది మహా.కాపాడిన దుర్గ ప్రసాద్.. ఇంతలో ఊరి పెద్ద దుర్గ ప్రసాద్ వచ్చి ఆ నలుగురుని చితకబాదేస్తాడు. మన ఊరికి అతిథులుగా వచ్చిన వారిని ఏడ్పిస్తారా.. నేను ఊరు పెద్దగా ఉండగా ఇలాంటి పనులు చేస్తారా? మీకు ఎంత ధైర్యంరా అనుకుంటూ వాళ్లని పిచ్చ కొట్టుడు కొట్టేస్తుంటాడు. క్షమించండి అని ఆ ఆకతాయిలు అంటే.. నాక్కాదు.. ఆ అమ్మాయిని, అతడ్ని క్షమించమని అడంగండి అని దుర్గ ప్రసాద్ అంటాడు. ఆ రౌడీలు సారీ చెప్పి వెళ్లిపోతారు. వీళ్ల బధులు నేను క్షమించమని అడుగుతున్నాను అమ్మా అని దండం పెట్టేస్తాడు దుర్గ ప్రసాద్.దగ్గరి వాళ్లలానే అనిపిస్తున్నారు.. మీరు ఎందుకు క్షమాపణలు చెబుతున్నారు.. ఇలాంటి వాళ్లు ఎక్కడికి వెళ్లినా ఉంటారు.. అని మహా, చక్రి అంటారు. ఈ తోట మీదేనా? అని అడిగితే.. అవును.. కొన్నాను.. చిన్నప్పుడు నేను, మా అక్క ఈ తోటలకి వచ్చి ఆడుకుందాం అంటే.. తోటమాలి రానిచ్చేవాడు కాదు.. అందుకే కొనేశా.. కానీ ఇప్పుడు మా అక్క లేదు అని అంటాడు దుర్గ ప్రసాద్. ఎందుకో మీతో నా పర్సనల్ విషయాల్ని షేర్ చేసుకోవాలని అనిపించిందంటూ దుర్గ ప్రసాద్ అంటే.. నాక్కూడా దగ్గరి వాళ్లలానే అనిపిస్తోందని చక్రి అంటాడు. ఇంతలో ఆ రౌడీ గాడు వచ్చి అసలు నిజం చెప్తాడు. నాకు తెలీకుండానే వాడి అమ్మ గురించి వాడికే చెప్పానా? అని దుర్గ ప్రసాద్ ఫైర్ అవుతాడు. ఇంకో శైలు, సురేష్, వరాలు, శేఖరం కారులో వెళ్తూ జరిగిన విషయాన్ని తల్చుకుని బాధపడుతుంటారు.ఆకలిగా ఉంది.. తిప్పి తీసుకు వచ్చినందుకు థాంక్స్ అని మహా అంటే.. నన్ను బయటకు తీసుకు వెళ్లండి అని అడిగినందుకు మీకు థాంక్స్ అని చక్రి అంటాడు. బాగుంది కదా.. అని మహా అంటే.. మళ్లీ వెళ్దామా? అని చక్రి అడిగితే.. ఆకలిగా ఉందని మహా అంటుంది. ఇక చక్రి గంతులు వేస్తుంటే.. ఏంట్రా పిచ్చి పట్టిందా అని కేశవ, కన్నా అడుగుతారు. అలా అలా ఊరు తిరిగి ఎంజాయ్ చేసి వచ్చాం.. అని అంటాడు చక్రి. తిట్టలేదా? కోప్పడలేదా? అని కేశవ అడిగితే.. ప్రేమగా మాట్లాడింది అంటూ చక్రి ఓవర్ చేస్తుంటాడు.మహాపై కౌంటర్లు.. పెద్ది.. పెద్ది.. అని పిలుస్తుంది మహా. ఆకలిగా ఉంది పెద్ది అని అంటుంది మహా. అంతా రెడీగానే ఉందని మనీషా అంటే.. మీరు వంట చేశారా? అని మహా అడుగుతుంది. భయపడొద్దు, నేను చేయలేదు.. ఆయనకు సాయం చేశానంతే అని మనీషా అంటుంది. ఈమె చేసినప్పుడే తిన్నాం.. మీరు చేస్తే ఎందుకు తినం అని మహా మీద చక్రి కౌంటర్ వేస్తాడు. ఏయ్ ఏంట్రా మహాని ఏడ్పిస్తున్నావ్.. నీకు గడ్డి పెట్టాలా? అని పెద్ది అంటే.. గడ్డి వద్దు నాక్కూడా ఆకలిగా ఉంది.. అన్నం పెట్టండి అని అంటాడు చక్రి.మాధవకి ప్రేమగా వడ్డించిన మనీషా.. కేశవ, కన్నా ఎక్కడా అని పెద్ది అడుగుతాడు. బుస్సుతో మాట్లాడుతున్నాడేమో అని చక్రి అంటే.. నాకు అదే పనా? అని కేశవ, కన్నా ఎంట్రీ ఇస్తారు. నేను వడ్డిస్తాను అని చెప్పి మనీషానే అందరికీ వడ్డిస్తుంది. గాయత్రి ఎక్కడ.. కనిపించడం లేదు అని పెద్ది అడుగుతాడు. ఇంకా గుడి నుంచి రాలేదేమో.. ఊర్లోకి వెళ్లారేమో.. అయినా దాన్ని ఇక్కడకు మన అత్త రానివ్వదు.. మళ్లీ అదొక గొడవ అని అంటాడు చక్రి. ఇక మాధవకి ప్రేమగా మనీషా వడ్డిస్తుంటే.. మిగతా వారంతా చూసి తెగ సంబర పడిపోతుంటారు.మనీషాతో పెళ్లి.. గాయత్రి సలహా.. ఎక్కడికి వెళ్లారే.. కనిపించలేదు అని గాయత్రిని మాధవ అడుగుతాడు. ఊర్లోకి వెళ్లాం.. నీకే సంబంధాన్ని వెతకడానికి అని గాయత్రి కౌంటర్లు వేస్తుంది. నాకా? సంబంధమా? అని అంటాడు పెద్ది. ఏ పెళ్లి చేసుకోవా? ఆల్రెడీ పిల్లని చూశాం అని గాయత్రి అంటుంది. ఎవరే అని అడుగుతాడు పెద్ది. ఇంకెవరు మన మనీషానే అని అంటుంది గాయత్రి. దీంతో మాధవ షాక్ అవుతాడు. తప్పు.. మన సాయం కోరి వచ్చిన వ్యక్తిని అలా ఊహించుకోకూడదు.. అని మాధవ అంటాడు. మంచి అమ్మాయి.. నిన్ను బాగా చూసుకుంటోంది.. పద్దతులు తెలుసు.. అని గాయత్రి అంటుంది. ఇంతలో వీరిద్దరిని ఇలా చూసిన తాయారు కంగారు పడుతుంది.నా పెంపకంలో తప్పు ఉందా? ఎందుకే వాడి చుట్టూ తిరిగి, వాడితో అలా మాట్లాడుతున్నావ్.. అల్లుడు గారు చూస్తే ఇంకేమైనా ఉందా? అని భయపడుతుంది తాయారు. ఆయన నీలా అనుకోడు, నువ్వు భయపడకు అని అంటుంది గాయత్రి. ఇంకో వైపు ఇంటికి వచ్చిన శేఖరం గుండె బరువుతో కూతురితో మాట్లాడతాడు. నేను ఏమైనా తప్పు చేశానా అమ్మా అని అడుగుతాడు. నువ్వు ఎందుకు తప్పు చేస్తావ్ నాన్నా అని శైలు అంటుంది. నా పెంపకంలో తప్పు ఉందా? అమ్మా అని అడుగుతాడు శేఖరం. బూతద్దం పెట్టి వెతికినా దొరకదు నాన్నా అని శైలు, మరి ఇంత పెద్ద తప్పు ఎందుకు చేశావ్ అమ్మా అని శేఖరం అంటాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.




