
Brahmamudi Serial Today Episode 01 September 2026 Rekha Worried About Madhan And Brahmaramba Again Provokes Bhushan
నేను నిన్ను ఎంతో నమ్మాను మమ్మి.. తల్లిచాటు బిడ్డలా ఉన్నా... నువ్వేం చెప్తే అది చేశా.. చివరకు నాకు ఇష్టం లేని ఇందుని పెళ్లి చేసుకోమన్నావ్.. నేను కూడా చేసుకుంటా అని అన్నా.. నీ మీద నాకు అంత నమ్మకం, ప్రేమ అని మదన్ అంటాడు.
నేను నిన్ను ఎంతో నమ్మాను మమ్మి.. తల్లిచాటు బిడ్డలా ఉన్నా... నువ్వేం చెప్తే అది చేశా.. చివరకు నాకు ఇష్టం లేని ఇందుని పెళ్లి చేసుకోమన్నావ్.. నేను కూడా చేసుకుంటా అని అన్నా.. నీ మీద నాకు అంత నమ్మకం, ప్రేమ అని మదన్ అంటాడు. ఆ మాటలకు రేఖ కన్నీరు పెట్టుకుంటుంది. కానీ నువ్వేం చేశావ్.. నన్ను మోసం చేశావ్.. ఈ లక్కీ గాడు అంటేనే నాకు నచ్చదు.. నా రూంలో ఉంటేనే కంపరంగా ఉంటుంది.. వాడు నన్ను మాట వరసకి తమ్ముడు అంటేనే తట్టుకోలేకపోయేవాడ్ని.. కానీ ఇప్పుడు వాడే నీ కన్న కొడుకు.. నా రక్తం పంచుకుని పుట్టాడని తెలిసేలా చేశావ్.. నేనే నీ లోకం అని అనుకున్నా.. కానీ నీకు ఇంకో లోకం ఉందని తెలిసింది.. రాజు.. నువ్వంటే నాకు కోపం.. కానీ ఈ విషయాన్ని బయట పెట్టి.. నా కళ్లు తెరిపించావ్ థాంక్స్ అని అంటాడు మదన్. నువ్వు ఆవేశంలో, కోపంలో ఉన్నావ్ మదన్ అని రాజు అంటాడు. లేదు అన్నీ ఆలోచించుకునే అంటున్నా అని మదన్ అంటాడు. అల్లుడు ఎక్కడికి వెళ్తావ్ అని భ్రమరం, శేషు అడిగితే.. ఎక్కడికో వెళ్తాను.. ఇక్కడ మాత్రం ఉండలేను.. మా మమ్మీని, ఈ లక్కీ గాడ్ని చూస్తూ ఇక్కడ ఉండలేను అని మదన్ అంటాడు.నేను వాడికి మొహం చూపించలేక.. తమ్ముడు.. తమ్ముడు అని పరిగెత్తుకుంటూ వస్తుంది భ్రమరం. అల్లుడు ఇల్లు వదిలి వెళ్లిపోతోన్నాడు.. నీ కొడుకుని నువ్వు ఆపవా? అని అడుగుతుంది భ్రమరం. ఈ సమాజానికి మొహం చూపించలేక వాడు వెళ్లిపోతోన్నాడు.. నేను వాడికి మొహం చూపించలేక ఈ రూం నుంచి బయటకు రావడం లేదు.. నేను ఏం చేయాలి.. వాడు ఏం చేయాలని అనుకుంటున్నాడో.. చేయనివ్వు అని భూషణ్ కోపంతో రగిలిపోతోంటాడు. దీనికి కారణమైన ఆ రేఖను మాత్రం వదిలి పెట్టొద్దు రా.. నిన్ను, నా అల్లుడ్ని మోసం చేసిందని భ్రమరం అంటుంది.తండ్రి వేరే అని చెప్పాలా? రేయ్ మదన్ నన్ను వదిలి వెళ్లకు రా అని నడి రోడ్డు మీద రేఖ ఏడుస్తూ ఉంటుంది. నువ్వు లేకపోతే నేను ఎలా ఉండాలి రా అని అంటుంది రేఖ. నీకు ఇంకో కొడుకు, పెద్ద కొడుకు ఉన్నాడు కదా.. వాడితో ఉండు.. నా ఫ్రెండ్స్‌కి నేనేం చెప్పాలి.. మా అమ్మకి ఇంకో కొడుకు ఉన్నాడు.. తండ్రి వేరే అని చెప్పాలా? ఈ మాట అంటేనే నీకు కష్టంగా ఉంది కదా.. మరి నేను ఎంత బాధ పడుతున్నాను.. నీకు తెలుసా? అని ఇష్టం వచ్చినట్టుగా మాటలు అనేసి వెళ్లిపోతాడు మదన్.నీ వల్లే ఇదంతా.. ఇదంతా నీ వల్లే రా.. నీ వల్లే నా కొడుకు దూరమయ్యాడు.. నేను వాడ్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను.. ఈ రోజు వాడు నన్ను వదిలి వెళ్లిపోయాడు.. ఇదంతా నీ వల్లే అని రాజు కాలర్ పట్టుకుని ఏడ్చేస్తుంటుంది రేఖ. ఏంటి.. పిన్ని.. బాధగా ఉందా.. నువ్వు ఎదుటి వాళ్లని బాధ పెట్టినప్పుడు కూడా వాళ్లు ఇలానే ఏడ్చి ఉంటారు.. నీ కంట్లో మొదటి సారి కన్నీళ్లు, ఇంత బాధను చూస్తున్నా.. మరి ఈ పాతికేళ్లుగా నా ఫ్రెండ్.. అదే నీ కొడుకు లక్కీ ఎంత బాధపడి ఉంటాడో.. ఎన్ని అవమానాలు పడి ఉంటాడోవాడ్ని దగ్గరకు తీసుకున్నావా? పసికందుగా ఉన్నప్పుడు వదిలేశావ్.. అప్పుడు ఎంతగా కన్నీరు పెట్టి ఉంటాడో.. ఎంత ఏడ్చాడో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఆ ఏడ్పులు నీకు వినిపించాయా? నీ కన్న కొడుకు అని తెలిసిన తర్వాత అయినా నువ్వు మారావా? వాడ్ని దగ్గరకు తీసుకున్నావా? లేదు కదా.. వాడి బాధను ఎవరు పట్టించుకుంటారు.. ఇప్పటికైనా నువ్వు మారు.. అని రాజు అంటాడు. చేసిన తప్పులకు ఎవ్వరైనా సరే అనుభవించాల్సిందే.. ఇధంతా నీ మీద కోపంతో చెప్పడం లేదు.. మారతావ్ అని అనుకుంటున్నా అని రాజు అంటాడు. దీంతో లక్కీ గాడు బాధ పడుతూ ఉంటాడు.మనకు మన మనవడు ఉన్నాడు.. అసలు ఆ రేఖ మనిషేనా? కన్న కొడుకుని అలా వదిలేస్తుందా? దానికి ఆస్తి మీద ఆశ ఉందని తెలుసు. కానీ ఇది వాళ్ల అమ్మకంటే క్రూరంగా ఉంది.. అని అపర్ణ అంటుంది. నేను మన కుటుంబం గురించి ఆలోచిస్తున్నా.. ఇప్పుడు రేఖ గాయపడింది.. దానికి కారణం మన రాజు.. మళ్లీ మన కుటుంబాన్ని ఏమైనా చేస్తుందేమో అని భయంగా ఉందని సుభాష్ అంటాడు. మీరేం భయపడకండి.. మనకు మన మనవడు ఉన్నాడు.. ఏం కానివ్వడు.. అని ధైర్యం చెబుతుంది అపర్ణ. ఒకప్పుడు నేను కూడా భయపడే దాన్ని కానీ ఇప్పుడు మన ఇందుకి తోడుగా మన మనవడు ఉన్నాడని అంటుంది అపర్ణ.బావ బర్త్ డే.. కరెక్ట్‌గా చెప్పావ్ నానమ్మ.. ఇక రేఖ పతనం మొదలైంది.. మనల్ని ఏమీ చేయలేదు.. బావ మనకు తోడుగా ఉంటాడు అని ఇందు అంటుంది. రేపటి విశేషం ఏంటో తెలీదా? మీకు.. రేపు గ్రాండ్‌గా ఏర్పాట్లు చేయాలి కదా అని అంటుంది ఇందు. రేపేంటి విశేషం.. అని అపర్ణ, సుభాష్ అడుగుతారు. రేపు మన బావ బర్త్ డే.. గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేద్దాం అని అంటుంది ఇందు. మరి రాజుకి అనుమానం వస్తుంది కదా అని అపర్ణ అంటే.. చలపతి అంకుల్‌తో మాట్లాడి నేను ప్లాన్ చేస్తా కదా అని అంటుంది ఇందు.వాళ్లకి నిజం చెప్పావా? చలపతి అన్నం తింటూ వెంకీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు. అదే టైంలో ఇందు ఫోన్ చేస్తుంటుంది. ఏంటమ్మా ఫోన్ చేశావ్ అని చలపతి అడుగుతాడు. రేపు రాజు బర్త్ డే అని చెబుతుంది ఇందు. రేపు కాదు కదమ్మా అని చలపతి అంటే.. రేపు మా బావ బర్త్ డే.. రేపే అసలైన బర్త్ డే.. రేపు ఇంట్లో సెలెబ్రేట్ చేయాలని నానమ్మ, తాతయ్య కోరుకుంటున్నారు అని అంటుంది ఇందు. అంటే వాళ్లకి కూడా నిజం చెప్పావా? అని చలపతి కంగారు పడిపోతాడు. చెప్పాల్సి వచ్చింది అంకుల్ అని ఇందు అంటుంది.అనుమానం రాకుండా నేను ప్లాన్ చేస్తా ఎవ్వరికీ చెప్పనని మాట ఇచ్చావ్ కదమ్మా అని చలపతి అంటే.. అలా చెప్పాల్సి వచ్చింది అంకుల్.. ఏమీ కాదు.. ఆ విషయం ఇంకెవ్వరికీ తెలీదు.. మా నాన్నమ్మ, తాతయ్యకి మాత్రమే తెలుసు.. అని ఇందు అంటుంది. బర్త్ డే అక్కడ వద్దు.. ఇక్కడే చేసుకుందాం అని చలపతి అంటాడు. మా ఇంట్లో చేయాలని అనుకుంటున్నారు.. మీరు రండి.. రాజుకి అనుమానం రాకుండా నేను ప్లాన్ చేస్తాను అని ఇందు అంటుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. 🔹‘గుండెనిండా గుడిగంటలు’ టుడే ఎపిసోడ్: ఇటుక ఎత్తి కొట్టానంటే పుచ్చలేచిపోద్ది.. మీనా వార్నింగ్.. భయపడిపోయిన ప్రభావతి





