
ఇక్కడికి కూడా దాపరించారా? మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వరా? నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారా? ఇక్కడికి ఎందుకు వచ్చార్రా అని తిడుతుంది తాయారు. ఇదేమైనా నా మొగుడి సొత్తా? మేం రాకూడదా? అని కేశవ అంటాడు. ఈ టైంకే రావాలని, ఇక్కడికే రావాలని ఉందా? ఇక్కడి నుంచి వెళ్లిపోండి..అసలు మీకు ఈ అడ్రెస్ చెప్పింది ఎవడ్రా అని తిడుతుంది తాయారు. మేం వెళ్లం నీకు నచ్చకపోతే.. నువ్వే వెళ్లిపో అని చక్రి, కేశవ అంటాడు. ఈ అడ్రెస్ ఆ మెడలు తిరగనోడే ఇచ్చాడు అని అంటాడు నారాయణ. వాడి సంగతి చెప్తా అని తాయారు రమణయ్యకి ఫోన్ చేసి తిడుతుంది. అమ్మో ఇప్పుడు దీనికి నేనే కావాలని చెప్పాని తెలిస్తే నన్ను చంపేస్తుంది.. అమ్మవారు కలలోకి వచ్చింది. అందుకే చెప్పాను అని కవర్ చేస్తాడు రమణయ్య. ఏమైనా సమస్య.. నేను కూడా రావాలా? అని అంటాడు రమణయ్య. వద్దులే.. ఏమైనా ఉంటే ఫోన్ చేస్తా అప్పుడు రా అని అంటుంది తాయారు. ఇంకో వైపు శైలు, కేశవ మాట్లాడుకుంటూ ఉంటే సురేష్ ఉడికిపోతుంటాడు. దీంతో సురేష్ ఓ కన్నింగ్ ప్లాన్ వేస్తాడు.కేశవతో ఫోన్.. కేశవకి శైలు ఫోన్ చేస్తుంది. వామ్మో ఇది ఫోన్ చేస్తుంది.. ఫోన్ చేయలేదు అని తిడుతుందేమో.. మనమే రిటర్న్‌లో తిడదాం అని కేశవ అనుకుంటాడు. నన్ను మర్చిపోయావా?ఫోన్ కూడా చేయడం లేదు అని శైలు అంటుంది. ఇప్పుడే సత్రంలోకి దిగాం.. ఇక్కడ సిగ్నల్స్ కూడా ఉండటం లేదు అని కేశవ అంటాడు. మనం కూడా అక్కడే పెళ్లి చేసుకుందాం.. ఎలాగూ మనం లేచిపోయి పెళ్లి చేసుకోవాల్సిందే.. నువ్వు మా వాళ్లకి నచ్చవు.. నేను నిన్ను తప్ప ఇంకెవ్వర్నీ చేసుకోను అని అంటుంది శైలు. ఈ మాటలన్నీ కూడా సురేష్ గాడు వింటాడు. వచ్చి శైలుతో గొడవ పడతడు. వందకి ఫోన్ చేయాలా? అని శైలు బెదిరిస్తుంది.సైలెంట్‌గా పెళ్లి.. నేను ఈ ఇంట్లో ఉండాలా? వద్దా.. భరించలేకపోతోన్నా.. ఆ కేశవ గాడు ఊర్లో లేడు.. దీనికి సైలెంట్‌గా పెళ్లి చేసేద్దాం.. నా ఫ్రెండ్ గాడు ఉన్నాడు అని అంటాడు సురేష్. వీడి ఫ్రెండ్ అంటే వాడు ఎంత బేవర్స్ గాడో అని శేఖరం అంటాడు. అయినా పెళ్లి అంటే అది ఒప్పుకోవాలి కదా అని అంటాడు. వెళ్లి చెప్పిండి.. అమ్మా.. నీకు పెళ్లి చేస్తాం అని.. అది వింటుందా.. చెప్పకుండా చేసేయడమే అని వరాలు అంటుంది. రేయ్ నీ ఫ్రెండ్ ఎవరో అన్నావ్ కదా.. కనుక్కుని చెప్పురా చేసేద్దాం.. దీన్ని పంపించేద్దాం అని వరాలు అంటుంది.బామ్మర్ది ఇంటికి వెళ్లిన నారాయణ.. నారాయణ నేరుగా తన బామ్మర్ది ఇంటికి వెళ్తాడు. అలా నారాయణను చూసి షాక్ అవుతాడు. చావుని వెతుక్కుంటూ వచ్చావా? అని అతను అంటే.. బామ్మర్ది బావ బతుకు కోరుకుంటాడు.. కానీ నువ్వు నా చావుని కోరుకుంటున్నావా? అయినా నా బావ చావుకి భయపడేవాడు కాదని చెప్పడానికి వచ్చా అని అంటాడు. నువ్వు మీ అక్కని ఫోటో ఫ్రేమ్‌లో పెట్టుకున్నావ్.. నేను గుండెల్లో పెట్టుకున్నా.. ఆ బాధను తగ్గించుకోడానికి తాగుబోతులా మారా.. కొన్ని నిజాలు గాలి లాంటివి.. కనిపించవు.. నువ్వు ఇంకోసారి నా కొడుకుల జోలికి వస్తే.. నేను మళ్లీ ఈ లోకం దృష్టిలో హంతకుడ్ని అవుతాను అని బెదిరించి వెళ్తాడు నారాయణ. ఇక నారాయణను చంపేందుకు కత్తి ఎత్తుతాడు ఆ వ్యక్తి. కానీ ఊరి జనాలు ఉన్నారని వదిలేస్తాడు.ఈ వేడి నీళ్లు నీ మొహాన కొడతా సత్రంలోని వంటగదిలోనూ తాయారు పెత్తనం చూపిస్తుంది. వేడి నీళ్లు కాచుకుంటా అని మహా అడిగితే.. తాయారు గొడవ చేస్తుంది. ఇవ్వనుపో అని పంపిస్తుంది. దీంతో చక్రి వచ్చి మర్యాదగా అడుగుతాడు. కానీ తాయారు మాత్రం పొగరు చూపిస్తుంది. దీంతో చక్రి బలవంతంగా పొయ్యి మీదున్న వాటిని తీసి పక్కన పెట్టేసి.. మహాకి వేడి నీళ్లు కాచి ఇస్తాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ వేడి నీళ్లు నీ మొహాన కొడతా అని చక్రి బెదిరిస్తాడు. అంతా రౌడీ వెధవలే ఉన్నారు.. అని తాయారు ఫైర్ అవుతుంది.మనం బయటే వండుకుందాం.. తాయారుతో గొడవ ఎందుకు అని పెద్ది బయటే వంట ఏర్పాట్లు చేస్తాడు. తలా ఓ పని చేస్తూ ఉంటారు. ఇంతలో నారాయణ వచ్చి.. ఈ సత్రంలో ఈ సంత ఏంటి? అని అడుగుతాడు. మీ చెల్లి కిచెన్ ఆక్రమించింది అని కేశవ, చక్రి అంటారు. దాని సంగతి చెప్తా అని నారాయణ అంటే.. వదిలేయ్ నాన్నా.. మనం ఇలానే ఇక్కడే వండుకుని తిందాం.. ఇదే బాగుంటుంది అని పెద్ది అంటాడు. మనం ఇలా ఉంటే.. వాళ్లు అక్కడ అలా బాగా లేదు అని కేశవ అంటాడు. దీంతో కన్నా గాడికి గ్యాస్ చెడిపోయేలా చేసి రా అని ప్లాన్ ఇస్తాడు చక్రి.వచ్చి చీ పప్పు పెడతావా? మీ అల్లుడికి మీరేనా పొయ్యి పెట్టేది.. నేను కూడా పెడతాను అని తాయారు అంటుంది. అల్లుడుకి పప్పు పెడుతుంది.. ఛీ అని నారాయణ అంటాడు. మొక్కు తీర్చుకున్నాక కోడి కూర చేస్తా అని తాయారు అంటుంది. మేం మేక కూర చేస్తాం అని నారాయణ అంటాడు. ఇంతలో గాయత్రి వచ్చి చీ పప్పు పెడతావా? మీ అల్లుడికి అని తిడుతుంది. బావ చేస్తున్న వెజిటబుల్ బిర్యానీ వంట వాసన అదిరిపోయింది.. నేను కూడా తినొచ్చా? అని అడుగుతుంది గాయత్రి. ఇంతో వినోద్ కూడా వస్తాడు. మీరు పప్పు తింటారా? బిర్యానీ తింటారా? అని అడుగుతుంది గాయత్రి. బిర్యానీ అని అంటాడు వినోద్. అయితే మా వైపు వచ్చేయండని కేశవ, పెద్ది, చక్రి అందరూ పిలుస్తారు.ఆవిడ మాత్రం ఒక్కరే సపరేట్గా అందరూ కలిసి బయటే కూర్చుని తింటూ ఉంటారు. ఇంతలో సతీష్ వస్తాడు. అందరూ కలిసి బయట తింటున్నారా? బాగుంది అని అంటాడు. మీరు కూడా వచ్చి తినండి అని పెద్ది అంటే.. ఇక్కడ తింటే.. మళ్లీ రేపు నాకు చద్దన్నాన్ని తాలింపు వేసి పెడతారు వద్దు లేండి అని అంటాడు. అందరూ ఇక్కడ తింటుంటే.. ఆవిడ (తాయారు) మాత్రం ఒక్కరే సపరేట్గా తింటున్నారేంటి? అని సతీష్ అడుగుతాడు. ఇటు రండి అని వినోద్ కూడా పిలుస్తాడు. నా పూజలు, వ్రతాలు వేరు లేండి.. మీకు అర్థం కావు అని అంటుంది తాయారు.ఇలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు ఏమీ అనుకోకపోతే ఓ ప్రశ్న అడగనా అని.. మీరు పెళ్లి చేసుకోక ముందే మీ తమ్ముడు చేసుకున్నాడేంటి? అని అడిగేస్తాడు సతీష్. మా వాడికి కూడా ఎప్పుడో అవ్వాల్సిందే కానీ.. వాడు ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి కాళ్లు పట్టుకుంటే త్యాగం చేశాడు అని నారాయణ అంటాడు. ఎంత మంచి మనిషి.. ఇలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు అని మనీషా అంటుంది. ఎందుకు అన్నయ్య.. మీకేం తక్కువ అని వినోద్ అడుగుతాడు. మా ఇల్లే అని నారాయణ అంటాడు. నిజం బయట పడుతుందేమో అని తాయారు కంగారు పడుతుంటుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.





