
పెద్ద కొడుకే తండ్రి చితికి నిప్పు పెడతాడు.. ఇంకోసారి ఇంట్లోంచి వెళ్లాలనే ఆలోచన వస్తే నా చితికి నిప్పు పెట్టి వెళ్లు రా అని ఏడ్చేస్తాడు నారాయణ. మొదటి సారి తండ్రిలా కనిపించాడు.. కాస్త గట్టిగా కొట్టాడా? పర్లేదులే.. ఇంకోసారి వెళ్లాలంటే ఈ దెబ్బ గుర్తుకు వస్తుంది అని చక్రి అంటాడు. ఇక నారాయణ తన మంచం మీద కూర్చుని బీడీ తాగుతూ ఉంటాడు. ఇప్పుడు నా కంటే రిచ్ ఫెల్లో ఎవడు ఉంటాడు అని ఎంతో ఆనందంగా, సంతోషంగా బీడీ కాల్చేస్తుంటాడు. అందరికీ కాఫీ చేసి ఇస్తుంది మహా. మీ ఇంట్లోనే ఇలా గొప్పగా ఆలోచిస్తుంటారా? అభ్యుదయ భావాలతో ఉంటారా?.. ప్రొగ్రెసివ్ థాట్స్‌తో ఉంటారా? అని మహా అడుగుతుంది. ప్రొగ్రెస్సివ్ థాట్స్ అంటే ఏంటండి అని చక్రి అడిగితే.. ఇల్లు వదిలి వెళ్లిపోతే.. అందరూ బాగు పడతారు.. సమాజం మారిపోతుంది.. జాతకం మారిపోతుంది అని అనుకోవడం.. ఇల్లు వదిలి వెళ్లిపోయారు.. ఏం మారింది.. మీరు లేకపోతే ఈ ఇల్లు లేదు.. మీరు లేకపోతే వీళ్లెవ్వరూ ఉండరు.. మీరు పూలను అంటి పెట్టుకున్న దారం లాంటి వారు అని.. దారం లేకపోతే పూలన్నీ విడిపోతాయి.. అలానే మీరు లేకపోతే వీళ్లంతా ఉండలేరు.. మీ ప్రేమే వీరందరినీ ఇలా ఒక్కటిగా కట్టి పెట్టి ఉంచింది.. అని మహా అంటుంది.ఏ కావో జీ అంటూ మన కాలంలోంచి నిన్నటిని తీసేద్దాం.. అందరం ఇంకా అదే మూడ్‌లో ఉన్నాం.. కాస్త నవ్వించొచ్చు కదా అని చక్రిని మహా అడుగుతుంది. దీంతో మనీషాలో గెటప్ వేసుకుని వస్తాడు చక్రి. ఏ కావో జీ అంటూ అన్నయ్యకి చపాతీలు చేసి పెట్టింది అని నవ్విస్తాడు చక్రి. అసలు నువ్వు అక్కడికి వెళ్తావ్ అని మేం అనుకోలేదు అన్నయ్య అని చక్రి అంటే.. నాకు ఇల్లు, పని తప్పా వేరేది తెలీదు కదా.. మీ అందరి గురించి ఆలోచిస్తూ బాధపడ్డా.. ఎలా తింటారు.. ఎలా ఉంటారు.. నాన్నని ఎవరు చూసుకుంటారు.. కేశవ, చక్రి గొడవని ఎలా ఆపుతారు అని ఇలా చాలా కంగారు పడ్డా అని పెద్ది. ఇంత ప్రేమను పెట్టుకుని ఎందుకు అన్నయ్య వెళ్లావ్ అని కేశవ అంటే.. మీ మంచి గురించే అని పెద్ది అంటాడు.అందరూ కలిసి తెగ నవ్వేసుకుంటూ నువ్వు లేని మంచి.. నువ్వు లేని సంతోషం.. అది మంచి కానే కాదు అన్నయ్య అని కేశవ అంటాడు. నాకు నిద్రే రాలేదు అన్నయ్య, నీ మీద చేయి వేస్తే గానీ నిద్ర రాదు కదా అని కన్నా అంటాడు. నాక్కూడా నిద్ర రాలేదు రా అని పెద్ది అంటే.. ఆ మనీషాని చేయి వేయమనాల్సింది కదా అని చక్రి కామెడీ చేస్తాడు. దీంతో చక్రిని పట్టుకునేందుకు పెద్ది పరుగులు పెడుతుంటాడు. ఇక అందరూ కలిసి తెగ నవ్వేసుకుంటూ సంతోషంగా ఉంటారు. అందరూ రాత్రి పూట భోజనానికి కూర్చుంటారు. సుపుత్ర ఎక్కడ అని మహా అడిగిన క్షణంలో నారాయణ కూడా వస్తాడు. నేను తినను, కోపంగా ఉన్నాను, నా కొడుకుని కొట్టాను కదా అని నారాయణ అంటాడు. వీళ్లేమైనా తక్కువా? మహాలక్ష్మీ నన్ను కడిగేసింది.. అయినా తప్పు చేస్తేనే కదా కొట్టావ్ అని పెద్ది అంటాడు.చివరకు కాటికే పోతారు ఆ సిద్దాంతి నాకు ఏదైనా జరుగుతుందని అంటే వెళ్లేవాడ్ని కాదు.. కానీ నా తమ్ముళ్లకు పెళ్లిళ్లు కావని అన్నాడు.. నా తమ్ముళ్లు బాధపడతారు అని చెప్పాడు.. అందుకే వెళ్లాను అని పెద్ది అంటాడు. నువ్వు వెళ్లిపోతే వీళ్లు బాగు పడతారా? నేను మారతానా? సామాన్యులు ఎంత చేసినా కూటికే సరిపోతుంది.. చివరకు కాటికే పోతారు అని నారాయణ అంటాడు. అబ్బో మీలో గొప్ప ఫిలాసఫర్ ఉన్నాడే.. అని తత్త్వ పుత్ర అని కొత్త పేరు పెడుతుంది మహా. ఏంటి అది త త.. అని నోరు కూడా తిరగడం లేదే అని కేశవ కామెడీ చేస్తాడు. ఇక ఉదయం పూట కన్నా.. అన్నయ్య ఎక్కడ అని కంగారు పడతాడు.తాయారు అత్త, రమణయ్య కూడా బాధపడ్డారు ఇక్కడే ఉన్నా.. ఎటూ పోలేదు రా.. రాత్రంతా కూడా నువ్వు నిద్రపోకుండా చూస్తూనే ఉన్నావ్.. అని పెద్ది అంటాడు. నీకు ఎలా తెలుసు అని కన్నా అంటే.. నేను కళ్లు మూసుకుని అంతా గమనించా అని పెద్ది.. అంటే నేను కూడా రెండు సార్లు చూశా అని మహా అంటుంది. ఇంతలో బయట నుంచి కూరగాయలు తీసుకు వస్తారు చక్రి, కేశవ. కూర గాయల సంచి పట్టుకుని అటు నుంచి అటే వెళ్తాడేమో అని భయపడ్డామని అంటాడు చక్రి. నీ గురించి తాయారు అత్త, రమణయ్య కూడా బాధపడ్డారు అని చక్రి అంటాడు. మన కోసం బాధపడే బంధువులు ఉండాలని చాలా ఏళ్ల నుంచి అనుకుంటున్నాను అని పెద్ది అంటాడు. నీకు జాతకం మీదున్న అనుమానాలన్నీ తీర్చేస్తా అని పెద్ది వెళ్లిపోతారు చక్రి, కేశవ.నలుగురు సిద్దాంతులను తీసుకు వచ్చిన చక్రి.. ఇంటికి నలుగురు సిద్దాంతాల్ని తీసుకు వస్తాడు చక్రి. అన్నయ్య నువ్వు లోపలకు వెళ్లకు.. వదిన కోపంగా ఉంది.. మనం ఈ మధ్య చక్రి అన్నయ్యని తక్కువ చేసి మాట్లాడుతున్నాం అంట.. వదిన తిట్టింది.. అని కేశవతో కన్నా అంటాడు. ఇక నలుగురు సిద్దాంతుల్ని బయట కూర్చోబెడతాడు చక్రి. ఒక్కొక్కరినీ లోపలకు పిలుస్తాను అని చక్రి అంటాడు. అందులో ఒక సిద్దాంతి మహర్జాతకుడు.. గొప్ప వాడు, మంచివాడు.. ఒక్కరిని కూడా నొప్పించడు.. ఏదో దోషం వెంటాడుతోంది.. ఇతను చేసుకున్న దోషం కాదు.. మీ నాన్న మీకోసం మొక్కిన మొక్కు ఒకటి తీర్చలేదు.. రూపం స్త్రీ రూపం.. కర్తవ్యం గ్రామ రక్షణ.. మీ తండ్రి తరంతోనే ఆగిపోయింది.. అందుకే ఆ దేవత శాపం మీ మీద పడింది.. అని సిద్దాంతి చెప్తాడు.గ్రామ దేవతకు పూజ చేయించండి.. దీంతో నారాయణకు రుద్రవరం, తన గతం అంతా ఒక్కసారిగా కళ్ల ముందు తిరుగుతుంది. ఆ పూజ చేస్తే దోషం పోతుందా? అని చక్రి అడిగితే.. తప్పకుండా పోతుంది అని సిద్దాంతి చెబుతాడు. ఆ తర్వాత ఇంకో సిద్దాంతిని పిలుస్తారు. తరతరాలు మీరు పూజించే దేవతను ఈ తరం పట్టించుకోవడం మానేశారు.. అందుకే ఇలా జరుగుతోంది.. పెద్ద వాడి జాతకం వల్ల చిన్న వాళ్ల జీతకం ఎలాంటి ప్రభావం లేదు.. చిన్న వాళ్ల అందరికీ ప్రేమ వివాహాం రాసి పెట్టి ఉంది.. గ్రామ దేవతకు పూజ చేయించండని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మరో సిద్దాంతిని తీసుకు వస్తారు. చిన్న మొక్కు.. మీ పూర్వీకులకు అమ్మ వారు ఇష్టదైవం.. ఆ మొక్కు తీర్చేయండి.. ఆ తర్వాత భవిష్యత్తు దివ్యంగా ఉంది.. అతని జాతకం వల్లే ఈ ఇల్లు ముక్కలు కాకుండా ఉంది.. అని చెప్తాడు ఇంకో సిద్దాంతి.గ్రామ దేవత మీ రాక కోసం చూస్తోంది.. మీ మనసు లోతు తెలిసిన వాళ్లు గుండెల్లో గుడిగడతారు.. దగ్గరి నుంచి చూసిన వాళ్లు మీ నిజాయితీని మెచ్చుకుంటారు.. మీ జాతకంలో ఎలాంటి దోషం లేదు.. మీ పూర్వీకులు చేసిన నిర్లక్ష్యం మీ మీద పడింది.. మీ గ్రామ దేవతను పట్టించుకోలేదు.. మీ ఇష్టం దైవం, గ్రామ దేవత మీ రాక కోసం చూస్తోంది.. మిమ్మల్ని దీవించి పంపిస్తే తప్పా.. ఇవన్నీ తప్పవు.. వెళ్లి మొక్కు తీర్చుకుని రండి అని చెప్తాడు సిద్దాంతి. మీది మహారాజా జాతకం.. పెట్టడం తప్పా.. తీసుకోవడం తెలీదు అని అంటాడు సిద్దాంతి. అందరూ వెళ్లిన తర్వాత.. ఆ గ్రామ దేవత గురించి అడిగితే.. నాకు తెలీదు అని వెళ్లిపోతాడు నారాయణ. ఇప్పటికైనా నీకు అర్థమైందా అన్నయ్య.. నీ వల్ల మాకేం నష్టం జరగదు.. అని కన్నా, కేశవ, చక్రి అంటారు.