
ఈ ఇంట్లో ఆడవాళ్లు ఎవరున్నారు.. మహాలక్ష్మీ వల్ల కాదు అని నిప్పుల చట్టి గురించి తాయారు చెబుతుంది. నిప్పుల చట్టి అంటే అమ్మాయి చేతులు కాలుతాయి.. వద్దు అని నారాయణ అంటాడు. కానీ మహాలక్ష్మీ మాత్రం చేస్తాను అని అంటుంది. ఇంటికి వచ్చాక కూడా ఇదే విషయం గురించి మహాలక్ష్మీ మాట్లాడుతుంది. నేను నిప్పుల చట్టి పట్టుకుంటాను అని మహా అంటుంది. అది మేం ఇంకా నిర్ణయించుకోలేదు కదా అని కేశవ అంటాడు. నేను కదా ఎత్తేది.. మీరు నిర్ణయించడం ఏంటి? అని మహా అంటుంది. వద్దు అండి అని చక్రి అంటాడు. మీ తాయారు అత్త చూశారు కదా ఎన్నెన్ని మాటలు అన్నారో అని మహా అంటుంది. ఆమె మాటలు మేమే పట్టించుకోం.. మీరే ఎందుకు పట్టించుకుంటున్నారు అని చక్రి, కేశవ అంటారు. నేను రేపు పెద్ది కోసం నిప్పుల చట్టి పట్టుకుంటాను అని మహా అంటుంది. దీంతో మహాని పక్కకి తీసుకెళ్లి మాట్లాడతాడు పెద్ది. నీకు వద్దని గుడిలోనే చెప్పాను కదమ్మా.. మళ్లీ అలానే అంటావ్ ఏంటి? అని పెద్ది అడుగుతాడు. నేను నీ కోసం చేయాలని అనుకుంటున్నాను పెద్ది అని మహా చెబుతుంది.చక్రిని భర్తగా భావిస్తున్నావా? నువ్వు చక్రిని భర్తగా భావిస్తున్నావా? వాడు కట్టిన తాళిని అంగీకరిస్తున్నావా? లేదు కదా.. నువ్వు మా ఇంటి కోడలిగా ఆ పూజ చేస్తేనే ఫలితం వస్తుంది.. అలా కాదని నువ్వు ఎంత చేసినా వృథానే అవుతుంది. అందుకే వద్దని చెబుతున్నా అని చెప్పేసి వెళ్లిపోతాడు మాధవ. రేపు ఆమె పూజ చేయదు.. వద్దు అని సతీష్‌కి చెప్తాడు మాధవ. మీ ఇష్టం.. అలా చేస్తే మీ దోషాలు పోతాయని అన్నాను అంటే.. మీకు ఇష్టం లేకపోతే వద్దు అని సతీష్ అనేసి వెళ్లిపోతాడు. ఇక రాత్రి అంతా మహా అలా ఆలోచిస్తూనే ఉంటుంది.నాక్కూడా తెలీదు కదరా మహాలక్ష్మీ అలా బయట ఆలోచిస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. మనం ఈ పూజ గురించి చెప్పకుండా ఉండాల్సింది అని పెద్దితో చక్రి అంటాడు. ఇలా అంటాడు, ఇంత ఉంటుందని నాక్కూడా తెలీదు కదరా అని పెద్ది అంటాడు. నేను కూడా వద్దని చెప్పాను అని మాధవ అంటాడు. అవును అన్నయ్య.. స్కూటీ మీద నుంచి పడితే చిన్న గాయం అయితేనే తట్టుకోలేదు.. ఇక నిప్పుల చట్టి పట్టుకుంటే.. తట్టుకోలేదు.. నేను కూడా ఒప్పుకునే వాడ్ని కాదు అని చక్రి అంటాడు. సరే రా వెళ్దాం అని లోపలకు వెళ్లిపోతారిద్దరూ.కాస్త భయంగా ఉంది రా.. మీరు ఇంకా ఇలానే ఉన్నారేంటి రెడీ అవ్వండని సురేష్ అంటాడు. కాస్త భయంగా ఉంది రా అని శైలు అంటుంది. మళ్లీ వాళ్లు వచ్చి గొడవ చేస్తారేమో, ఆల్రెడీ మనదే బాధ్యత అని పోలీసులకి కూడా రాసిచ్చాం కదా అని వరాలు అంటుంది. ఇలా భయపడుతూ ఉంటే ఏం చేయలేం.. చివరకు ఆ మెకానిక్ గాడికే ఇచ్చి చేయాల్సి ఉంటుంది అని సురేష్ అంటాడు. గుడికి వెళ్దాం అని మీరు చెప్పండి అని శేఖరాన్ని వరాలు అడుగుతుంది. నేను చెప్పను.. మీరే చెప్పుకోండి అని వెళ్లిపోతాడు శేఖరం.ఆ పెళ్లి కోసమే ఈ పూజలన్నీ మహాలక్ష్మీ, నారాాయణ ఎక్కడ అనుకుంటూ ఉంటారంతా. మహా ఫోన్లో మాట్లాడుతోందని, నారాయణ ఊరి మీద పడి వైన్ షాప్ కోసం వెతుకుతూ ఉంటాడేమో అని కన్నా, చక్రి కౌంటర్లు వేస్తుంటాడు. ఇంతలో గాయత్రి వస్తుంది. మాధవ చేసిన కాఫీని తాగుతుంది. కన్నాని చిట్టి ఎలుక అని ఏడ్పిస్తుంది. బావ ఇక నువ్వు పెళ్లి చేసుకోవా? అని అడుగుతుంది గాయత్రి. ఆ పెళ్లి కోసమే ఈ పూజలన్నీ అని మాధవ చెబుతాడు. అవునా? అయితే కచ్చితంగా అవుతుంది.. ఈ గ్రామ దేవత చాలా పవర్ ఫుల్ అంట అని గాయత్రి చెబుతుంది.ఎప్పుడు వస్తుందో నేను కూడా మొక్కుకుంటాను, ఇక్కడ కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అంట అని గాయత్రి అంటుంది. ఏం మొక్కుకుంటావ్ అని కన్నా అడిగితే.. మా కన్నా గాడికి దొరక్కపోయినా పర్లేదు కానీ.. మా బావకి మంచి భార్య రావాలని కోరుకుంటాను అని గాయత్రి అంటుంది. మా బావకు కాబోయే అమ్మాయి ఎక్కడో పుట్టే ఉంటుంది.. ఎప్పుడు వస్తుందో అని గాయత్రి అంటుంది. అదే టైంకి మనీషా వచ్చి.. రూంలో వేడి నీళ్లు రావడం లేదు అని చెబుతుంది. అవునా అని మనీషాతో పాటుగా మాధవ వెళ్లిపోతాడు.మనీషాని పట్టుకున్న మాధవ.. ఇప్పుడు వేడినీళ్లు వస్తాయి.. నేను ఆన్ చేశా అని గాయత్రి అంటుంది. ఓ థాంక్స్ అని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి మనీషా వస్తే.. కాలు జారి పడబోతూ ఉంటుంది. ఇంతలో పెద్ది పట్టుకుంటాడు. ఇద్దరూ అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. సిగ్గు పడి అలా మనీషా వెళ్లిపోతుంది. కాలు జారుతూ ఉంటే పట్టుకున్నాను అని గాయత్రితో పెద్ది అంటాడు. నేను అడగలేదు కదా బావ అని గాయత్రి అంటే.. అడుగుతావ్ అని చెప్పా అని పెద్ది తడబడతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక గాయత్రి ఇదంతా చూసి నవ్వుకుంటుంది.మనీషాకి, మాధవకి పెళ్లి.. నువ్వు మా బావ దగ్గరకు ఎలా వచ్చావ్ అని తెలుగులో గాయత్రి అడుగుతుంది. ఆ ప్రశ్న అంతో ఇంతో అర్థమైన మనీషా తన కథ అంతా హిందీలో చెబుతుంది. మా అన్న ద్వారా తెలుసు, మా ఇంట్లో కొన్ని సమస్యలు వస్తే నేను ఇక్కడకు వచ్చి వీళ్లతో ఉంటున్నాను అని మనీషా అంటుంది. కానీ ఆ మాటలేవీ అర్థం కావు గాయత్రికి. నువ్వు కాస్త బయటకు వెళ్తావా? నేను రెడీ కావాలి అని మనీషా హిందీలో అంటే గాయత్రికి అర్థమై బయటకు వెళ్తుంది. ఇక కన్నా గాడితో మనీషాకి, మాధవ బావకి పెళ్లి చేయాల్సిందే రా అని అంటుంది గాయత్రి. అక్కడ నార్త్, ఇక్కడ సౌత్ అని కన్నా అంటే.. ఏదైతే ఏంట్రా అని గాయత్రి అంటుంది.గుడిలో హోమం.. కేశవతో శైలు ఫోన్లో మాట్లాాడుతూ ఉంటుంది. అదే టైంలో వరాలు పిలుస్తుంది. దీంతో ఫోన్ కట్ చేస్తుంది శైలు. మన ఊరి గుడిలో హోమం ఉందట.. మీ నాన్న బంధువులంతా వెళ్తున్నారట.. మనం కూడా వెళ్లాలి కాస్త చీరకట్టుకుని రా.. మీ నాన్న పరువు ఎలాగూ తీశావ్.. ఇప్పుడు ప్రాణాలు కూడా తీయాలని అనుకుంటున్నావా? అని ఇలా ప్రేమగా, ఎమోషనల్‌గా మాట్లాడుతుంది వరాలు. దీంతో శైలు గుడ్డిగా నమ్మేసి రెడీ అవుతాను అని చెబుతుంది. ఈ టైంలో కేశవ ఉండుంటే బాగుండేది.. ఇద్దరం కలిసి దర్శించుకునే వాళ్లం అని శైలు అనుకుంటుంది.నేనే వద్దన్నాను.. నిప్పుల చట్టి ఎత్తడానికి గాయత్రి రెడీ అవుతుంటుంది. నువ్వు కూడా ఎత్తుతున్నావా? అని పెద్ది అడుగుతాడు. ప్రతీ ఏడాది అమ్మ చేస్తుంది.. ఈ సారి కొత్తగా పెళ్లిగా అయింది కాబట్టి.. నేను చేస్తున్నాను అని గాయత్రి అంటుంది. అక్కడ మీ ఆయన ఒక్కడే ఉంటే.. నువ్వేంటే ఇక్కడ అని తాయారు అంటుంది. నన్నెవ్వరూ ఎత్తుకు పోరు లేవే అని గాయత్రి అంటుంది. ఏరా మీ మహాలక్ష్మీ అన్ని మాటలు చెప్పింది.. ఇప్పుడు రావడం లేదా? అని తాయారు అంటుంది. నేనే వద్దన్నాను అత్త అని పెద్ది అంటాడు. ఇంతలో కన్నా, చక్రి వస్తారు. అత్త ఏమైనా అంటోందా? అని గొడవకు రెడీ అవుతుంటే.. వారిని మాధవ పక్కకి తీసుకు వెళ్తాడు.పెళ్లి ఆగకుండా చూసుకో ఇంకో వైపు సురేష్ గాడు పెళ్లికి గుడిలో అన్ని ఏర్పాట్లు చేసేస్తాడు. సురేష్ ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఇక పెళ్లి కొడుకు కూడా తన ఫ్యామిలీతో దిగుతాడు. నిన్ను చూస్తే బాగుంది బావ అని సురేష్ అంటాడు. అంతా ఓకే గానీ ఈ పెళ్లి ఆగకుండా చూసుకో అని ప్రకాష్ అంటాడు. అవన్నీ నాకు వదిలేయ్ బావ నేను చూసుకుంటాను అని సురేష్ అంటాడు. ఇంతకీ మీ వాళ్లు ఎక్కడ్రా అని అడిగితే.. ఈ పాటికే వచ్చేయాలి రా బయల్దేరి ఉంటారు లే అని సురేష్ అంటాడు. ఆటోలో శేఖరం, వరాలు, శైలు వస్తుంటారు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.




