
ఇష్టమైన వ్యక్తితో డ్యాన్స్ చేయమనే చీటి నంద గోపాల్‌కి వస్తుంది. దీంతో సునందతో కలిసి నంద గోపాల్ స్టెప్పులు వేస్తాడు. లవంగం చీటి తీస్తే.. దేవుడు కనిపిస్తే ఏం కోరుకుంటావ్ అని ఉంటుంది. నాకు పెళ్లి కావాలని కోరుకుంటాను అని లవంగం అంటే.. మోనాలిసా కౌంటర్లు వేస్తుంది. ఇక దమయంతి తీసిన చీటిలో మీ ధ్యేయం ఏంటి? అని అంటుంది. నా ప్రజలకు అండగా ఉండాలి.. చందమామని కోరినా సరే నా కూతురికి తెచ్చిస్తా.. నా కూతురి కళ్లలో సంతోషం చూస్తా అని దమయంతి అంటుంది. దేవుడి తర్వాత మీరు ఆ స్థానంలో చూసే వ్యక్తి ఎవరు అని సుందరి తీసిన చీటిలో ఉంటుంది.దేవుడి తర్వాత ఎవరు ఉంటారు.. ఎవ్వరూ లేరు అని సుందరి అంటుంది. ఓహో.. ఇతను ఒకడు ఉన్నాడు కదా.. నాకు దేవుడి కంటే ముందే నాన్న ఉంటాడు.. నాన్న తర్వాతే దేవుడు అని కవర్ చేస్తుంది సుందరి. ఇష్టం లేని వ్యక్తితో డ్యాన్స్ చేయాలి అని అను తీసిన చీటిలో ఉంటుంది. ఈ ఇంట్లో అందరూ నాకు ఇష్టమే.. ఈ రామలింగం అంటే ఇష్టం లేదు కదా అని అను అంటుంది. అయితే అతడితోనే డ్యాన్స్ చేయ్ అని సునంద, నంద గోపాల్ అంటారు. అబ్బా ఏం నటిస్తున్నారే.. నా ప్రేమకు అడ్డు వచ్చాడు కదా.. మీ ప్రేమకు నేను అడ్డు వస్తా అని ప్రియ లోలోపల అనుకుంటుంది.అను, రామలింగం డ్యాన్స్ చేస్తారు. చివరకు మిగిలిన చీటిని విక్రమ్ తీస్తాడు. మా అన్నయ్య, మా వదిన ఒకటే కదా అని అనసూయ అంటుంది. పెళ్లి గురించి మీ ఒపీనియన్ చెప్పండి అని అందులో ఉంటుంది. ఈ చీటి గురించి రాధ చెబుతుందని విక్రమ్ తప్పించుకుంటాడు. పెళ్లి అంటే.. మనం వేసే ముడి కాదు.. అది దేవుడు వేసిన ముడి.. బ్రహ్మముడి.. మనం ఈ భూమ్మీదకు రాకముందే.. స్వర్గంలో మన పెళ్లి నిశ్చయించబడుతుంది.. ఎవరిని చేసుకోవాలి.. ఎవరితో ఉండాలనేది నిర్ణయించబడుతుంది.. పెళ్లి అనేది ఏడేడు జన్మల బంధం.. ఈ జన్మలో మేం విక్రమ్, రాధలుగా పెళ్లి చేసుకున్నాం అని నేను నమ్ముతున్నాను..ఎవ్వరేం చేసినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా మా ఇద్దరినీ విడదీయలేరు.. ఇది మా గొప్పదనం కాదు.. ఇదే మాంగళ్యబలం.. తాళికి ఉన్న విలువ అని అంటుంది రాధ. దీంతో అందరూ చప్పట్లు కొట్టేస్తారు. అంటే విక్రమ్‌కి ఈ రాధ బాగానే కనెక్ట్ అయింది.. ఆ కనెక్షన్‌ను డిస్ కనెక్ట్ చేసి ఈ ఇంటి నుంచి, ఈ లోకం నుంచి పంపించేయాలి అని దమయంతి అనుకుంటుంది. రాధకు విక్రమ్ మీద చాలా ప్రేమ ఉంది.. కలియుగ రాధ, కృష్ణుల్లా ఉన్నారు.. వారిని విడదీస్తే పాపం అని సుందరి అంటుంది. నేను చెప్పింది నువ్వు చెయ్యి.. నాకు నీతులు చెప్పడానికి నీకు లక్షలు ఇచ్చి ఇక్కడకు తీసుకు రాలేదు.. అని ప్లాన్ చెబుతుంది దమయంతి.నువ్వు నా కూతురిగా పుట్టి ఉంటే ఎంతో బాగుండేదని ఎన్నో సార్లు అనుకున్నాను అమ్మా అని రాధతో రామచంద్ర అంటాడు. ఇంత చిన్న వయసులో పెళ్లి గురించి, మాంగళ్య బంధం గురించి ఎంతో గొప్పగా చెప్పావ్.. అని రామచంద్ర అంటాడు. నన్ను సొంత కూతురిలా చూసుకుంటున్నారు.. మీ ఆశీర్వాదం ఉంటే నేను ఏదైనా సాధిస్తాను అని గురూజీ అని కాళ్లకి నమస్కరిస్తుంది రాధ. నా మనసులో విక్రమ్ గురించి అనుకున్నదే చెప్పాను అని రాధ అంటుంది. ఇష్ట కామ్యార్థ సిద్ధిరస్తు అని ఆశీర్వదిస్తాడు రామచంద్ర.రాధ మాటల గురించి విక్రమ్ ఆలోచిస్తుంటాడు. అదే టైంలో సుందరి వస్తుంది. ఏంటి బావ.. ఇందాక రాధ మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తున్నావా? అవి అందరి ముందు నటించడానికి చెప్పినట్టుగా లేవు.. తన ఫీలింగ్స్ చెప్పినట్టుగా ఉంది.. ఇందులో రాధ తప్పేం లేదు.. తప్పంతా నీదే.. నువ్వు చనువు ఇచ్చావ్.. తనకు ఫీలింగ్స్ కలిగాయి.. రేపు అగ్రిమెంట్ పూర్తయ్యాక కూడా ఇంట్లోంచి వెళ్లను, నీ జీవితంలోంచి వెళ్లను అని అంటే ఏం చేస్తావ్.. ఆ తర్వాత మన పరిస్థితి ఏంటి? అని సుందరి లేనిపోనివి ఎక్కిస్తుంది. దీంతో విక్రమ్ మరింతగా ఆలోచనల్లో పడతాడు. వీరి మాటల్ని విన్న రాధ.. అసలు ఇది చిట్టియేనా? అని అనుమానిస్తుంది.ఇక రాధను బయటకు తీసుకు వెళ్లి.. తన మనసులో ఉన్న విషయం ఏంటి? అన్నది కనుక్కుందామని విక్రమ్ అనుకుంటాడు. అలా రాధను బయటకు తీసుక వెళ్తాడు. మధ్యలో పూల కొట్టుని చూసి ఆగుతుంది రాధ. ఆ పూలు నా తల్లో పెట్టు అని అడుగుతుంది రాధ. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.




